ఐపీఎల్ 2025లో ఈ 6గురు అట్టర్ ఫ్లాప్.. కట్‌చేస్తే.. సెలెక్టర్ల మైండ్‌లో మాత్రం సూపర్ హిట్.. ఎవరంటే?
Team India: ఐపీఎల్ 2025 (IPL 2025)లో పేలవ ప్రదర్శన ఇచ్చిన కొంతమంది భారత ఆటగాళ్లకు ఇంగ్లాండ్ పర్యటన కోసం టీమిండియా టెస్ట్ జట్టులో స్థానం కల్పించారు. ఈ ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ఈ ఆటగాళ్లు ఎలా రాణిస్తారో కాలమే చెబుతుంది. కానీ వీరి ప్రస్తుత ఫామ్‌ను బట్టి చూస్తే, ఈ పర్యటన భారత జట్టుకు చాలా కష్టంగా ఉండబోతోంది.

Team India Test Squad: జూన్ 20 నుంచి ఇంగ్లాండ్‌తో టీమిండియా 5 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఈ క్లిష్టమైన పర్యటన కోసం భారత జట్టును ఎంపిక చేశారు. ఈ జట్టులో ఎంపికైన ఆటగాళ్లు ప్రస్తుతం ఐపీఎల్‌లో ఆడుతున్నారు. వీరిలో, ఈ సీజన్‌లో తీవ్రంగా విఫలమవుతోన్న 6 గురు ఆటగాళ్ళు ఉన్నారు. రెండు ఫార్మాట్లు భిన్నంగా ఉన్నప్పటికీ, ఈ ఆటగాళ్ళు ఇంగ్లాండ్‌లో కూడా ఇలాగే రాణిస్తే, భారత జట్టులో వచ్చిన అదురైన అవకాశాలను నాశనం చేసుకున్నట్లేనని అంతా భావిస్తున్నారు. ఈ ఆటగాళ్లలో ఒకరు భారత టెస్ట్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా కూడా నియమితులయ్యాడు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో ఈ 6గురు క్రికెటర్లు బ్రిటిష్ జట్టుపై బాగా రాణించగలరా లేదా అనే ప్రశ్న తలెత్తుతుంది. ఈ క్రికెటర్లలో అతి పెద్ద పేరు రిషబ్ పంత్. టెస్ట్ జట్టు వైస్ కెప్టెన్‌గా నియమితులయ్యాడు. ఇది కాకుండా, ఐపీఎల్ 2025 (IPL 2025) లో ఇబ్బంది పడుతున్న మరో ఐదుగురు ఆటగాళ్ళు ఉన్నారు.
1. రిషబ్ పంత్: ఈ సీజన్‌లో టీం ఇండియా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ బ్యాట్‌తో ఇబ్బంది పడుతున్నట్లు కనిపించాడు. ఇది అతని జట్టును కూడా ప్రభావితం చేసింది. లక్నో సూపర్ జెయింట్స్ ఐపీఎల్ 2025 (IPL 2025) మొదటి రౌండ్ నుంచి నిష్క్రమించింది. ఐపీఎల్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడైన పంత్ ఈ సీజన్‌లో 13 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో అతను 13.72 సగటుతో 153 పరుగులు మాత్రమే చేశాడు. అతని పేలవమైన ప్రదర్శన ఉన్నప్పటికీ, అతను టెస్ట్ జట్టుకు వైస్-కెప్టెన్‌గా నియమితుడయ్యాడు.
2. నితీష్ రెడ్డి: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్ రౌండర్ నితీష్ రెడ్డి IPL 2025లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. అతను 12 మ్యాచ్‌ల్లో 182 పరుగులు చేసి రెండు వికెట్లు మాత్రమే పడగొట్టగలిగాడు. అయితే, అతను ఇప్పటివరకు టెస్ట్ క్రికెట్‌లో బాగా రాణించాడు. అతను 5 టెస్ట్ మ్యాచ్‌ల్లో 37.25 సగటుతో 298 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. ఇది కాకుండా, అతను 5 వికెట్లు కూడా తీసుకున్నాడు.
3. కరుణ్ నాయర్: ఈ సీజన్‌లో తన తొలి మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శన తర్వాత, కరుణ్ నాయర్ బ్యాట్ మూగబోయింది. అతను 7 మ్యాచ్‌ల్లో కేవలం 22 సగటుతో 154 పరుగులు చేశాడు. దేశవాళీ క్రికెట్‌లో అతని అద్భుతమైన ప్రదర్శన ఆధారంగా అతనికి టెస్ట్ జట్టులో స్థానం లభించింది. కానీ, అతని ప్రస్తుత ఫామ్‌ను పరిశీలిస్తే, అతను ఇంగ్లాండ్‌లో కఠినమైన పరీక్షను ఎదుర్కోవలసి ఉంటుంది.
4. వాషింగ్టన్ సుందర్: గుజరాత్ టైటాన్స్‌కు చెందిన ఈ ఆల్ రౌండర్ ఈ సీజన్‌లో బ్యాటింగ్, బంతితో దారుణంగా విఫలమయ్యాడు. అతను 5 మ్యాచ్‌ల్లో కేవలం 85 పరుగులు మాత్రమే చేసి రెండు వికెట్లు పడగొట్టాడు. అతను టెస్ట్ క్రికెట్‌లో 9 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో సుందర్ 468 పరుగులు చేసి 25 వికెట్లు పడగొట్టాడు.
5. ఆకాష్ దీప్: లక్నో సూపర్ జెయింట్స్ ఫాస్ట్ బౌలర్ ఆకాష్ దీప్ ఈ సీజన్‌లో 6 మ్యాచ్‌ల్లో కేవలం 3 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. గాయం తర్వాత, అతను IPL 2025లో తిరిగి వచ్చాడు. కానీ, అతని ప్రదర్శన చాలా నిరాశపరిచింది. టెస్ట్ క్రికెట్ విషయానికొస్తే, అతను 7 టెస్ట్ మ్యాచ్‌ల్లో 15 వికెట్లు పడగొట్టాడు.
6. శార్దూల్ ఠాకూర్: LSG ఫాస్ట్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ IPL 2025 ప్రారంభ మ్యాచ్‌లలో అద్భుతంగా రాణించాడు. కానీ, ఆ తర్వాత అతను వికెట్ల కోసం తహతహలాడుతూనే ఉన్నాడు. ఈ సీజన్‌లో 10 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు పడగొట్టాడు. ఇది కాకుండా, అతను టెస్ట్ క్రికెట్‌లో 11 మ్యాచ్‌లు ఆడి 31 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు ఇంగ్లాండ్ పర్యటనలో శార్దూల్ ఎలాంటి అద్భుతాలు చూపిస్తాడో చూడాలి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..