Asia Cup: 17వ ఎడిషన్‌కు రంగం సిద్ధం.. ఆసియా కప్‌లో తోపు టీం ఏదో తెలుసా..?
Asia Cup History: భారత జట్టు 8 సార్లు, శ్రీలంక 6 సార్లు, పాకిస్తాన్ 2 సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. ఈసారి 8 జట్లు ఆసియా కప్ 2025లో పాల్గొంటున్నాయి. అయితే, ఈసారి ఆసియాకప్‌లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ పోరుపైనే అందరి ఆసక్తి నెలకొంది.

2025 ఆసియా కప్ సెప్టెంబర్ 9 నుంచి సెప్టెంబర్ 28 వరకు జరుగుతుంది. ఈ టోర్నమెంట్‌ను బీసీసీఐ UAE లోని రెండు నగరాలు, దుబాయ్, అబుదాబిలలో నిర్వహిస్తుంది. ఇది ఈ టోర్నమెంట్ 17వ ఎడిషన్. ఈసారి ఇది T20 ఫార్మాట్‌లో జరుగుతుంది. వాస్తవానికి, ఆసియా కప్‌ను T20 ఫార్మాట్‌లో నిర్వహించడం ఇది మూడోసారి. మిగిలిన 14 సార్లు ఈ టోర్నమెంట్ ODI ఫార్మాట్‌లో జరిగింది. కాగా, ఆసియా కప్ టోర్నమెంట్ మొదటిసారి ఎప్పుడు జరిగింది? ఈ టోర్నమెంట్‌లో ఏ జట్టు ట్రోఫీని ఎన్నిసార్లు గెలుచుకుంది అనే దాని గురించి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఆసియా కప్ 1984లో ప్రారంభం..
ఆసియా కప్ ఆసియాలోనే అతిపెద్ద క్రికెట్ టోర్నమెంట్, దీనిని ఆసియా క్రికెట్ కౌన్సిల్ 1984లో ప్రారంభించింది. 2016 నుంచి, ఇది ఐసీసీ ప్రధాన టోర్నమెంట్ల ఫార్మాట్‌కు అనుగుణంగా నిర్వహించబడుతోంది. అంటే ODI ఫార్మాట్ లేదా టీ 20-ఓవర్ ఫార్మాట్‌లో జరుగుతుంది.
ఇప్పటివరకు, భారత్, శ్రీలంక, పాకిస్తాన్ ఆసియా కప్‌లో ఆధిపత్యం చెలాయించాయి. ఆసియా కప్‌లో భారత్, పాకిస్తాన్, శ్రీలంక మధ్య ఎప్పుడూ ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లు జరిగాయి. భారత జట్టు అత్యధిక సార్లు అంటే 8 సార్లు (1984, 1988, 1991, 1995, 2010, 2016, 2018, 2023) టైటిల్‌ను గెలుచుకుంది. అయితే శ్రీలంక 6 సార్లు (1986, 1997, 2004, 2008, 2014, 2022) టైటిల్‌ను గెలుచుకుంది. పాకిస్తాన్ కూడా 2 సార్లు (2000, 2012) ట్రోఫీని గెలుచుకుంది. బంగ్లాదేశ్ కూడా 3 సార్లు ఫైనల్‌కు చేరుకుంది. కానీ, ఇప్పటివరకు టైటిల్‌ను గెలుచుకోలేకపోయింది.
బరిలో 8 జట్లు..
2025 ఆసియా కప్ సెప్టెంబర్ 9న ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ మధ్య మ్యాచ్‌తో ప్రారంభమవుతుంది. ఈసారి మొత్తం 8 జట్లు పాల్గొంటాయి. వీటిని నాలుగు జట్లు చొప్పున రెండు గ్రూపులుగా విభజించారు. ప్రతి జట్టు తన గ్రూప్‌లోని మిగిలిన మూడు జట్లతో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. గత సంవత్సరం విజేతలైన భారత్ సెప్టెంబర్ 10న ఆతిథ్య యుఎఇతో తన తొలి మ్యాచ్ ఆడనుంది.
మూడు సార్లు ముఖాముఖి..
ప్రస్తుతం విడుదలైన ఆసియా కప్ షెడ్యూల్ ప్రకారం, భారత్, పాకిస్తాన్ ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. అంటే లీగ్ దశలో రెండు జట్ల మధ్య ఒక మ్యాచ్ ఉంటుంది. ఆ తర్వాత, ఈ రెండు జట్లు సూపర్ ఫోర్ రౌండ్‌లోకి ప్రవేశిస్తే, వారు అక్కడ కూడా ఒకరినొకరు ఎదుర్కొంటారు. ఫైనల్‌కు చేరుకుంటే అక్కడ టైటిల్ కోసం పోరాడుతారు. అంటే ఈ టోర్నమెంట్‌లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మూడు మ్యాచ్‌లు జరిగే అవకాశాలు ఉన్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




