Deepak Chahar: ఒక అక్కగా ఏం మాట్లాడాలో కూడా తెలియదా? దీపక్‌ సోదరిపై మండిపడుతున్న నెటిజన్లు.. కారణమేంటంటే..

Deepak Chahar: దీపక్‌ సోదరి మాలతి చాహర్‌ (Malathi Chahar) తన తమ్ముడి పెళ్లి ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ విష్‌ చేసింది. అయితే ఈ పోస్ట్‌లో చేసిన కొన్ని వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు

Deepak Chahar: ఒక అక్కగా ఏం మాట్లాడాలో కూడా తెలియదా? దీపక్‌ సోదరిపై మండిపడుతున్న నెటిజన్లు.. కారణమేంటంటే..
Deepak Chahar

Updated on: Jun 04, 2022 | 6:07 PM

Deepak Chahar: టీమిండియా పేసర్‌ దీపక్‌ చాహర్‌ ఇటీవలే ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. తన ప్రియురాలు జయా భరద్వాజ్‌తో కలిసి ఆగ్రా వేదికగా పెళ్లిపీటలెక్కాడు. దీంతో కొత్త జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం దీపక్‌ పెళ్లి ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారుతున్నాయి. పలువురు క్రికెటర్లతో పాటు సెలబ్రిటీలు కొత్త జంటను ఆశీర్వదిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఈక్రమంలో దీపక్‌ సోదరి మాలతి చాహర్‌ (Malathi Chahar) తన తమ్ముడి పెళ్లి ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ విష్‌ చేసింది. అయితే ఈ పోస్ట్‌లో చేసిన కొన్ని వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. ‘ఒక సోదరిగా ఏం మాట్లాడాలో తెలియదా?’ అంటూ తెగ ట్రోల్‌ చేస్తున్నారు. ఇంతకీ తన పోస్టులో ఏం రాసుకొచ్చిందంటే..

హనీమూన్‌ విషయంలో..

ఇవి కూడా చదవండి

తన తమ్ముడి పెళ్లి ఫొటోను పంచుకున్న మాలతి.. ‘ఇప్పుడు ఈమె మా ఇంటిపిల్ల అయిపోయింది. మీ ఇద్దరికీ శుభాకాంక్షలు. మీకు దిష్టి తగలకూడదు. దీపక్‌.. హనీమూన్‌ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండు. అసలే ప్రపంచకప్‌ టోర్నీ సమీపిస్తోంది’ అని అందులో రాసుకొచ్చింది. ఈ వ్యాఖ్యలే నెటిజన్ల ఆగ్రహానికి కారణమయ్యాయి. మరీ ఇంత పబ్లిక్‌గా ఇలాంటి కామెంట్లు చేయడం దారుణమంటూ నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. మరీ ఇంత ఓవరాక్షన్‌ అవసరం లేదని, ఒక సోదరిగా మీరు మాట్లాడే మాటలు చాలా దారుణంగా ఉన్నాయంటూ మండిపడుతున్నారు. అయినా ప్రపంచకప్‌కు చాలా సమయముంది. అప్పుడే దీపక్‌ను జట్టులోకి తీసుకుంటారని ఫిక్స్‌ అయిపోయారా? అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే మాలతి సరదాగానే ఈ మాటలందని అందులో తప్పులు వెతకాల్సిన అవసరం లేదని, ప్రతి చిన్న విషయానికి తప్పుడు అర్థాలు ఆపాదించి విమర్శించడం సహేతుకం కాదని మరికొందరు మాలతికి సపోర్టుగా నిలుస్తున్నారు. కాగా ఐపీఎల్‌-2022 మెగా వేలంలో 14 కోట్లకు దీపక్‌ చహర్‌ను కొనుగోలు చేసింది చెన్నై సూపర్‌ కింగ్స్‌. అయితే గాయం కారణంగా సీజన్‌ మొత్తానికి దూరంగా ఉన్నాడు. త్వరలో జరిగే దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు కూడా అతను ఎంపిక కాలేదు.

Also Read:

IND vs SA: రేపటి నుంచి విశాఖ టీ 20 మ్యాచ్‌ టికెట్ల విక్రయాలు.. ఎలా బుక్‌ చేసుకోవాలంటే..

Japan Population: ఇలాగే కొనసాగితే ఆ ప్రముఖ ఆసియా దేశం కనబడకపోవచ్చు.. ఆందోళన చెందుతున్న నిపుణులు!

Beauty tips: ఈ సింపుల్‌ ఫేస్‌ ప్యాక్‌తో ముఖంపై మచ్చలు ఇట్టే మాయం..ఎలా తయారుచేయాలంటే..