IPL 2023: ఢిల్లీ క్యాపిటల్స్‌కు మరో బ్యాడ్ న్యూస్.. గాయంతో స్టార్ బౌలర్ దూరం?

IPL 2023, Delhi Capitals: ఐపీఎల్ 16వ సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. ఇప్పటికే రిషబ్ పంత్ దూరమైన సంగతి తెలిసిందే. తాజాగా మరో ఫాస్ట్ బౌలర్ గాయంతో దూరమయ్యే ఛాన్స్ ఉంది.

IPL 2023: ఢిల్లీ క్యాపిటల్స్‌కు మరో బ్యాడ్ న్యూస్.. గాయంతో స్టార్ బౌలర్ దూరం?
Delhi Capitals
Follow us
Venkata Chari

|

Updated on: Mar 07, 2023 | 7:31 AM

IPL 2023, Delhi Capitals: దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ మధ్య రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ జరుగుతోంది. తొలి మ్యాచ్‌లో నెగ్గిన దక్షిణాఫ్రికాకు ఫాస్ట్ బౌలర్ ఎన్రిక్ నార్కియా రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సెంచూరియన్‌లో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో నార్కియా గజ్జలో గాయంతో ఇబ్బంది పడ్డాడు. నార్కియా గాయం దక్షిణాఫ్రికాతో పాటు IPL ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు సమస్యగా మారవచ్చు. ఫాస్ట్ బౌలర్ 16వ సీజన్‌లో జట్టులో భాగంగా ఉన్నాడు.

వెస్టిండీస్‌తో రెండో టెస్టుకు దూరం..

మొదటి టెస్ట్‌లో తగిలిన గాయాన్ని దృష్టిలో ఉంచుకుని, ముందుజాగ్రత్తగా అన్రిచ్ నార్కియా వెస్టిండీస్‌తో జరిగిన రెండవ టెస్టు కోసం జట్టు నుంచి తొలగించారు. తొలి మ్యాచ్‌లో నార్కియా తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 87 పరుగుల తేడాతో విజయం సాధించింది. నార్కియా స్థానంలో ఏ ఆటగాడిని జట్టులో భర్తీ చేయలేదు. తదుపరి టెస్టులో జట్టు స్పిన్నర్‌తో బరిలోకి దిగవచ్చని తెలస్తుంది. వెస్టిండీస్-దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్టు మార్చి 8 నుంచి జరగనుంది.

ఢిల్లీకి మరో దెబ్బ..

నార్కియా గాయం ఢిల్లీ క్యాపిటల్స్‌కు మరో పెద్ద దెబ్బగా మారవచ్చు. ఫ్రాంచైజీ ఇప్పటికే వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్‌ను కోల్పోయింది. నార్కియా ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన ఫాస్ట్ బౌలర్‌గా ఉన్నాడు. గాయం తిరగబెడితే ఢిల్లీ కష్టాలు మరింత పెరగనున్నాయి.

ఇవి కూడా చదవండి

IPL 2022లో, నార్కియా ఢిల్లీ క్యాపిటల్స్ తరపున మొత్తం 6 మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను బౌలింగ్ చేస్తూ 24.11 సగటుతో 9 వికెట్లు పడగొట్టాడు. ఈ సమయంలో అతని ఎకానమీ రేటు 9.72గా నిలిచింది. అతను ఐపీఎల్ 2023 నుంచి ఔట్ అవుతాడా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియదు. ఐపీఎల్ 16వ సీజన్ మార్చి 31 నుంచి ప్రారంభం కానుంది. అంతకు ముందు తన గాయం నుంచి కోలుకోవచ్చని ఫ్రాంచైజీ భావిస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!