IND vs AUS: బూమ్‌ బూమ్‌ బుమ్రా ఈజ్‌ బ్యాక్‌.. మెరుపు యార్కర్‌కు ఆసీస్‌ కెప్టెన్‌ మైండ్‌ బ్లాంక్‌

Jasprit Bumrah: 2 ఓవర్లలో 23 పరుగులిచ్చిన బుమ్రా ఖచ్చితమైన యార్కర్‌తో ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్‌ ఫించ్‌ను పెవిలియన్‌ దారి పట్టించాడు. అప్పటివరకు 15 బంతుల్లో 31 పరుగులతో ధాటిగా ఆడుతున్న ఫించ్‌ కు బుమ్రా మెరుపు యార్కర్‌కు సమాధానం లేకుండా పోయింది.

IND vs AUS: బూమ్‌ బూమ్‌ బుమ్రా ఈజ్‌ బ్యాక్‌.. మెరుపు యార్కర్‌కు ఆసీస్‌ కెప్టెన్‌ మైండ్‌ బ్లాంక్‌
Jasprit Bumrah
Follow us
Basha Shek

|

Updated on: Sep 24, 2022 | 10:13 AM

Jasprit Bumrah: గాయం కారణంగా జస్ప్రీత్ బుమ్రా ఆసియా కప్‌కు దూరమయ్యాడు. మొహాలీలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లోనూ అతను కనిపించలేదు. అయితే నాగ్‌పూర్‌ వేదికగా జరిగిన కీలకమైన రెండో టీ20 మ్యాచ్‌లోకి బుమ్రా బరిలోకి దిగాడు. వర్షం కారణంగా మ్యాచ్‌ను 8 ఓవర్లకు కుదించడంతో అతనికి కేవలం రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్‌ చేసే అవకాశం వచ్చింది. అయినప్పటికీ తన యార్కర్ల పదును రుచి చూపించాడు. 2 ఓవర్లలో 23 పరుగులిచ్చిన బుమ్రా ఖచ్చితమైన యార్కర్‌తో ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్‌ ఫించ్‌ను పెవిలియన్‌ దారి పట్టించాడు. అప్పటివరకు 15 బంతుల్లో 31 పరుగులతో ధాటిగా ఆడుతున్న ఫించ్‌ బుమ్రా మెరుపు యార్కర్‌కు సమాధానం లేకుండా పోయింది. అందుకే ప్రత్యర్థి జట్టు సారథి అయినా ఔటైన వెంటనే బుమ్రాను మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. పెవిలియన్‌కు వెళ్తూ సూపర్‌ డెలివరీ అన్నట్లు తన బ్యాట్‌ను చేతితో కొట్టి మరీ యార్కర్ల కింగ్‌ను అభినందించాడు.

కాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈనేపథ్యంలో బుమ్రా పునరాగమనాన్ని టీమిండియా ఫ్యాన్స్‌ పండగలా సెలబ్రేట్‌ చేసుకున్నారు. ‘బూమ్‌ బూమ్‌ బుమ్రా ఈజ్‌ బ్యాక్‌. యార్కర్ల కింగ్‌ అదరగొట్టేశాడు. బుమ్రా వచ్చేశాడు. టీమిండియా విజయం సాధించింది’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ 1-1 తో సమమైంది. ఆదివారం కీలక మ్యాచ్‌ జరగనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..