AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SRH: టార్గెట్ ఫిక్స్ చేయడంలో పులి.. ఛేజింగ్‌లో పిల్లి.. సన్‌రైజర్స్ చేస్తోన్న తప్పు అదేనా.!

మొన్నటిదాకా ప్రత్యర్ధులకు సన్‌రైజర్స్ హైదరాబాద్ అంటేనే ధడేల్. విధ్వసంకర బ్యాటింగ్‌తో మిగిలిన జట్లను ముచ్చెమటలు పట్టించారు. ముఖ్యంగా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ వీరబాదుడికి టోర్నీలో అత్యధిక స్కోర్లు సాధించింది సన్‌రైజర్స్ హైదరాబాద్. 17 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో..

SRH: టార్గెట్ ఫిక్స్ చేయడంలో పులి.. ఛేజింగ్‌లో పిల్లి.. సన్‌రైజర్స్ చేస్తోన్న తప్పు అదేనా.!
Rcb Vs Srh
Ravi Kiran
|

Updated on: Apr 29, 2024 | 2:08 PM

Share

మొన్నటిదాకా ప్రత్యర్ధులకు సన్‌రైజర్స్ హైదరాబాద్ అంటేనే ధడేల్. విధ్వసంకర బ్యాటింగ్‌తో మిగిలిన జట్లను ముచ్చెమటలు పట్టించారు. ముఖ్యంగా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ వీరబాదుడికి టోర్నీలో అత్యధిక స్కోర్లు సాధించింది సన్‌రైజర్స్ హైదరాబాద్. 17 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో మునుపెన్నడూ ఊహించని రీతిలో 20 ఓవర్లకు 287 పరుగులు కొట్టడమే కాదు.. పవర్ ప్లేలో ఏకంగా 125 పరుగులు చేసి.. వరల్డ్‌ రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ఇంతటి పులిలా ఉన్న SRH.. గత రెండు మ్యాచ్‌ల నుంచి పిల్లిలా మారిపోయింది. మరి అసలు హైదరాబాద్ జట్టు చేస్తోన్న తప్పు ఏంటి.? ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ రెండూ బలమే. బ్యాటింగ్‌లో విధ్వంసకర బ్యాటర్లు ఉండగా.. బౌలింగ్‌లో లైన్ అండ్ లెంగ్త్ సరిగ్గా చూసుకునే అనుభవమున్న వరల్డ్‌ క్లాస్‌ బౌలర్లు ఉన్నారు. అయితే ఇక్కడొచ్చిన పెద్ద చిక్కు ఏంటంటే..? ఎస్‌ఆర్‌హెచ్‌ టీం ఎక్కువగా బ్యాటింగ్‌పైనే ఆధారపడి ఉంది. మరీ ముఖ్యంగా ట్రావిస్‌ హెడ్‌, అభిషేక్‌ శర్మ, హెన్రిచ్‌ క్లాసెన్‌‌పైనే SRH ఎక్కువగా ఆధారపడుతోంది. కానీ, వారు ముగ్గురు విఫలమైతే.. హైదరాబాద్ జట్టు ఓ పసికూన టీంతో సమానం.

వీరు ముగ్గురు విఫలమైన సమయంలో.. మిగిలిన బ్యాటర్లు వారికి ఓ చేయూతగా ఉంటున్నారే తప్పితే.. ముందుంది యాంకర్ రోల్ పోషించలేకపోతున్నారు. వారు విఫలమైన సమయంలో టీమ్‌ను ఆదుకోలేకపోతున్నారు. మార్కరమ్‌, అబ్దుల్‌ సమద్‌, నితీష్‌ రెడ్డి లాంటి ప్లేయర్స్ ఒత్తిడిలో రన్స్ చేయలేకపోతున్నారు. కేవలం ముగ్గురు ఆటగాళ్లపైనే ఎక్కువగా ఆధారపడటం వల్ల హైదరాబాద్ జట్టుకు పెద్ద నష్టం వాటిల్లుతోంది. ఈ విషయాన్ని యాజమాన్యం త్వరగా గ్రహిస్తే.. మిగిలిన మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ దూసుకెళ్లడం ఖాయం.