IPL 2024, RCB vs PBKS: బెంగళూరు బోణీ కొట్టేనా? పంజాబ్ కింగ్స్‌తో తలపడనున్న ఆర్సీబీ.. గత రికార్డులివే
Royal Challengers Bengaluru vs Punjab Kings Preview And Predicted XI: IPL 2024 ఆరవ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. సోమవారం (మార్చి 25) ఎం. చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

Royal Challengers Bengaluru vs Punjab Kings Preview And Predicted XI: IPL 2024 ఆరవ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. సోమవారం (మార్చి 25) ఎం. చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా తొలి మ్యాచ్ లో ఓడిన ఆర్సీబీ పంజాబ్ పై గెలిచి బోణి కొట్టాలనుకుంటోంది. మరోవైపు పంజాబ్ తన విజయ పరంపరను కొనసాగించాలని చూస్తోంది. లీగ్ తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడిన శిఖర్ ధావన్ టీమ్ సునాయసంగా గెలుపొందింది. తద్వారా రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించాలని పంజాబ్ లక్ష్యంగా పెట్టుకుంది. అంతకంటే ముందు ఇరు జట్ల మధ్య మ్యాచ్ రిపోర్టును పరిశీలిస్తే.. పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లను చూస్తే.. ఆర్సీబీపై పంజాబ్ దే పైచేయిగా కనిపిస్తుంది. ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్లు 31 సార్లు తలపడ్డాయి. ఈ సమయంలో పంజాబ్ కింగ్స్ 17 మ్యాచ్‌లు గెలుపొందగా, మరోవైపు RCB 14 మ్యాచ్‌లు గెలిచింది.
ఇక IPL 2024లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రదర్శనను పరిశీలిస్తే, టోర్నమెంట్ మొదటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ RCBని 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఐపీఎల్ 2024 రెండో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్‌పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 9 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. పంజాబ్ ఈ లక్ష్యాన్ని సునాయసంగా ఛేదించింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు
ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్‌వెల్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్, సుయేష్ ప్రభుదేశాయ్, విల్ జాక్వెస్, మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, మనోజ్ భాండాగే, మయాంక్ దాగర్, విజయ్ కుమార్ వైషాక్, ఆకాశ్ దీప్, ., మహ్మద్ సిరాజ్, రీస్ టోప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్, కామెరాన్ గ్రీన్, అల్జారీ జోసెఫ్, యష్ దయాల్, టామ్ కరణ్, లక్కీ ఫెర్గూసన్, స్వప్నిల్ సింగ్, సౌరవ్ చౌహాన్.
పంజాబ్ కింగ్స్ జట్టు
శిఖర్ ధావన్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జితేష్ శర్మ, సికిందర్ రజా, రిషి ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, అథర్వ తేదే, అర్ష్‌దీప్ సింగ్, నాథన్ ఎల్లిస్, సామ్ కరణ్, కగిసో రబడ, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ భత్రి ., విద్వాత్ కావరప్ప, శివమ్ సింగ్, హర్షల్ పటేల్, క్రిస్ వోక్స్, అశుతోష్ శర్మ, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, శశాంక్ సింగ్, తనయ్ త్యాగరాజన్, ప్రిన్స్ చౌదరి, రిలే రోసో.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




