IPL 2023: 16వ సీజన్ వేలానికి రంగం సిద్ధం.. రూ. 5 కోట్లు పెరిగిన ఫ్రాంచైజీల పర్స్.. పూర్తి వివరాలు ఇవే..
IPL Auction 2023: మినీ వేలం కోసం ట్రేడ్ విండో తెరిచారు. అదే సమయంలో మినీ వేలం కోసం ఐపీఎల్‌లోని మొత్తం 10 జట్ల పర్స్ రూ.5 కోట్ల వరకు పెరిగడం విశేషం.
Ipl 2023
Follow us
IPL Auction 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 (IPL 2023) కంటే ముందు మినీ వేలం నిర్వహించనున్నారు. అయితే ఈ మినీ వేలానికి ట్రేడ్ విండో ఓపెన్ అయింది. వాస్తవానికి, ట్రేడ్ విండో తెరవడం అంటే ఈ సమయంలో ప్లేయర్‌ను విడుదల చేయడంతో పాటు, జట్లు ఇతర జట్లతో ఆటగాళ్లను జట్టులో చేర్చుకునే ఛాన్స్ ఉంది. మీడియా కథనాల ప్రకారం, ఈ మినీ వేలం తేదీని త్వరలో నిర్ణయించనున్నారు. అదే సమయంలో ఐపీఎల్‌లోని మొత్తం 10 జట్ల పర్సులు కూడా పెరుగుతాయి.
మినీ వేలం డిసెంబర్ 16న?
డిసెంబరు 16న మినీ వేలం నిర్వహించవచ్చని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ వేలం కోసం అన్ని జట్ల పర్స్ కూడా పెరుగుతుంది. ఐపీఎల్‌లోని మొత్తం 10 జట్ల పర్స్‌లో 5 కోట్లు జోడించనున్నారు. ప్రస్తుతం ఐపీఎల్ జట్ల గరిష్ట పర్స్ రూ.90 కోట్లు కాగా, త్వరలోనే ఈ పర్స్ రూ.95 కోట్లకు పెరగడం గమనార్హం. వాస్తవానికి గత ఏడాది బీసీసీఐ తన బ్లూప్రింట్‌ను రూపొందించింది. అదే సమయంలో, IPL మెగా వేలం 2022లో అన్ని జట్ల పర్స్ రూ. 90 కోట్లు, అంటే ఏ జట్టు అయినా గరిష్టంగా రూ. 90 కోట్లు ఖర్చు చేయగలదు.
ఇవి కూడా చదవండి
IPL 2024 కోసం పర్స్ రూ. 100 కోట్లు కానుందా?
IPL 2024 కోసం పర్స్ పరిమాణం 95 కోట్ల రూపాయల నుంచి 100 కోట్ల రూపాయలకు పెరుగుతుందని మీడియా నివేదికలు వస్తున్నాయి. అయితే, ఫ్రాంచైజీకి జీతం పర్స్ పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. ఇది ట్రేడ్-ఇన్ ప్రాతిపదికన ఆధారపడి ఉంటుంది. అయితే, మినీ వేలంలో అన్ని జట్ల పర్స్ ఏమిటన్నది BCCI వార్షిక సాధారణ సమావేశంలో అంటే AGMలో నిర్ణయించనున్నారు. దీంతో పాటు ఐపీఎల్ 2023 మ్యాచ్‌లను ఏ వేదికపై నిర్వహించాలనేది కూడా ఈ సమావేశంలో నిర్ణయించనున్నారు.
IPL 2023 వేలం: విడుదలైన ఆటగాళ్లు, రిటైన్ చేసిన ఆటగాళ్ల జాబితా..