46 బంతుల్లో సూపర్ సెంచరీ.. కానీ మద్యానికి బానిసయ్యాడు.. ఈ మాజీ ఆర్‌సీబీ ప్లేయర్ ఎవరంటే.!
క్రీడాకారుల్లో ఎంతటి ప్రతిభ ఉన్నా కూడా మైదానం వెలుపల వారు చేసే చర్యలు అపకీర్తిని ఖచ్చితంగా తెచ్చిపెడతాయి. క్రికెట్ చరిత్రలో ఇలాంటి..
క్రీడాకారుల్లో ఎంతటి ప్రతిభ ఉన్నా కూడా మైదానం వెలుపల వారు చేసే చర్యలు అపకీర్తిని ఖచ్చితంగా తెచ్చిపెడతాయి. క్రికెట్ చరిత్రలో ఇలాంటి ప్లేయర్స్ ఎందరో ఉన్నారు. ఆ కోవకు చెందిన ఓ ఆటగాడి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇతడు అసాధారణ ప్రతిభావంతుడు. ఓపెనర్‌గా దిగాడంటే ప్రత్యర్ధులు బెంబేలెత్తాల్సిందే. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. విరాట్ కోహ్లీ సారధ్యంలో పలు మ్యాచ్‌లు సైతం ఆడాడు. కేవలం 46 బంతుల్లోనే తుఫాన్ సెంచరీ బాదేసిన ఈ ఆటగాడి కెరీర్ మద్యానికి బానిస కావడం, మర్మైట్ కేసుల్లో ఇరుక్కోవడం వల్ల ముగిసింది. అతడెవరో కాదు న్యూజిలాండ్ క్రికెటర్ జెస్సీ రైడర్. ఈరోజు అతడి పుట్టినరోజు.
1984 ఆగస్టు 6న వెల్లింగ్టన్‌లో జెస్సీ రైడర్ జన్మించాడు. న్యూజిలాండ్ జట్టు తరపున 18 టెస్టులు, 48 వన్డేలు, 22 టీ20లు ఆడిన రైడర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కూడా పాల్గొన్నాడు. ఈ లీగ్‌లో, అతను విరాట్ కోహ్లీ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించాడు. రైడర్ 2009లో RCB జట్టులోకి అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత 2012 వరకు పూణే వారియర్స్ జట్టులో భాగమయ్యాడు. జెస్సీ రైడర్ ఐపీఎల్‌లో 29 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో, అతను 21.57 సగటుతో 604 పరుగులు చేశాడు. అదే సమయంలో 8 వికెట్లు కూడా పడగొట్టాడు. 1 జనవరి 2014న, కోరీ ఆండర్సన్ 36 బంతుల్లో వేగవంతమైన సెంచరీ సాధించి చరిత్ర సృష్టించిన మ్యాచ్‌లోనే రైడర్ కూడా తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. 46 బంతుల్లో 104 పరుగులు సాధించాడు.
2008లో అంతర్జాతీయ అరంగేట్రం తర్వాత జెస్సీ రైడర్ ఒక్క సెంచరీ చేశాడు. ఆ తర్వాత 2012లో మద్యానికి బానిసై క్రికెట్‌కు దూరమయ్యాడు. ఈ తరుణంలో అతడికి న్యూజిలాండ్ క్రికెట్ జట్టు జాతీయ కాంట్రాక్ట్ దక్కలేదు. ఆ తర్వాత 2013లో అతడి పునరాగమనం ఖాయం అనుకునేలోపే మళ్లీ గొడవలో ఇరుక్కుని గాయపడ్డాడు. ఏడు నెలల తరువాత క్రికెట్‌లోకి తిరిగి వచ్చాడు. 2014-15 భారత పర్యటన కోసం ఎంపికైన జట్టులో రైడర్ పేరు కూడా ఉంది. అయితే, క్రమశిక్షణ రాహిత్యం కారణంగా మళ్లీ జట్టు నుంచి తొలగించారు.
రైడర్ కెరీర్ ప్రొఫైల్…
జెస్సీ రైడర్ న్యూజిలాండ్ తరఫున 18 టెస్టు మ్యాచ్‌లలో 40.93 సగటుతో 1269 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, ఆరు అర్ధ సెంచరీలు ఉన్నాయి. అతడి అత్యధిక స్కోరు 201 పరుగులు. టెస్టుల్లో ఐదు వికెట్లు కూడా తీశాడు. 48 వన్డేలలో మూడు సెంచరీలు, ఆరు అర్ధ సెంచరీలతో 33.21 సగటుతో 1362 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో, 12 వికెట్లు కూడా పడగొట్టాడు. ఇక టీ20ల విషయానికి వస్తే.. 22.85 సగటుతో 457 పరుగులు చేశాడు.
Also Read:
మొసలికి చిక్కిన అడవి దున్న.. కట్ చేస్తే సీన్ రివెర్స్.. చూస్తే షాక్ అవ్వాల్సిందే!
బ్రతుకున్న పామును కరకరా నమిలి మింగేసిన యువకుడు.. కారణం తెలిస్తే షాకే.!
10 వేలకుపైగా పరుగులు, 1697 వికెట్లు.. ఈ దిగ్గజ క్రికెటర్ మామూలోడు కాదు.. అతడెవరో తెలుసా!