IPL 2025: తలా వస్తే తలరాత మారుతుందా?… మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు!
సీఎస్‌కే కెప్టెన్‌గా మళ్లీ ధోని పగ్గాలు చేపట్టడంపై భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప కీలక వ్యాఖ్యలు చేశారు. ధోనికి కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చినంత మాత్రానా సీఎస్‌కే గెలుస్తుందనుకోవడం కరెక్ట్ కాదని సెటైర్లు వేశారు. జట్టులో ఉన్న లోపాలు తొలిగిపోతేనే సీఎస్‌కేకు విజయాలు వరిస్తాయని అన్నారు. అప్పుడు సీఎస్‌కేను ఎవరూ ఆపలేరని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనిని ఉద్దేశించి మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప కీలక వ్యాఖ్యలు చేశారు. గాయం కారణంగా చెన్నై సూపర్ కింగ్స్ రెగ్యులర్ కెప్టెన్‌గా ఉన్న రుత్‌రాజ్ గైక్వాడ్ ఈ సీజన్‌కు దూరం కావడంతో ఆయన స్థానంలో ఎంఎస్ ధోనికి సీఎస్‌కే యాజమాన్యం కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించింది. ఇక ఇవాళ కేకేఆర్‌తో జరగబోయే మ్యాచ్‌లో సీఎస్‌కేకు కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ వ్యవహరించనున్నారు. ధోని మళ్లీ కెప్టెన్ అయ్యారు కాబట్టి సీఎస్‌కే గెలుస్తుందని జరుగుతున్న ప్రచారంపై రాబిన్ ఉతప్ప స్పందించారు. ధోనీకి కొత్తగా కెప్టెన్సీ ఇచ్చినంత మాత్రానా..సీఎస్‌కే గెలుస్తుందనడం న్యాయం కాదన్నారు..చెన్నై జట్టులో చాలా లోపాలు ఉన్నాయని వాటిని అధికమిస్తేనే విజయాలు వరిస్తాయి తప్ప.. ధోనికి కెప్టెన్సీ ఇస్తే గెలుస్తుందనడం కరెక్ట్ కాదు అన్నారు.
2008 నుంచి 2023 వరకు వరకు చెన్నై సూపర్ కింగ్స్‌కు కెప్టెన్‌గా ఐదు ఐపీఎల్ ట్రోఫీలను ఎంఎస్ ధోని అందించారు. కెప్టెన్సీ నుంచి ధోని తప్పుకోవడంతో గత సీజన్‌లో రుత్‌రాజ్‌కు యాజమాన్యం ఆ బాధ్యతలను అప్పగించింది. అప్పుడు సీఎస్‌కే కనీసం ప్లే ఆఫ్స్ కూడా వెళ్లలేదు తర్వాత జడేజాను కెప్టెన్‌గా చేయగా అప్పుడు కూడా సీఎస్‌కే అంతగా రాణించలేక పోయింది. దీంతో చివర్లో ధోనీనే జట్టు పగ్గాలు చేపట్టారు. ఇలా సీఎస్‌కే కష్టాల్లో ఉన్న ప్రతిసారి ఆయన ముందుకు వచ్చి కెప్టెన్సీ బాధ్యతలు తీసుకొని జట్టును ముందుకు నడిపిస్తుంటారు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
