IPL 2024: పతిరణ కళ్లు చెదిరే యార్కర్.. గాల్లోకి స్టంప్స్ .. దెబ్బకు మర్‌క్రమ్ ఫ్యూజులౌట్.. వీడియో

ట్రావిస్‌ హెడ్‌ (13), అభిషేక్‌ శర్మ (15), నితీశ్‌ రెడ్డి (15), క్లాసెన్‌ (20), అబ్దుల్‌ సమద్‌ (19) ఇలా ఒక్కొక్కరు వరుసగా పెవిలియన్ చేరారు. అయితే మాజీ కెప్టెన్ ఐడెన్ మర్కరమ్ కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. 32 పరుగులు చేసి ఎస్ఆర్‌హెచ్ స్కోరును ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. కానీ సీఎస్కే పేసర్ మతీశ పతిరణ ఒక అద్బుత బంతితో మర్కరమ్ ను పెవిలియన్ బాట పట్టించాడు.

IPL 2024: పతిరణ కళ్లు చెదిరే యార్కర్.. గాల్లోకి స్టంప్స్ .. దెబ్బకు మర్‌క్రమ్ ఫ్యూజులౌట్.. వీడియో
Matheesha Pathirana
Follow us

|

Updated on: Apr 29, 2024 | 6:13 PM

చెన్నై వేదికగా ఆదివారం (ఏప్రిల్ 28) సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఏకంగా 78 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే.. నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనలో ఎస్ ఆర్ హెచ్ బ్యాటర్లు పూర్తిగా తడబడ్డారు. క్రీజులో నిలవలేకపోయారు. దీంతో 18.5 ఓవర్లలో కేవలం 134 పరుగులకే కుప్పకూలి దారుణ ఓటమిని మూటగట్టుకుంది హైదరాబాద్. తుషార్ దేశ్ పాండే 4 వికెట్లు తీసి ఎస్ఆర్‌హెచ్ ను కుప్ప కూల్చాడు. వీరితో ముస్తాఫిజుర్ రెహమాన్, మతీశ్ పతిరణ చెరో రెండు వికెట్లు తీయగా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్ ఒక్కొక్క వికెట్ పడగొట్టారు. చెన్నై బౌలర్ల ధాటికి సూపర్బ్‌ ఫామ్ లో ఉన్న ట్రావిస్‌ హెడ్‌ (13), అభిషేక్‌ శర్మ (15), నితీశ్‌ రెడ్డి (15), క్లాసెన్‌ (20), అబ్దుల్‌ సమద్‌ (19) ఇలా ఒక్కొక్కరు వరుసగా పెవిలియన్ చేరారు. అయితే మాజీ కెప్టెన్ ఐడెన్ మర్కరమ్ కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. 32 పరుగులు చేసి ఎస్ఆర్‌హెచ్ స్కోరును ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. కానీ సీఎస్కే పేసర్ మతీశ పతిరణ ఒక అద్బుత బంతితో మర్కరమ్ ను పెవిలియన్ బాట పట్టించాడు.

కళ్లు చెదిరే బంతితో..

ఇవి కూడా చదవండి

పతిరణ మార్క్రమ్‌ను బౌల్డ్‌ చేసిన బంతి మ్యాచ్‌ మొత్తానికే హైలైట్‌గా నిలిచిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పతిరణ సంధించిన స్వింగింగ్‌ యార్కర్‌ దెబ్బకు మిడిల్‌ స్టంప్‌ గాల్లోకి ఎగిరింది. ఇది చూసి మర్క్రమ్‌కు కాసేపు ఫ్యూజులు ఎగిరిపోయాయి. కింద పడిపోయిన వికెట్లను చూస్తూ నిరాశగా పెవిలియన్‌ బాట పట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

వీడియో ఇదిగో…

6 మ్యాచుల్లో 13 వికెట్లు..

ఈ మ్యాచ్ లో మొత్తం రెండు ఓవర్లు వేసిన పతిరణ 17 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. అందులో ఒకటి మర్కరమ్ ది కాగా మరొకటి కెప్టెన్ క్లాసన్ ది. అంతేకాదు ఈ సీజన్ లో సూపర్బ్ ఫామ్ లో ఉన్నాడీ శ్రీలంక ప్లేసర్. ఇప్పటివరకు మొత్తం 6 మ్యాచులు ఆడి 13 వికెట్లు నేలకూల్చాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..