సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు శుభవార్త
హైదరాబాద్: గత సీజన్‌లో సన్‌రైజర్స్ జట్టును తన నాయకత్వంతో న్యూజీలాండ్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ అద్భుతంగా నడిపించాడు. రన్నరప్‌గా నిలిచింది. అయితే ఈ సీజన్‌కు మాత్రం విలియమ్సన్ ఉండబోడని అంతా అనుకున్నారు. కారణం బంగ్లాదేశ్‌తో రెండో టెస్ట్ సందర్భంగా అతను గాయపడటమే. అయితే ప్రస్తుతం భుజం గాయం నుంచి కోలుకున్న విలియమ్సన్ కోలుకున్నాడు. న్యూజిలాండ్ క్రికెట్ అవార్డుల కార్యక్రమం ముగిసిన తర్వాత కేన్, తన సన్‌రైజర్స్ జట్టు సహచర ఆటగాడు మార్టిన్ గుప్తిల్‌తో కలిసి భారత్ రాబోతున్నాడు. […]

హైదరాబాద్: గత సీజన్‌లో సన్‌రైజర్స్ జట్టును తన నాయకత్వంతో న్యూజీలాండ్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ అద్భుతంగా నడిపించాడు. రన్నరప్‌గా నిలిచింది. అయితే ఈ సీజన్‌కు మాత్రం విలియమ్సన్ ఉండబోడని అంతా అనుకున్నారు. కారణం బంగ్లాదేశ్‌తో రెండో టెస్ట్ సందర్భంగా అతను గాయపడటమే.
అయితే ప్రస్తుతం భుజం గాయం నుంచి కోలుకున్న విలియమ్సన్ కోలుకున్నాడు. న్యూజిలాండ్ క్రికెట్ అవార్డుల కార్యక్రమం ముగిసిన తర్వాత కేన్, తన సన్‌రైజర్స్ జట్టు సహచర ఆటగాడు మార్టిన్ గుప్తిల్‌తో కలిసి భారత్ రాబోతున్నాడు. విలియమ్సన్ రావడంతో సన్‌రైజర్స్ జట్టు బ్యాటింగ్‌లో బలంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
గత సీజన్‌లో విలియమ్సన్ 17 మ్యాచ్‌ల్లో 8 అర్ధ సెంచరీలతో 735 పరుగులతో టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆదివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ జరగనున్న తమ ఆరంభ పోరులో నైట్‌రైడర్స్‌తో సన్‌రైజర్స్ తలపడనుంది.