చెన్నై ‘సూపర్’ విక్టరీ..!

కోల్‌కతాపై ఘన విజయం  మెరిసిన డుప్లెసిస్, చాహర్   రసెల్ అర్ధ సెంచరీ వృధా  చెన్నై: చెపాక్ స్టేడియం వేదికగా కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఘన విజయం సాధించింది. మంగళవారం టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా… చెన్నై బౌలర్లు చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 108 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆండ్రూ రసెల్ (50 నాటౌట్; 44 బంతుల్లో 5×4, 3×6) అర్ధ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక […]

  • Ravi Kiran
  • Publish Date - 8:49 am, Wed, 10 April 19
చెన్నై 'సూపర్' విక్టరీ..!
  • కోల్‌కతాపై ఘన విజయం 
  • మెరిసిన డుప్లెసిస్, చాహర్  
  • రసెల్ అర్ధ సెంచరీ వృధా 

చెన్నై: చెపాక్ స్టేడియం వేదికగా కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఘన విజయం సాధించింది. మంగళవారం టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా… చెన్నై బౌలర్లు చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 108 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆండ్రూ రసెల్ (50 నాటౌట్; 44 బంతుల్లో 5×4, 3×6) అర్ధ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక చెన్నై బౌలర్లలో చాహర్ 3 వికెట్లు తీయగా, హర్భజన్, తాహిర్ రెండు వికెట్లు, జడేజా ఒక వికెట్ పడగొట్టారు.

అనంతరం లక్ష్య ఛేదనలో భాగంగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై జట్టుకు ఓపెనర్ డుప్లెసిస్ (43 నాటౌట్; 45 బంతుల్లో 3×4, 0×6)తో పాటు అంబటి రాయుడు (21; 31 బంతుల్లో 2×4, 0×6) సత్తా చాటడంతో లక్ష్యాన్ని 17.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కోల్‌కతా పతనంలో కీలక పాత్ర పోషించిన దీపక్ చాహర్‌కు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.