Hardik Pandya: హార్దిక్ పాండ్యా ఖాతాలో అరుదైన రికార్డ్.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా సరికొత్త చరిత్ర..
Hardik Pandya Instagram Followers: హార్దిక్ పాండ్యా మార్చి 6న సోషల్ మీడియాలో మరో రికార్డ్ క్రియోట్ చేశాడు. హార్దిక్ ఈ కొత్త అచీవ్‌మెంట్‌తో ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా నిలిచాడు.
Hardik Pandya: హార్దిక్ పాండ్యా మార్చి 6న సోషల్ మీడియాలో మరో రికార్డ్ క్రియోట్ చేశాడు. హార్దిక్ ఈ కొత్త అచీవ్‌మెంట్‌తో ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా నిలిచాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో హార్దిక్‌ను అనుసరించే వారి సంఖ్య ఇప్పుడు 25 మిలియన్లను దాటింది. ఈ ఫీట్ చేసిన ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన క్రికెటర్‌గా మారాడు. టీమ్ ఇండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా క్రికెట్ ఫీల్డ్‌లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటాడు. దానితో పాటు అతను ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటాడు. హార్దిక్ పాండ్యా తన భార్య, పిల్లలు, సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఏదో ఒకటి పోస్ట్ చేస్తూనే ఉంటాడు. ఇది కాకుండా, గత కొన్ని రోజులుగా, హార్దిక్ పాండ్యా క్రికెట్‌తో పాటు తన ఫ్యామిలీ ఫంక్షన్‌లో చాలా బిజీగా ఉన్నాడు. ఈ కారణంగా, అతని ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య చాలా వేగంగా పెరిగింది.
25 మిలియన్లు దాటిన ఫాలోవర్ల సంఖ్య..
ప్రస్తుతం, రాఫెల్ నాదల్, రోజర్ ఫెదరర్, మాక్స్ వెర్స్టాపెన్, ఎర్లింగ్ హాలాండ్ వంటి గ్లోబల్ స్టార్ల కంటే హార్దిక్ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ సందర్భంగా హార్దిక్ తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ నుంచి ఒక వీడియోను పోస్ట్ చేశాడు. అందులో అతని భార్య 25 ప్రశ్నలు అడుగుతున్నట్లు చూడొచ్చు.
View this post on Instagram
ఈ ప్రేమకు నా అభిమానులందరికీ ధన్యవాదాలు అని హార్దిక్ తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు. నా ప్రతి అభిమాని నాకు చాలా ప్రత్యేకం. ఇన్ని సంవత్సరాలుగా వారి నిరంతర మద్దతు, ప్రేమకు ధన్యవాదాలు. ఈ మేరకు హార్దిక్ తన పోస్ట్‌లో, నా అందమైన భార్య నటాషా 25 మిలియన్ల మంది అనుచరుల ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు నన్ను 25 ప్రశ్నలు అడుగుతోందంటూ చెప్పుకొచ్చాడు.
IPL 2022 నుంచి హార్దిక్ ప్రజాదరణలో భారీ పెరుగుదల కనిపించింది. IPL 2022లో హార్దిక్ తొలిసారిగా కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్ అయ్యాడు. జట్టుకు మొదటిసారి ట్రోఫీని అందించాడు. ఆ తర్వాత టీమ్‌ఇండియా తరపున కూడా హార్దిక్ అద్భుత ప్రదర్శన చేశాడు. బాల్, బ్యాటింగ్‌తో పాటు కెప్టెన్సీతో ఆకట్టుకుంటున్నాడు. ఈ కారణంగా, అతను వైట్ బాల్ క్రికెట్‌కు వైస్ కెప్టెన్‌గా కూడా ఎన్నికయ్యాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..