కెప్టెన్ నుంచి, ఇద్దరి అరంగేట్రం వరకు.. పెర్త్ టెస్ట్‌కు ముందు టీమిండియాలో 5 కీలక మార్పులు?

Perth Test, Brder Gavaskar Trophy: భారత క్రికెట్ జట్టు నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ను ప్రారంభించనుంది. పెర్త్ వేదికగా జరగనున్న టెస్టుకు ముందు టీమిండియాకు చాలా సవాళ్లు ఎదురయ్యాయి. ముఖ్యంగా కొంతమంది ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడం, మరికొందరు ఆటగాళ్లు గాయపపడంతో భారత జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..

కెప్టెన్ నుంచి, ఇద్దరి అరంగేట్రం వరకు.. పెర్త్ టెస్ట్‌కు ముందు టీమిండియాలో 5 కీలక మార్పులు?
Team India
Follow us
Venkata Chari

|

Updated on: Nov 18, 2024 | 1:35 PM

భారత క్రికెట్ జట్టు నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ను ప్రారంభించనుంది. పెర్త్ వేదికగా జరగనున్న టెస్టుకు ముందు టీమిండియాకు చాలా సవాళ్లు ఎదురయ్యాయి. రోహిత్ శర్మ అందుబాటులో ఉండడంలేదు. ఆ తర్వాత శుభమాన్ గిల్ కూడా గాయపడ్డాడు. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాటింగ్ ఆర్డర్‌లో చాలా మార్పులు కనిపించనున్నాయి. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, తాత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా యశస్వి జైస్వాల్‌తో ఎవరిని ఓపెనింగ్ చేయిస్తారో చూడాలి. అలాగే, ఏ బ్యాట్స్‌మెన్ మూడవ స్థానంలో ఉంటాడు, బౌలింగ్ విభాగంలో ఎవరుంటారు ఇలా ఎన్నో విషయాలు తేలాల్చి ఉంది. పెర్త్ టెస్టుకు ముందు టీమిండియాలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..

కొత్త కెప్టెన్ – రోహిత్ శర్మ ఇటీవల తండ్రి అయ్యాడు. మరికొద్ది రోజులు కుటుంబంతో కలిసి ఉండనున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐకి తెలిపాడు. ఇటువంటి పరిస్థితిలో రోహిత్ ఆలస్యంగా భారత జట్టులో చేరనున్నాడు. ఫలితంగా పెర్త్ టెస్టుకు రోహిత్ దూరం కానున్నాడు. అతని స్థానంలో జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు. కెప్టెన్‌గా అతనికి ఇది రెండో టెస్టు. అయితే అడిలైడ్ వేదికగా జరిగే రెండో టెస్టుకు రోహిత్ అందుబాటులో ఉంటాడు.

కొత్త ఓపెనింగ్ జోడీ – పెర్త్ టెస్టుకు రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడంతో భారత జట్టు కొత్త ఓపెనింగ్ జోడీతో ఫీల్డింగ్ చేయనుంది. యశస్వి జైస్వాల్‌తో పాటు ఓపెనింగ్ భాగస్వాములుగా కేఎల్ రాహుల్, అభిమన్యు ఈశ్వరన్ రూపంలో టీమ్ ఇండియాకు ఎంపికలు ఉన్నాయి. ఈ ఇద్దరిలో ఎవరినైనా ప్రయత్నించవచ్చు. రాహుల్ ఓపెన్ చేసే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

3వ స్థానంలో కొత్త ఆటగాడు – శుభమాన్ గిల్ గాయం కారణంగా, భారత జట్టు మేనేజ్‌మెంట్ మూడో స్థానంలో కొత్త ముఖాన్ని రంగంలోకి దించవలసి ఉంటుంది. రాహుల్ ఓపెనింగ్‌కు వెళితే ధ్రువ్ జురెల్‌ను పైకి పంపవచ్చు. మరి విరాట్ కోహ్లి ఏ ప్లేస్‌లో ఆడతాడో చూడాలి. దేవదత్ పడిక్కల్‌ను ఆస్ట్రేలియాలోనే ఉండాల్సిందిగా కోరారు. ఇటువంటి పరిస్థితిలో, అతను కూడా మూడవ నంబర్‌లో ఆడవచ్చు.

కొత్త బ్యాటింగ్ ఆర్డర్ – మూడో నంబర్‌తోపాటు ఓపెనింగ్ బ్యాటింగ్‌లో మార్పుల కారణంగా, భారత జట్టు బ్యాటింగ్ ఆర్డర్ మారుతుంది. మొదటి మూడు స్థానాల్లో ఇద్దరు కొత్త ఆటగాళ్లు ఆడనున్నారు. ఇది కాకుండా, సర్ఫరాజ్ ఖాన్ స్థానంలో మరికొందరు బ్యాట్స్‌మెన్‌ను ఐదు, ఆరో నంబర్‌లలో ఆడించవచ్చు.

ఇద్దరు ఆటగాళ్ల అరంగేట్రం – పెర్త్ టెస్టులో నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణాలు భారత జట్టు తరపున అరంగేట్రం చేసే అవకాశం ఉంది. హర్షిత్ జట్టులోని మూడో ఫాస్ట్ బౌలర్ కావొచ్చు. ఒకే ఒక్క స్పిన్నర్ ఉండటంతో నితీష్ రెడ్డిని ఆల్ రౌండర్‌గా తీసుకురావచ్చు. అతను నాలుగో పేసర్‌గా కూడా కనిపించనున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..