ఈ ఫొటోలోని క్రికెటర్‌ను గుర్తుపట్టారా? ప్రాణాలను పణంగా పెట్టి టీమిండియాకు ప్రపంచకప్‌ తెచ్చాడండోయ్‌

ఈ ఫొటోలో తండ్రి భుజాలపై కూర్చొని ఉన్నది.. ఆపై కలర్‌ ఫుల్‌ డ్రెస్‌తో కనిపిస్తున్నది ఓ లెజెండరీ క్రికెటర్‌. ఇతను టీమిండియాలో స్టార్‌ బ్యాటర్‌గా గుర్తింపు పొందాడు. సొగసైన షాట్లు ఆడడంలో నేర్పరి. అంతేకాదు తన స్పిన్‌ ట్యాలెంట్‌తో అప్పుడప్పుడు ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. టీమిండియా వన్డే స్పెషలిస్ట్‌గా గుర్తింపు పొందిన అతని పేరిట..

ఈ ఫొటోలోని క్రికెటర్‌ను గుర్తుపట్టారా? ప్రాణాలను పణంగా పెట్టి టీమిండియాకు ప్రపంచకప్‌ తెచ్చాడండోయ్‌
Cricketer
Follow us
Basha Shek

|

Updated on: Apr 12, 2023 | 8:55 AM

ఈ ఫొటోలో తండ్రి భుజాలపై కూర్చొని ఉన్నది.. ఆపై కలర్‌ ఫుల్‌ డ్రెస్‌తో కనిపిస్తున్నది ఓ లెజెండరీ క్రికెటర్‌. ఇతను టీమిండియాలో స్టార్‌ బ్యాటర్‌గా గుర్తింపు పొందాడు. సొగసైన షాట్లు ఆడడంలో నేర్పరి. అంతేకాదు తన స్పిన్‌ ట్యాలెంట్‌తో అప్పుడప్పుడు ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. టీమిండియా వన్డే స్పెషలిస్ట్‌గా గుర్తింపు పొందిన అతని పేరిట అంతర్జాతీయ క్రికెట్‌లో లెక్కలేనన్ని రికార్డులు ఉన్నాయి. అయితే వీటన్నిటికీ మించి ప్రతి క్రికెటర్‌ కోరుకునే కల ప్రపంచకప్‌. ప్రాణాలను బలితీసే మహమ్మారిని శరీరంలో దాచి పెట్టుకుని మరీ భారత జట్టుకు వరల్డ్‌కప్‌ను అందించాడీ స్టార్‌ క్రికెటర్‌. మైదానంలో రక్తపు వాంతులు చేసుకుంటున్నా పరుగు ఆపని ఈ క్రికెటర్‌ ఎవరో ఈపాటికే మీకు అర్థమై ఉంటుంది. యస్‌.. అతనే యువరాజ్‌ సింగ్‌. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే యూవీ తాజాగా తన చిన్ననాటి ఫొటోను ఒకటి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. అందులో తన తండ్రి యోగ్‌రాజ్‌ సింగ్‌ భుజాలపై కూర్చొని ఎంతో క్యూట్‌గా కనిపించాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

‘ నా లైఫ్‌లో క్రీడలు ఒక భాగమయ్యాయి. చిన్నప్పటి నుంచే ఏదో ఒక ఆట ఆడుతూ ఉండే వాడిని. నాకు చిన్నప్పుడు రోలర్‌ స్కేటింగ్‌ అంటే చాలా ఇష్టం. అందులో అండర్‌- 14 ఛాంపియన్‌షిప్‌ను కూడా గెల్చుకున్నాను. అయితే నేను బ్యాటి పట్టి క్రికెట్‌ ఆడాలన్నది మా నాన్న (యోగ్‌రాజ్‌ సింగ్‌ ) కోరిక. అప్పటి నుంచి నన్ను ట్రైనింగ్‌కు తీసుకెళ్లని రోజంటూ లేదు. మానాన్న నాలో తనను చూసుకున్నాడు. నాపై ఆయనకున్న నమ్మకమే నన్ను ఇంతటివాడిగా మార్చింది. ఇది నా స్పోర్టింగ్‌ హీరో ఇన్‌స్పిరేషనల్‌ స్టోరీ. మరి మీ జీవితంలో మీకు స్ఫూర్తిగా నిలిచిన వారెవరు? మీ స్పోర్ట్స్‌ కెరీర్‌ను ప్రోత్సహించిన స్నేహితులు, తల్లిదండ్రులు, కోచ్‌, సన్నిహితులెవరైనా ఉంటే వారిని నామినేట్‌ చేయండి’ అంటూ తన ఫాలోవర్లను కోరాడు యువరాజ్‌ సింగ్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..