కోహ్లీ మైండ్‌సెట్ ఫాలో అవుతా- జోస్‌ బట్లర్‌

డిల్లీ: వన్డే క్రికెట్‌లో నెంబర్ వన్ బ్యాట్స్‌మెన్, టీమిండియా సారథి కోహ్లికి సాధారణ ప్రజలే కాదు, ఇతర దేశాల ఆటగాళ్లలోను అభిమానులు ఉన్నారు. దేశం, విదేశం అని తేడా లేకుండా సెంచరీలతో విరుచుకుపడుతున్న కోహ్లీ మైండ్‌సెట్‌ను  తాను ఫాలో అవ్వాలని  కోరుకుంటున్నట్టు ఇంగ్లాండ్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ జోస్‌ బట్లర్‌ అన్నాడు. ఒక ఆటగాడు కొంతకాలమే అత్యున్నత స్థితిలో ఉంటాడన్న దాంట్లో నిజం లేదని వెల్లడించాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టలో బట్లర్ సభ్యుడిగా ఉన్న విషయం తెలిసిందే.  […]

కోహ్లీ మైండ్‌సెట్ ఫాలో అవుతా- జోస్‌ బట్లర్‌
Follow us

|

Updated on: Mar 21, 2019 | 4:33 PM

డిల్లీ: వన్డే క్రికెట్‌లో నెంబర్ వన్ బ్యాట్స్‌మెన్, టీమిండియా సారథి కోహ్లికి సాధారణ ప్రజలే కాదు, ఇతర దేశాల ఆటగాళ్లలోను అభిమానులు ఉన్నారు. దేశం, విదేశం అని తేడా లేకుండా సెంచరీలతో విరుచుకుపడుతున్న కోహ్లీ మైండ్‌సెట్‌ను  తాను ఫాలో అవ్వాలని  కోరుకుంటున్నట్టు ఇంగ్లాండ్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ జోస్‌ బట్లర్‌ అన్నాడు. ఒక ఆటగాడు కొంతకాలమే అత్యున్నత స్థితిలో ఉంటాడన్న దాంట్లో నిజం లేదని వెల్లడించాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టలో బట్లర్ సభ్యుడిగా ఉన్న విషయం తెలిసిందే.  బట్లర్ గత  ఐపిఎల్‌లో ఎటువంటి సంచలనాలు క్రియేట్ చేశాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఎప్పుడో ఒకసారి మాత్రమే అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని నేను అనుకోవడం లేదు. గొప్ప ఆటతీరును ప్రతి సారి ప్రదర్శించాలన్నాది నా విశ్వాసం. ఈ విషయంలో నాకు విరాట్ కోహ్లి మార్గనిర్దేశకుడు.  అతను ఆడిన ప్రతి మ్యాచ్‌లో శతకం బాదేస్తున్నాడు. ఇక చాలు! ఏదో ఒకసారి మాత్రమే అద్భుతంగా ఆడగలమని అతడు అనుకోడు. ఒక విదేశీ ఆటగాడిగా భారత్‌లోని అడ్డంకులను అధిగమించడం కొత్త అనుభవం. నేను టాప్-4లో ఉండొచ్చు లేదా తుది పదకొండు మందిలో ఒకడిని కావొచ్చు. మనపై మనకు నమ్మకం ఉంటే కచ్చితంగా బాగా ఆడగలం’ అని బట్లర్‌ పేర్కొన్నాడు.