AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salman Khan : షారూఖ్, ప్రీతిజింటాకు పోటీగా త్వరలో సల్మాన్ కొత్త ఐపీఎల్‌ టీమ్.. 2026లో ఆడే ఛాన్స్

క్రికెట్‌కు, బాలీవుడ్‌కు చాలా పాత సంబంధం ఉంది. ఐపీఎల్ ఈ బంధాన్ని మరింత బలపరిచింది. ఇప్పటికే బాలీవుడ్ స్టార్స్ అయిన షారుఖ్ ఖాన్, ప్రీతి జింటా ఐపీఎల్‌లో జట్ల యజమానులుగా ఉన్నారు. తాజాగా, బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌ను కూడా ఐపీఎల్‌లో టీమ్ కొంటారా అని ప్రశ్నించగా ఆయన ఇచ్చిన సమాధానం ఆశ్చర్యపరిచింది.

Salman Khan : షారూఖ్, ప్రీతిజింటాకు పోటీగా త్వరలో సల్మాన్ కొత్త ఐపీఎల్‌ టీమ్.. 2026లో ఆడే ఛాన్స్
Salman Khan
Rakesh
|

Updated on: Aug 12, 2025 | 6:25 PM

Share

Salman Khan : క్రికెట్, బాలీవుడ్ మధ్య చాలా కాలం నుంచి మంచి అనుబంధం ఉంది. ఐపీఎల్ దీనిని మరింత బలోపేతం చేసింది. బాలీవుడ్ స్టార్స్ అయిన షారుఖ్ ఖాన్, ప్రీతి జింటా చాలా కాలం నుంచి ఐపీఎల్ ఫ్రాంచైజీలైన కేకేఆర్, పంజాబ్ కింగ్స్‌కు యజమానులుగా ఉన్నారు. ఒకానొక సమయంలో శిల్పా శెట్టి కూడా రాజస్థాన్ రాయల్స్ జట్టుకు భాగస్వామిగా ఉన్నారు. అయితే, ఇటీవల సల్మాన్ ఖాన్‌ను కూడా ఐపీఎల్‌లో టీమ్ ఎందుకు కొనకూడదు అని అడిగితే, ఆయన ఇచ్చిన సమాధానం ఆశ్చర్యపరిచింది. ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో సల్మాన్ ఖాన్‌ను మీరు ఎప్పుడైనా ఐపీఎల్‌లో టీమ్ కొనాలనుకుంటున్నారా? అని అడిగారు. దీనికి సల్మాన్ స్పందిస్తూ.. ఐపీఎల్‌కు ఇప్పుడు మేము చాలా ముసలివాళ్లం అయ్యామని నవ్వుతూ సమాధానం చెప్పారు. కాగా, ఈ సంవత్సరం సల్మాన్ ఖాన్ ఐఎస్‌పీఎల్ (ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్) లో ఢిల్లీ ఫ్రాంచైజీకి యజమానిగా మారారు.

ఐపీఎల్ మొదటి సీజన్ అయిన 2008లోనే తాను ఒక జట్టుకు యజమానిగా మారే అవకాశం వచ్చిందని సల్మాన్ ఖాన్ వెల్లడించారు. కానీ, ఆ ఆఫర్‌ను తిరస్కరించినట్లు తెలిపారు. ఆ సమయంలోనే నాకు ఐపీఎల్ ఆఫర్ వచ్చింది. కానీ నేను తీసుకోలేదు. దీని గురించి నేను ఇప్పుడు బాధపడటం లేదు, సంతోషంగా ఉన్నానని సల్మాన్ ఖాన్ అన్నారు.

షారుఖ్ ఖాన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఫ్రాంచైజీలో 55 శాతం వాటాలు కలిగి ఉన్నారు. మిగిలిన 45 శాతం వాటాలు జూహీ చావ్లా భర్త జై మెహతాకు చెందిన మెహతా గ్రూప్ వద్ద ఉన్నాయి. ప్రీతి జింటా 2008 నుంచి పంజాబ్ కింగ్స్ జట్టుకు భాగస్వామిగా ఉన్నారు. ఆమెకు ఆ జట్టులో 23 శాతం వాటాలు ఉన్నాయి. శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా 2009లో రాజస్థాన్ రాయల్స్‌లో 11.9 శాతం వాటాలు కొనుగోలు చేశారు. ఈ వాటాలు 2015 వరకు వారి దగ్గరే ఉన్నాయి. అక్షయ్ కుమార్ ఏ జట్టుకు యజమాని కానప్పటికీ, చాలా ఏళ్ల క్రితం ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో (ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్) మూడు సంవత్సరాల ఒప్పందం కుదుర్చుకున్నారు. నష్టాలను తగ్గించుకోవడానికి ఢిల్లీ ఈ ఒప్పందం చేసుకుంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
భారీ భూకంపం.. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ప్రకంపనలు
భారీ భూకంపం.. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ప్రకంపనలు
రాత్రి పడుకునే ముందు ఈ ఒక్క పని చేయండి.. మీరు ఊహించని విధంగా..
రాత్రి పడుకునే ముందు ఈ ఒక్క పని చేయండి.. మీరు ఊహించని విధంగా..
అగ్రరాజ్యం టెక్ సామ్రాజ్యంపై ఇరాన్ పంజా! కంపెనీలకు డెత్ వారెంట్..
అగ్రరాజ్యం టెక్ సామ్రాజ్యంపై ఇరాన్ పంజా! కంపెనీలకు డెత్ వారెంట్..
మెట్రోలో సిగరేట్ తాగితే ఎలాంటి శిక్ష వేస్తారో తెలుసా..?
మెట్రోలో సిగరేట్ తాగితే ఎలాంటి శిక్ష వేస్తారో తెలుసా..?
తొలుత మాత్రే.. చివర్లో దుబే, సర్ఫరాజ్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?
తొలుత మాత్రే.. చివర్లో దుబే, సర్ఫరాజ్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?
రాకాస రివ్యూ.. నిహారిక ఖాతాలో మరో హిట్ ప‌డిందా
రాకాస రివ్యూ.. నిహారిక ఖాతాలో మరో హిట్ ప‌డిందా
రేసింగ్ + ఎమోషన్‌.. శర్వా ఈసారి కూడా గట్టెక్కేశాడు
రేసింగ్ + ఎమోషన్‌.. శర్వా ఈసారి కూడా గట్టెక్కేశాడు
సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ కారు కొంటున్నారా.. ఇవి చెక్ చేయకపోతే..
సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ కారు కొంటున్నారా.. ఇవి చెక్ చేయకపోతే..
టోల్ గేట్ల వద్ద క్యాష్ పేమెంట్స్ బంద్.. ఎప్పటినుంచంటే..?
టోల్ గేట్ల వద్ద క్యాష్ పేమెంట్స్ బంద్.. ఎప్పటినుంచంటే..?
చనిపోయినప్పుడు సౌందర్య బాడీకి తల లేదు.. అలా చూసి తట్టుకోలేకపోయాను
చనిపోయినప్పుడు సౌందర్య బాడీకి తల లేదు.. అలా చూసి తట్టుకోలేకపోయాను