AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GT vs MI, IPL 2024: ముంబైకి షాక్.. ఉత్కంఠ పోరులో గుజరాత్‌ విజయం..

గుజరాత్ టైటాన్స్ అదరగొట్టింది. జట్టులో పెద్దగా స్టార్ క్రికటెర్లు లేకపోయినా ఆల్ రౌండ్ పెర్ఫామెన్స్ తో పటిష్ఠమైన ముంబై ఇండియన్స్ ను ఓడించింది. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఆదివారం (మార్చి 24) రాత్రి ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది.

GT vs MI, IPL 2024: ముంబైకి షాక్.. ఉత్కంఠ పోరులో గుజరాత్‌ విజయం..
Gujarat Titans
Basha Shek
|

Updated on: Mar 26, 2024 | 10:55 PM

Share

గుజరాత్ టైటాన్స్ అదరగొట్టింది. జట్టులో పెద్దగా స్టార్ క్రికటెర్లు లేకపోయినా ఆల్ రౌండ్ పెర్ఫామెన్స్ తో పటిష్ఠమైన ముంబై ఇండియన్స్ ను ఓడించింది. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఆదివారం (మార్చి 24) రాత్రి ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. డెవాల్డ్ బ్రెవిస్ (46) పరుగులు చేయగా, రోహిత్ శర్మ 43 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లు నిరాశపర్చడంతో ముంబైకు పరాజయం తప్పలేదు. ఇషాన్ కిషన్ (0), నమన్ ధిర్ (20), తిలక్ వర్మ (25), టిమ్ డేవిడ్(11), హార్దిక్ పాండ్యా (11) పెద్దగా ఆకట్టుకోలేదు.  గుజరాత్‌ బౌలర్లలో ఒమర్జాయ్‌, ఉమేశ్‌ యాదవ్‌, జాన్‌సన్‌, మోహిత్‌ శర్మ తలో రెండు వికెట్లు తీశారు.     కాగా ఈ విజయంతో గుజరాత్‌కు కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ శుభారంభం చేశాడు.  కాగా గత 11 ఏళ్ల సంప్రదాయాన్ని కొనసాగిస్తూ   ఈ ఐపీఎల్ సీజన్‌లో కూడా మొదటి మ్యాచ్ లో ఓటమిపాలైంది ముంబై.

ఇవి కూడా చదవండి

ఇంపాక్ట్ డెవాల్డ్ బ్రెవిస్ ముంబై తరఫున అత్యధికంగా 46 పరుగులు చేశాడు. డెవాల్డ్ ఇన్నింగ్స్‌లో 3 సిక్సర్లు, 2 ఫోర్లు ఉన్నాయి. రోహిత్ శర్మ 29 బంతుల్లో 43 పరుగులు చేశాడు. తిలక్ వర్మ 25 పరుగులు జోడించాడు. నమన్ ధీర్ 20 పరుగులు చేశాడు. జట్టు డేవిడ్ 11 పరుగుల వద్ద ఔటయ్యాడు. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ 2 వికెట్లు తీశాడు. అంతకు ముందు ముంబై టాస్ గెలిచి గుజరాత్‌ను బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. దీంతో గుజరాత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. గుజరాత్ తరఫున వృద్ధిమాన్ సాహా 19, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 31, సాయి సుదర్శన్ 45, అజ్మతుల్లా 17, డేవిడ్ మిల్లర్ 12, విజయ్ శంకర్ 6*, రాహుల్ తెవాటియా 22, రషీద్ ఖాన్ 4* పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లు తీశాడు. గెరాల్డ్ కోయెట్జీ రెండు వికెట్లు తీశాడు. పీయూష్ చావ్లా 1 వికెట్ తీశాడు.

ముంబై ఇండియన్స్

రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, నమన్ ధీర్, హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్, షామ్స్ ములానీ, పీయూష్ చావ్లా, జెరాల్డ్ కోయెట్జీ, జస్ప్రీత్ బుమ్రా, ల్యూక్ వుడ్.

గుజరాత్ టైటాన్స్ జట్టు..

శుభమాన్ గిల్ (కెప్టెన్), వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జోయ్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, ఉమేష్ యాదవ్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్,  జాన్సన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కష్టపడ్డాడు..అనుకున్నది సాధించాడు! డెలివరీ బాయ్‌ టు బిజినెస్‌మేన్
కష్టపడ్డాడు..అనుకున్నది సాధించాడు! డెలివరీ బాయ్‌ టు బిజినెస్‌మేన్
ఆఫీస్ డెస్క్‌పై ఇవి ఉంటే మీ కెరీర్ రాకెట్‌లా దూసుకుపోవడం ఖాయం..
ఆఫీస్ డెస్క్‌పై ఇవి ఉంటే మీ కెరీర్ రాకెట్‌లా దూసుకుపోవడం ఖాయం..
కొండెక్కిన చికెన్‌ ధరలు.. ప్రస్తుతం కిలో ధర ఎంత ఉందంటే?
కొండెక్కిన చికెన్‌ ధరలు.. ప్రస్తుతం కిలో ధర ఎంత ఉందంటే?
ఆ స్టార్ హీరో సినిమాపై అక్కినేని కోడలి ప్రశంసల జల్లు
ఆ స్టార్ హీరో సినిమాపై అక్కినేని కోడలి ప్రశంసల జల్లు
మేకింగ్‌తో రాజమౌళినే ఫిదా చేసిన సినిమా ఏదో తెలుసా?
మేకింగ్‌తో రాజమౌళినే ఫిదా చేసిన సినిమా ఏదో తెలుసా?
శీతాకాలంలో ఈ కూరగాయను పండించండి.. తక్కువ ఖర్చుతో రెట్టింపు ఆదాయం!
శీతాకాలంలో ఈ కూరగాయను పండించండి.. తక్కువ ఖర్చుతో రెట్టింపు ఆదాయం!
మరో ప్లేయర్‌పైనా గంభీర్ పగ పట్టాడా.. వైట్ బాల్ కెరీర్ క్లోజ్?
మరో ప్లేయర్‌పైనా గంభీర్ పగ పట్టాడా.. వైట్ బాల్ కెరీర్ క్లోజ్?
అయ్యో.. పుట్టింట్లో భార్య.. లాడ్జిలో భర్త.. ఆత్మహత్యల వెనక అసలు..
అయ్యో.. పుట్టింట్లో భార్య.. లాడ్జిలో భర్త.. ఆత్మహత్యల వెనక అసలు..
మందారం నీరు తాగడం వల్ల మీ ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
మందారం నీరు తాగడం వల్ల మీ ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
మీ వాష్ బేసిన్ ట్యాప్‌పై మొండి మరకలు పోవాలా? అద్భుతమైన ట్రిక్స్‌!
మీ వాష్ బేసిన్ ట్యాప్‌పై మొండి మరకలు పోవాలా? అద్భుతమైన ట్రిక్స్‌!