Car Crash : ఎయిర్‌పోర్టుకు వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు కిందకు దూసుకెళ్లిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ కార్
Car Crash : మే 31న జరిగిన ఐపీఎల్ 2026 గ్రాండ్ ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత మైఖెల్ క్లార్క్ ఘోరమైన కార్ యాక్సిడెంట్ బారిన పడ్డారు. అదృష్టవశాత్తూ ఆయన స్వల్ప గాయాలతో ఈ ప్రమాదం నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడగలిగారు.

Car Crash : ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ మైఖేల్ క్లార్క్‌కు భారత గడ్డపై ఒక భయంకరమైన అనుభవం ఎదురైంది. ఐపీఎల్ 2026 సీజన్‌లో కామెంట్రీ ప్యానెల్‌లో సభ్యుడిగా వ్యవహరించిన క్లార్క్.. మే 31న జరిగిన గ్రాండ్ ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత ఒక ఘోరమైన కార్ యాక్సిడెంట్ బారిన పడ్డారు. అదృష్టవశాత్తూ ఆయన స్వల్ప గాయాలతో ఈ ప్రమాదం నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడగలిగారు. ఇటీవల జరిగిన ఒక క్రికెట్ పాడ్‌కాస్ట్‌లో మైఖేల్ క్లార్క్ మాట్లాడుతూ ఆ రాత్రి జరిగిన భయానక రోడ్డు ప్రమాద వివరాలను పంచుకున్నారు. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత తాను ఇండియా నుంచి తిరిగి ఆస్ట్రేలియా వెళ్ళడానికి కారులో ఎయిర్‌పోర్టుకు బయలుదేరినట్లు తెలిపారు. ఆ సమయంలో మ్యాచ్ ముగిసిన అలసట వల్ల తాను కారు వెనుక సీట్లో హ్యాపీగా నిద్రపోయానని, అయితే లారీని కారు బలంగా ఢీకొట్టిన సౌండ్‌తో ఒక్కసారిగా మేల్కొన్నానని చెప్పారు.
కళ్లు తెరిచేసరికి ట్రక్కు కింద ఇరుక్కుపోయిన కారు
తాను నిద్ర లేచి చూసేసరికి కారు ముందు భాగం మొత్తం ఒక పెద్ద సెమీ ట్రైలర్ లారీ కిందకు దూసుకుపోయిందని క్లార్క్ వివరించారు. లారీ వెనుక భాగంలో ఉండే బ్రేక్ లైట్లు పనిచేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తన డ్రైవర్ చెప్పినట్లు క్లార్క్ పేర్కొన్నారు. చీకట్లో ముందు వెళ్తున్న లారీ బ్రేక్ వేసిన విషయం డ్రైవర్ గమనించలేకపోయాడని, దాంతో కారు కంట్రోల్ తప్పి నేరుగా లారీ వెనుక భాగాన్ని బలంగా ఢీకొట్టిందని చెప్పారు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం మొత్తం పూర్తిగా నుజ్జునుజ్జయిపోయింది.
డ్రైవర్ పరిస్థితిపై క్లార్క్ ఆందోళన
ఈ భయంకరమైన యాక్సిడెంట్‌లో తనకు ఎలాంటి పెద్ద గాయాలు కాకపోవడం దేవుడి మహిమే అని క్లార్క్ అన్నారు. అయితే కారు నడుపుతున్న డ్రైవర్ కాలు మాత్రం విరిగిందని ఆయన తెలిపారు. ఆ సమయంలో డ్రైవర్ చాలా భయాందోళనలకు గురయ్యాడని, ఆ కారు అతనిది కాదని, ఒక ట్రావెల్ కంపెనీలో ఉద్యోగి కావడంతో కారు డ్యామేజ్ అయినందుకు యజమాని తిడతాడనే భయంతో అతను వణికిపోయాడని క్లార్క్ గుర్తుచేసుకున్నారు.
బీసీసీఐకి ప్రత్యేక కృతజ్ఞతలు
ఈ విపత్కర పరిస్థితుల్లో తనకు తక్షణమే సహాయం అందించిన స్థానిక భారతీయ ప్రజలకు, బీసీసీఐ అధికారులకు మైఖేల్ క్లార్క్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే బీసీసీఐ సభ్యులందరూ ఫోన్ చేసి తన క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారని, అవసరమైన వైద్య సహాయం అందించారని చెప్పారు. ఇండియాలో ఉండే మంచి మనసున్న ప్రజల వల్లే తాను ఈరోజు సురక్షితంగా ఆస్ట్రేలియాలో తన ఇంటికి చేరుకోగలిగానని క్లార్క్ ఎమోషనల్ అయ్యారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
