Gautam Gambhir : కెమెరాల ముందు బయటపడ్డ గంభీర్లోని మరో కోణం.. భయ్యా నువ్వు మామూలోడివి కాదు
భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఇటీవల ఎయిర్ పోర్టులో మీడియాకు చిక్కారు. ఆ సమయంలో ఫోటోగ్రాఫర్లు తనను చుట్టుముట్టగా, గంభీర్ తనదైన శైలిలో అరె బస్ అంటూ నవ్వుతూ ముందుకు వెళ్లిపోయారు. సాధారణంగా కఠినంగా ఉండే గంభీర్, ఈసారి నవ్వుతూ మాట్లాడిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Gautam Gambhir : భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఇటీవల ఎయిర్ పోర్టులో మీడియాకు చిక్కారు. . ఆ సమయంలో ఫోటోగ్రాఫర్లు తనను చుట్టుముట్టగా, గంభీర్ తనదైన శైలిలో అరె బస్ అంటూ నవ్వుతూ ముందుకు వెళ్లిపోయారు. సాధారణంగా కఠినంగా ఉండే గంభీర్, ఈసారి నవ్వుతూ మాట్లాడిన ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఈ సంఘటన గంభీర్ వ్యక్తిత్వంలోని ఒక కోణాన్ని చూపిస్తే, సంజూ శాంసన్ చేసిన వ్యాఖ్యలు అతనిలోని మరో కోణాన్ని బయటపెట్టాయి. ఒకప్పుడు తాను కష్టాల్లో ఉన్నప్పుడు గంభీర్ ఇచ్చిన ధైర్యాన్ని శాంసన్ గుర్తు చేసుకున్నారు.
ప్రజా జీవితంలో ఉన్నవారికి మీడియా కవరేజ్, ప్రైవసీ ఒక పెద్ద సవాలు. ఎప్పుడూ సూటిగా, స్పష్టంగా మాట్లాడే వ్యక్తిగా పేరున్న గౌతమ్ గంభీర్, ఎయిర్‌పోర్టులో ఫోటోగ్రాఫర్ల మధ్య కొంత పర్సనల్ ప్లేసు కోసం అరే బస్ అని చెప్పడం వైరల్ అయింది. ఈ ఘటన అభిమానులకు గంభీర్ వ్యక్తిగత జీవితంలోని ప్రైవసీకి ఎంత విలువ ఇస్తారో చూపించింది.
అయితే, అదే సమయంలో క్రికెటర్ సంజూ శాంసన్ చెప్పిన ఒక విషయం గంభీర్ మరో కోణాన్ని వెల్లడించింది. తాను కష్టకాలంలో ఉన్నప్పుడు సూర్యకుమార్ యాదవ్, గౌతమ్ గంభీర్ ఇచ్చిన మద్దతు గురించి అశ్విన్ హోస్ట్ చేస్తున్న కుట్టి స్టోరీస్ విత్ యాష్ పాడ్‌కాస్ట్‌లో సంజూ మాట్లాడారు. దులీప్ ట్రోఫీ మ్యాచ్‌ల కోసం సూర్యకుమార్ యాదవ్ తన వద్దకు వచ్చి “నీకు ఏడు మ్యాచ్‌లలో అవకాశం ఇస్తాను, అన్ని మ్యాచ్‌లలో నువ్వే ఓపెనర్” అని చెప్పారని సంజూ తెలిపారు. ఆ తర్వాత శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో రెండు మ్యాచ్‌లలో సంజూ సున్నా పరుగులకే అవుట్ అయ్యారు.
"Arey bass…" says Gautam Gambhir to paps as he gets spotted at the airport 😱#GautamGambhir #shorts #zoomnews pic.twitter.com/MEXZ5ECgeE
— Zoom News (@Zoom_News_India) August 12, 2025
Sanju Samson about Suryakumar Yadav & Gautam Gambhir:
"I was playing a Duleep Trophy game in Andhra, Surya was playing as well, that's when he came & told 'Chetta, there is a good opportunity coming for you – we have 7 games lineup up, I am going to give you all 7 games as an… pic.twitter.com/qcUDmsi3ee
— Johns. (@CricCrazyJohns) August 9, 2025
“నేను డ్రెస్సింగ్ రూమ్‌లో నిరాశగా ఉన్నాను. అప్పుడు గౌతమ్ భాయ్ నన్ను చూసి ఏమైందని అడిగారు. నేను వచ్చిన అవకాశాన్ని సరిగా ఉపయోగించుకోలేకపోయాను అని చెప్పాను. దానికి ఆయన సో వాట్? నువ్వు 21 సార్లు డకౌట్ అయితేనే నేను నిన్ను జట్టు నుంచి తీసివేస్తాను అని ధైర్యం చెప్పారని సంజూ వెల్లడించారు. ఈ మాటలు తనకు ఎంత నమ్మకాన్ని ఇచ్చాయో ఆయన వివరించారు. గంభీర్ ఇచ్చిన ఈ సపోర్టు సంజూ శాంసన్ ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చివేసిందని, నాయకుల నుంచి వచ్చిన నమ్మకం, ప్రోత్సాహం ఒక ఆటగాడి కెరీర్‌ను ఎలా ప్రభావితం చేస్తాయో ఈ సంఘటన ఉదాహరణగా నిలుస్తుందని సంజూ తెలిపారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




