Video: 40 ఏళ్ల వయసులో ఇదెక్కడి మ్యాజిక్ మావా.. గాల్లోకి ఎగిరి 3 సెకన్లలోనే బ్యాటర్‌కు షాకిచ్చిన కోహ్లీ దోస్త్
Faf du Plessis Brilliant Catch: 40 ఏళ్ల వయసులో కూడా ఫాఫ్ డు ప్లెసిస్ ఇలాంటి అసాధారణమైన క్యాచ్ పట్టడం అతని ఫిట్‌నెస్, ఆటపై ఉన్న అంకితభావానికి నిదర్శనం. ఈ క్యాచ్ క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టించింది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

మేజర్ లీగ్ క్రికెట్ (MLC) 2025లో టెక్సాస్ సూపర్ కింగ్స్, ఎంఐ న్యూయార్క్ మధ్య జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో, టెక్సాస్ సూపర్ కింగ్స్ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ పట్టిన ఒక అద్భుతమైన క్యాచ్, మ్యాచ్ గమనాన్ని పూర్తిగా మార్చేసింది. ఈ క్యాచ్‌తో మైఖేల్ బ్రాస్‌వెల్ ఔట్ అవ్వగా, టెక్సాస్ కేవలం 3 పరుగుల తేడాతో విజయం సాధించింది.
మ్యాచ్ పరిస్థితి..
ఎంఐ న్యూయార్క్ 186 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆ జట్టు టాప్ ఆర్డర్ త్వరగానే కుప్పకూలి 24 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. అయితే, మోనంక్ పటేల్ (62 పరుగులు), మైఖేల్ బ్రాస్‌వెల్ (38 పరుగులు) నాలుగో వికెట్‌కు 95 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును తిరిగి పోటీలోకి తెచ్చారు. బ్రాస్‌వెల్ 21 బంతుల్లో 38 పరుగులు చేసి ప్రమాదకరంగా మారాడు. ఈ దశలో ఆట ఎంఐ న్యూయార్క్ వైపు మొగ్గు చూపుతున్నట్లు అనిపించింది.
డు ప్లెసిస్ మ్యాజిక్..
ఎంఐ న్యూయార్క్ ఇన్నింగ్స్ 14వ ఓవర్‌లో, ఆడమ్ మిల్న్ బౌలింగ్‌లో బ్రాస్‌వెల్ ఆఫ్ సైడ్ మీదుగా గాల్లోకి షాట్ కొట్టాడు. అది బౌండరీ లైన్‌కు వెళ్తున్నట్లు అనిపించింది. కానీ, మిడ్-ఆఫ్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ఫాఫ్ డు ప్లెసిస్, తన 40వ ఏట కూడా అద్భుతమైన చురుకుదనాన్ని ప్రదర్శిస్తూ, కుడివైపు పూర్తి స్థాయిలో దూకి, ఒక చేత్తో ఆ బంతిని అందుకున్నాడు. ఈ క్యాచ్ కేవలం కొన్ని అంగుళాల దూరంలో నేలను తాకే లోపే అతని చేతిలోకి వచ్చింది.
మ్యాచ్ గమనాన్ని మర్చేసిన క్యాచ్..
WHAT A CATCH BY FAF DU PLESSIS ‼️
This belongs at the top of @SportsCenter‘s Top 10. 🔥 pic.twitter.com/3iKYrVLgLS
— Cognizant Major League Cricket (@MLCricket) June 14, 2025
డు ప్లెసిస్ పట్టిన ఈ అద్భుతమైన క్యాచ్‌తో బ్రాస్‌వెల్ ఔట్ అవ్వడం ఎంఐ న్యూయార్క్‌కు పెద్ద దెబ్బ. ఈ వికెట్ పడటంతో వారి భాగస్వామ్యం బద్దలైంది. దీంతో ఆ జట్టు దూకుడు ఆగిపోయింది. ఈ క్యాచ్ బ్యాటింగ్ జట్టులో ఉత్సాహాన్ని పూర్తిగా మార్చేసింది. బ్రాస్‌వెల్ ఔటైన తర్వాత, ఎంఐ న్యూయార్క్ వేగంగా వికెట్లను కోల్పోయింది. చివరకు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 182 పరుగులు మాత్రమే చేసి, 3 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
ఫాఫ్ డు ప్లెసిస్ – వయసు కేవలం ఒక సంఖ్య..
40 ఏళ్ల వయసులో కూడా ఫాఫ్ డు ప్లెసిస్ ఇలాంటి అసాధారణమైన క్యాచ్ పట్టడం అతని ఫిట్‌నెస్, ఆటపై ఉన్న అంకితభావానికి నిదర్శనం. ఈ క్యాచ్ క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టించింది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బౌలింగ్, బ్యాటింగ్‌లో కూడా రాణించినప్పటికీ, ఈ మ్యాచ్‌లో అతని అద్భుతమైన ఫీల్డింగ్ ప్రదర్శన టెక్సాస్ సూపర్ కింగ్స్ విజయానికి కీలక కారణమైంది. ఈ క్యాచ్ MLC 2025 సీజన్‌లో గుర్తుండిపోయే క్షణాల్లో ఒకటిగా నిలిచిపోతుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




