IPL 2023: సూర్య, ఇషాన్‌లకు అంత సీన్ లేదు.. ముంబై ఇండియన్స్ ఫ్యూచర్ కెప్టెన్ అతనే: మాజీ టీమిండియా క్రికెటర్..

Mumbai Indians Future Captain: IPL 2023 ప్రారంభానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఐపీఎల్ 16వ సీజన్‌కు సంబంధించి రంగం సిద్ధమవుతోంది. అంతర్జాతీయ స్థాయిలో అద్భుత ప్రదర్శన చేస్తున్న కొంతమంది ఐపీఎల్‌ స్టార్లు.. తమ దేశం తరపున సత్తా చాటుతున్నారు.

IPL 2023: సూర్య, ఇషాన్‌లకు అంత సీన్ లేదు.. ముంబై ఇండియన్స్ ఫ్యూచర్ కెప్టెన్ అతనే: మాజీ టీమిండియా క్రికెటర్..
Mumbai Indians 2023
Follow us
Venkata Chari

|

Updated on: Mar 07, 2023 | 8:45 AM

Mumbai Indians Future Captain: IPL 2023 ప్రారంభానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఐపీఎల్ 16వ సీజన్‌కు సంబంధించి రంగం సిద్ధమవుతోంది. అంతర్జాతీయ స్థాయిలో అద్భుత ప్రదర్శన చేస్తున్న కొంతమంది ఐపీఎల్‌ స్టార్లు.. తమ దేశం తరపున సత్తా చాటుతున్నారు. లీగ్ ప్రారంభానికి ముందు ప్యానెల్ చర్చ జరిగింది. ఇందులో క్రిస్ గేల్, అనిల్ కుంబ్లే, పార్థివ్ పటేల్, రాబిన్ ఉతప్ప, స్కాట్ స్టైరిస్, ఆకాష్ చోప్రా పాల్గొన్నారు. ఇందులో IPL 2023 వర్ధమాన ఆటగాడి గురించి చర్చ జరిగింది.

అనిల్ కుంబ్లే మాట్లాడుతూ “అర్ష్‌దీప్ సింగ్ వంటి ఆటగాడితో కలిసి పనిచేశాను. అతను భారతదేశానికి గొప్ప బౌలర్‌గా ఎదగడం చాలా మంచి విషయం. నేను అర్ష్‌దీప్‌ని తదుపరి సూపర్‌స్టార్ బౌలర్‌గా చూడాలనుకుంటున్నాను. ఇషాన్ కిషన్‌కు బ్యాట్‌తో లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడు. కాబట్టి అతను సూపర్‌స్టార్ కావచ్చునని నేను భావిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.

కాబోయే కెప్టెన్‌గా తిలక్ వర్మ..

మాజీ భారత ఆటగాడు పార్థివ్ పటేల్ మాట్లాడుతూ..“ఉమ్రాన్ మాలిక్ వేగంగా బౌలింగ్ చేసే ఆటగాడు. అతను ఇప్పటికే భారత్ తరపున ఆడాడు. అతను సూపర్ స్టార్ కాగలడని నేను అనుకుంటున్నాను. బ్యాటింగ్ పరంగా తిలక్ వర్మ గత రెండేళ్లుగా కనిపిస్తున్నాడు. అతన్ని కనుగొని అతనికి మద్దతు ఇచ్చే అవకాశం నాకు వచ్చింది. అతను గొప్ప క్రికెటర్ అవుతాడు. అతనికి కెప్టెన్‌గా ఉండే సత్తా కూడా ఉంది. కాబట్టి అతను ‘భవిష్యత్తు కెప్టెన్’ కూడా కాగలడని నేను భావిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

కాగా, IPL 2023 మార్చి 31 శుక్రవారం నుంచి ప్రారంభమవుతుంది. 16వ సీజన్ తొలి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లో జరగనుంది. 2022లో గుజరాత్ టైటాన్స్ టైటిల్ గెలుచుకున్న సంగతి తెలిసిందే.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!