AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: 5 ఓవర్లలో 37 పరుగులు.. ఒక్క మ్యాచ్‌తోనే కెరీర్ క్లోజ్.. ఆ టీమిండియా బౌలర్ ఎవరంటే?

Indian Team Cricketer: భారత యువ క్రికెటర్ కెరీర్ ఇంకా ప్రారంభం కాకముందే ముగిసిపోతున్నట్లు కనిపిస్తోంది. కేవలం ఒక్క వన్డేలోనే ఈ ఆటగాడికి అవకాశం కల్పించిన టీమ్ ఇండియా.. అదే మ్యాచ్ నుంచి బయటపడే మార్గం చూపించింది. ఈ యువ క్రికెటర్‌కి మళ్లీ టీమిండియాలో అవకాశం ఎప్పుడు వస్తుందో చెప్పడం చాలా కష్టంగా మారింది.

Team India: 5 ఓవర్లలో 37 పరుగులు.. ఒక్క మ్యాచ్‌తోనే కెరీర్ క్లోజ్.. ఆ టీమిండియా బౌలర్ ఎవరంటే?
Kuldeep Sen
Venkata Chari
|

Updated on: Jun 22, 2023 | 5:00 AM

Share

Team India News: భారత యువ క్రికెటర్ కెరీర్ ఇంకా ప్రారంభం కాకముందే ముగిసిపోతున్నట్లు కనిపిస్తోంది. కేవలం ఒక్క వన్డేలో ఈ ఆటగాడికి అవకాశం కల్పించి టీమ్ ఇండియా నుంచి బయటపడే మార్గం చూపించింది బీసీసీఐ. ఈ యువ క్రికెటర్‌కి మళ్లీ టీమిండియాలో అవకాశం ఎప్పుడు వస్తుందో చెప్పడం చాలా కష్టంగా మారింది. ఫాస్ట్ బౌలర్ కుల్దీప్ సేన్‌కి భారత జట్టు సెలక్టర్లు అకస్మాత్తుగా టీమ్ ఇండియా నుంచి నిష్క్రమించే మార్గం చూపించారనే వార్తలు వినిపిస్తున్నాయి. గత ఏడాది డిసెంబర్ 2022లో బంగ్లాదేశ్‌తో ఢాకాలో వన్డే కెరీర్‌ను ప్రారంభించిన ఫాస్ట్ బౌలర్ కుల్దీప్ సేన్.. ఆ మ్యాచ్‌లో ఫ్లాప్ అయ్యాడు. ఆ మ్యాచ్ తర్వాత సెలక్టర్లు ఈ ఫాస్ట్ బౌలర్‌కు మరోసారి ఛాన్స్ ఇవ్వడం లేదు.

ఈ ఆటగాడి కెరీర్ ఇంకా ప్రారంభం కాకముందే క్లోజ్..

డిసెంబర్ 2022లో ఢాకాలో బంగ్లాదేశ్‌తో జరిగిన తన వన్డే అరంగేట్రంలో.. కుల్దీప్ సేన్ తన బౌలింగ్‌లో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. అతను టీమ్ ఇండియాను మ్యాచ్ నుండి అవుట్ చేశాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన ఆ వన్డే మ్యాచ్‌లో టీమిండియా 186 పరుగుల స్కోరును కాపాడుకోగలిగింది, అయితే కుల్దీప్ సేన్ పేలవమైన బౌలింగ్ కారణంగా ఇది సాధ్యం కాలేదు. ఆ వన్డే మ్యాచ్ తర్వాత కుల్దీప్ సేన్ కు మళ్లీ ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు.

ఒక్క మ్యాచ్ ఆడిన తర్వాత అకస్మాత్తుగా తొలగించిన బీసీసీఐ..

కుల్దీప్ సేన్ ఫ్లాప్ అని నిరూపించుకున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన ఆ వన్డే మ్యాచ్‌లో కుల్దీప్ సేన్ చాలా ఖరీదైనదిగా నిరూపించుకున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన ఆ వన్డే మ్యాచ్‌లో కుల్దీప్ సేన్ కేవలం 5 ఓవర్లలో 37 పరుగులు ఇచ్చాడు. కుల్దీప్ సేన్ 2 వికెట్లు కూడా పడగొట్టాడు. కానీ, అతను 7.40 ఎకానమీ రేటుతో పరుగులు ఇచ్చాడు. ఇది టీమ్ ఇండియాకు చాలా హానికరంగా మారింది. ODI క్రికెట్‌లో ఎకానమీ రేటు 7.40 చాలా పేలవమైన ప్రదర్శనగా పరిగణిస్తుంటారు. గత ఏడాది డిసెంబర్ 2022లో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫాస్ట్ బౌలర్ కుల్దీప్ సేన్‌కు అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసే అవకాశం ఇచ్చాడు. అయితే ఈ ఆటగాడు ఆ నమ్మకాన్ని ఘోరంగా వమ్ము చేశాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..