సెమీస్‌లోకి దూసుకెళ్లిన ఇంగ్లాండ్!

 చెస్టర్ లీ స్ట్రీట్‌: ప్రపంచకప్ లీగ్ మ్యాచ్‌లో ఆతిధ్య ఇంగ్లాండ్ జట్టు న్యూజిలాండ్‌పై 119 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఇంగ్లీష్ జట్టు సెమీస్‌లోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్ ఓటమితో కివీస్ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. కాగా శుక్రవారం జరగబోయే పాకిస్థాన్, బంగ్లాదేశ్ మ్యాచ్‌తో సెమీస్‌లో అడుగు పెట్టే నాలుగో టీమ్ ఏది అన్నది తేలనుంది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్‌కు.. ఓపెనర్లు జానీ బెయిర్‌స్టో (106; 99 బంతుల్లో […]

  • Ravi Kiran
  • Publish Date - 12:04 am, Thu, 4 July 19
సెమీస్‌లోకి దూసుకెళ్లిన ఇంగ్లాండ్!

 చెస్టర్ లీ స్ట్రీట్‌: ప్రపంచకప్ లీగ్ మ్యాచ్‌లో ఆతిధ్య ఇంగ్లాండ్ జట్టు న్యూజిలాండ్‌పై 119 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఇంగ్లీష్ జట్టు సెమీస్‌లోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్ ఓటమితో కివీస్ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. కాగా శుక్రవారం జరగబోయే పాకిస్థాన్, బంగ్లాదేశ్ మ్యాచ్‌తో సెమీస్‌లో అడుగు పెట్టే నాలుగో టీమ్ ఏది అన్నది తేలనుంది.

మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్‌కు.. ఓపెనర్లు జానీ బెయిర్‌స్టో (106; 99 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్స్), జేసన్ రాయ్ (60; 61 బంతుల్లో 8 ఫోర్లు) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లకు 8 వికెట్లు నష్టపోయి 305 పరుగులు చేసింది. అటు కివీస్ బౌలర్లలో బౌల్ట్, హెన్రీ, నీషం చెరో రెండు వికెట్లు తీయగా.. శాన్టనర్, సౌతీలు తలో వికెట్ పడగొట్టారు.

అనంతరం లక్ష్యఛేదనలో భాగంగా బరిలోకి దిగిన న్యూజిలాండ్ 45 ఓవర్లకు 186 పరుగులు చేసి ఆలౌట్ అయింది. కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. ముఖ్యంగా కీలక బ్యాట్స్‌మెన్లు కేన్ విలియమ్సన్, రాస్ టేలర్‌లు రనౌట్ కావడంతో కివీస్ ఏ దశలోనూ చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరచలేదు. కాగా టామ్ లాథమ్ (57; 65 బంతుల్లో 5 ఫోర్లు) ఒక్కడే జట్టులో రాణించాడు. ఇక ఇంగ్లీష్ బౌలర్లలో వుడ్ 3 వికెట్లు తీయగా.. వోక్స్, ఆర్చర్, ప్లంకెట్, రషీద్, స్టోక్స్‌ తలో వికెట్ పడగొట్టారు.