IND vs AUS: రేపే హైదరాబాద్‌లో భారత్, ఆసీస్ కీలక పోరు.. ఇంకా గ్రౌండ్ సిద్ధం చేయని హెచ్‌సీఏ.. మ్యాచ్ సజావుగా సాగేనా?
భారత్, ఆస్ట్రేలియా మధ్య టీ20 సిరీస్‌లో మూడో, కీలక మ్యాచ్ రేపు హైదరాబాద్ వేదికగా జరగనుంది. సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఇక నాగ్ పూర్‌లో జరిగిన రెండో టీ20లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది
India vs Australia 3rd T20I: రేపే భారత్, ఆస్ట్రేలియా టీంల మధ్య హైదరాబాద్‌లో సిరీస్ డిసైడర్ మ్యాచ్, మూడో టీ20 జరగనుంది. రేపు రాత్రి ఏడుగంటలకు మ్యాచ్ ప్రారంభమవుతోంది. అయితే, ఇప్పటి వరకు టికెట్ల విషయంలో అభాసుపాలైన హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ).. ఇప్పటికీ మ్యాచ్ నిర్వహణ కోసం గ్రౌండ్ రెడీ చేయలేకపోవడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కీలక మ్యాచ్ కోసం చేస్తున్న ఏర్పాట్లలో HCA నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. టికెట్ల అమ్మకాలపై ఇప్పటికే తీవ్రమైన విమర్శుల ఎదుర్కొన్న HCA మ్యాచ్‌నైనా సరిగ్గా నిర్వాహిస్తుందా? అనే అనుమానాలు అభిమానుల్లో మొదలయ్యాయి.
కీలక పోరు కోసం భద్రత కట్టుదిట్టం..
ఇటు ఉప్పల్ మ్యాచ్‌కు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. 2500 మంది పోలీసులను సెక్యూరిటీ కల్పిస్తున్నారు. 300 వరకు సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. వీటిని కమాండ్ కంట్రోల్ రూమ్ సెంటర్‌కు కనెక్ట్ చేశారు.
నేడు హైదరాబాద్ చేరుకోనున్న ఆటగాళ్లు..
రేపటి మ్యాచ్‌లో ఆడేందుకు ఇరుజట్ల ఆటగాళ్లు.. శనివారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకుంటారు. ఐటీసీ కాకతీయలో బస చేస్తారు. గత అనుభవాలతో ఎయిర్‌పోర్టు నుంచి ఆటగాళ్లు స్టేడియం చేరేవరకూ పోలీసులు కట్టదిట్టమైన సెక్యూరిటీ ఏర్పాటు చేశారు.
సిరీస్ డిసైడర్ మ్యాచ్..
భారత్, ఆస్ట్రేలియా మధ్య టీ20 సిరీస్‌లో మూడో, కీలక మ్యాచ్ రేపు హైదరాబాద్ వేదికగా జరగనుంది. సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. భారత్, ఆస్ట్రేలియా మధ్య నాగ్‌పూర్‌లో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో రోహిత్ సేన అద్భుత విజయం సొంతం చేసుకుంది. దీంతో సిరీస్‌ను 1-1తో సమం చేసింది. టీమిండియా 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ 8 ఓవర్ల మ్యాచ్‌లో, ఆస్ట్రేలియా మొదట ఆడిన తర్వాత టీమ్ ఇండియాకు 91 పరుగుల లక్ష్యాన్ని అందించింది. కాగా, టీమిండియా 4 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. భారత్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ 46 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో రేపు హైదరాబాద్‌లో జరిగే నిర్ణయాత్మక మ్యాచ్‌లో తేల్చుకునేందుకు ఇరుజట్లు సిద్ధమయ్యాయి.
ఇరుజట్ల ప్రాబబుల్ ప్లేయింగ్ XI:
టీమిండియా ప్రాబబుల్ ప్లేయింగ్ XI: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్.
ఆస్ట్రేలియా ప్రాబబుల్ ప్లేయింగ్ XI: ఆరోన్ ఫించ్, కామెరాన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్, పాట్ కమిన్స్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్.
స్క్వాడ్‌లు:
భారత జట్టు: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ (సారథి), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ (కీపర్), అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, దీపక్ చాహర్, యుజ్వేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా, ఉమేష్ యాదవ్, రిషబ్ పంత్ , రవిచంద్రన్ అశ్విన్, దీపక్ హుడా
ఆస్ట్రేలియా జట్టు: ఆరోన్ ఫించ్ (సారథి), కామెరాన్ గ్రీన్, స్టీవెన్ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్ (కీపర్), పాట్ కమిన్స్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్, కేన్ రిచర్డ్‌సన్, సీన్ అబాట్, అష్టన్ అగర్ , డేనియల్ సామ్స్