IPL 2024: రోహిత్ శర్మకు ముంబై గుడ్‌బై..? కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా.. ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్..

టీ20 వరల్డ్‌కప్‌నకు ముందుగా రోహిత్ శర్మకు భారీ షాక్ తగిలింది. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ హిట్‌మ్యాన్‌ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తొలగించి.. టీమిండియా స్టార్ ఆల్‌‌రౌండర్ హార్దిక్ పాండ్యాను ఐపీఎల్ 2024 సీజన్‌కు కెప్టెన్‌గా నియమించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు పీటీఐ పేర్కొంది.

IPL 2024: రోహిత్ శర్మకు ముంబై గుడ్‌బై..? కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా.. ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్..
Rohit Sharma
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 15, 2023 | 6:56 PM

టీ20 వరల్డ్‌కప్‌నకు ముందుగా రోహిత్ శర్మకు భారీ షాక్ తగిలింది. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ హిట్‌మ్యాన్‌ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తొలగించి.. టీమిండియా స్టార్ ఆల్‌‌రౌండర్ హార్దిక్ పాండ్యాను ఐపీఎల్ 2024 సీజన్‌కు కెప్టెన్‌గా నియమించింది. ఈ మేరకు పీటీఐ పేర్కొంది. అయితే దీనిపై ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. ఇటీవల గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడింగ్ ద్వారా ముంబై ఫ్రాంచైజీలోకి వచ్చాడు హార్దిక్ పాండ్యా. ఇక వచ్చీరాగానే అతడికి కీలక బాధ్యతలు అప్పజెప్పింది ముంబై ఇండియన్స్. 2013లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన హార్దిక్.. ముంబై ఇండియన్స్ తరపున 92 మ్యాచ్‌లు ఆడాడు. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీలోకి మారాడు. ఇక ఆ జట్టును 2022లో ఛాంపియన్స్‌గా నిలపడమే కాకుండా.. 2023లో ఫైనల్స్‌కు చేర్చాడు.

నాయకత్వ మార్పుపై ముంబై ఇండియన్స్ గ్లోబల్ హెడ్ ఆఫ్ పెర్ఫామెన్స్ మహేలా జయవర్ధనే మాట్లాడుతూ, ‘ఈ నిర్ణయం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీసుకుంది. మొదటి నుంచి ముంబై ఇండియన్స్ సచిన్, హర్భజన్, రికీ పాంటింగ్, రోహిత్ శర్మ లాంటి అద్భుతమైన క్రికెటర్ల నేతృత్వంలో ఎంతో ఎత్తుకు ఎదిగింది. వీరంతా కూడా జట్టును ఎలప్పుడూ విజయతీరాలకు చేర్చడమే కాదు.. భవిష్యత్తును కూడా దృష్టిలో ఉంచుకుని ఫ్రాంచైజీని బలోపేతం చేశారు. దీనికి అనుగుణంగానే హార్దిక్ పాండ్యా ఐపీఎల్ 2024 సీజన్‌కు ముంబై ఇండియన్స్‌ జట్టు కెప్టెన్సీని చేపడతాడు’ అని తెలిపాడు.

‘రోహిత్ శర్మ అసాధారణ నాయకత్వానికి ఫ్రాంచైజీ ఎలప్పుడూ కృతజ్ఞతా భావంతో ఉంటుంది. 2013 నుంచి ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా అతడి పదవీకాలం అసాధారణమైనది అని చెప్పొచ్చు. రోహిత్ నాయకత్వం జట్టుకు అసమాన విజయాలను అందించడమే కాకుండా ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ కెప్టెన్లలో ఒకరిగా అతడి స్థానాన్ని పదిలపరిచింది’ అని జయవర్దనే చెప్పుకొచ్చాడు.

కాగా, ఈ నిర్ణయంతో ముంబై ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ భవిష్యత్ ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు.. ట్రేడింగ్‌కు ఇంకా సమయం ఉండటంతో రోహిత్ ఫ్రాంచైజీ మారే అవకాశం కూడా లేకపోలేదు. అటు టీ20 వరల్డ్‌కప్ దగ్గర పడుతుండటంతో.. రోహిత్ జాతీయ జట్టుకు కెప్టెన్‌గా ఉంటాడా.? లేదా.? అనే దానిపై కూడా స్పష్టత లేదు.