Shubman Gill : శుభ్‌మన్ గిల్‌కు అరుదైన గౌరవం.. సునీల్ గవాస్కర్ రికార్డులో చేరువలో టీమిండియా కెప్టెన్
ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్కు భారీ బహుమతి లభించింది. ఈ టెస్ట్ సిరీస్‌లో నాలుగు సెంచరీలతో అత్యధిక పరుగులు సాధించిన గిల్‌ను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుతో సత్కరించింది.

Shubman Gill : ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో నాలుగు సెంచరీలతో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుతమైన ప్రదర్శనకు పెద్ద పురస్కారం లభించింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి అతన్ని ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు సెలక్ట్ చేసింది. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ వియాన్ ముల్డర్ వంటి ఆటగాళ్లను వెనక్కి నెట్టి గిల్ ఈ గౌరవాన్ని దక్కించుకున్నాడు. రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత తొలిసారి కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన గిల్, తన నాయకత్వంలో ఇంగ్లాండ్ పర్యటనలో సిరీస్‌ను 2-2తో డ్రా చేయగలిగాడు.
ఇంగ్లండ్ పర్యటనలో నాలుగు సెంచరీలతో 754 పరుగులు చేసిన గిల్‌కు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు లభించడం ఇది నాలుగోసారి. ఇంతకుముందు 2023 జనవరి, సెప్టెంబర్ నెలల్లో, అలాగే 2025 ఫిబ్రవరిలో కూడా ఈ అవార్డు గెలుచుకున్నాడు. అవార్డు గెలిచిన తర్వాత శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ..”జూలై నెల కోసం ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. నా మొదటి టెస్ట్ కెప్టెన్సీ సిరీస్‌లో ఈ అవార్డు లభించడం మరింత ప్రత్యేకమైనది. బర్మింగ్‌హామ్‌లో నేను చేసిన డబుల్ సెంచరీని ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. ఇది నా ఇంగ్లండ్ పర్యటనలో అత్యంత ముఖ్యమైన క్షణాల్లో ఒకటి” అని చెప్పాడు.
ఇంగ్లండ్‌పై ఐదు టెస్టుల సిరీస్‌లో గిల్ 754 పరుగులు సాధించి, ఒక టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు. సునీల్ గవాస్కర్ రికార్డును కేవలం 20 పరుగుల తేడాతో మిస్ అయ్యాడు. ఈ అద్భుతమైన ప్రదర్శనకు అతనికి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా లభించింది. ఈ అవార్డును నాలుగు సార్లు గెలుచుకున్న తొలి పురుష క్రికెటర్‌గా శుభ్‌మన్ గిల్ రికార్డు సృష్టించాడు. ఇంతకు ముందు ఆస్ట్రేలియాకు చెందిన యాష్ గార్డనర్, వెస్టిండీస్ కెప్టెన్ హేలీ మాథ్యూస్ మాత్రమే ఈ ఘనత సాధించారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




