AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RCB: ఆర్సీబీ ప్లేఆఫ్స్ చేరాలంటే.. ఆ జట్టు అస్సాం ట్రైన్ ఎక్కాల్సిందే.! ఇదేం లెక్కలబ్బా..

ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్‌కి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేరుకుంటుందా.? లేదా.? ఇప్పటిదాకా అందరిలోనూ మెదిలిన ప్రశ్న ఇది. అయితే ఇటీవల వరుసగా రెండు విజయాలు సాధించిన బెంగళూరు జట్టు.. తమ ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంటూ.. దూసుకుపోతోంది. గురువారం సన్‌రైజర్స్‌తో

RCB: ఆర్సీబీ ప్లేఆఫ్స్ చేరాలంటే.. ఆ జట్టు అస్సాం ట్రైన్ ఎక్కాల్సిందే.! ఇదేం లెక్కలబ్బా..
Virat Kohli
Ravi Kiran
|

Updated on: Apr 29, 2024 | 1:45 PM

Share

ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్‌కి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేరుకుంటుందా.? లేదా.? ఇప్పటిదాకా అందరిలోనూ మెదిలిన ప్రశ్న ఇది. అయితే ఇటీవల వరుసగా రెండు విజయాలు సాధించిన బెంగళూరు జట్టు.. తమ ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంటూ.. దూసుకుపోతోంది. గురువారం సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్.. అలాగే ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత విజయాలను అందుకుంది. దీంతో ఆర్సీబీ ప్లేఆఫ్స్ అవకాశాలు ఇప్పటికైతే సజీవంగా ఉన్నాయి.

ఇదిలా ఉండగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చివరి నాలుగు మ్యాచ్‌ల్లోనూ తప్పనిసరిగా విజయాలు సాధించడమే కాదు.. నెట్ రన్‌రేట్‌ను కూడా మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొదటి రెండు స్థానాలైతే ఆర్సీబీకి అసాధ్యం. ఇక చివరి రెండు స్థానాల్లో నిలబడాలంటే.. ఆర్సీబీ 14 పాయింట్లు సాధించాలి. ఇక బెంగళూరు 4వ స్థానంలో నిలబడితే.. ఆ జట్టు నెట్ రన్‌రేట్ మిగిలిన టీమ్స్ గెలుపోటములపై ఆధారపడి ఉంటుంది. ఆ మూడు టీమ్స్ రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చివరి స్థానంలో 14 పాయింట్లతో నిలవాలంటే.. పాయింట్ల పట్టికలో మొదటి మూడు స్థానాల్లో ఉన్న జట్లు 16 పాయింట్లతో తన రన్ పూర్తి చేసుకోవాలి. అలాగే మిగిలిన 6 జట్లు 12 పాయింట్లు మించకూడదు. ఒకవేళ ఇలా కుదరకపోతే.. 14 పాయింట్లతో చాలా జట్లు ఉంటే.. అప్పుడు ఆర్సీబీ తన నెట్ రన్‌రేట్ మంచిగా పెట్టుకోవాల్సి ఉంటుంది. కాగా, RCB మే 4న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో తలపడుతుంది. తర్వాత మే 9న ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో తలపడుతుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు IPL 2024లో తమ లీగ్ చివరి రెండు హోమ్ గేమ్‌లు.. మే 12న ఢిల్లీ క్యాపిటల్స్‌తో, మే 18న చెన్నై సూపర్ కింగ్స్‌తో ముగిస్తుంది.

Follow Us
MDR Charges: యూపీఐ పేమెంట్లపై ఎండీఆర్‌ ఛార్జీలు వాయిదా
MDR Charges: యూపీఐ పేమెంట్లపై ఎండీఆర్‌ ఛార్జీలు వాయిదా
అమరావతి ఓఆర్ఆర్‌పై బిగ్ అప్డేట్
అమరావతి ఓఆర్ఆర్‌పై బిగ్ అప్డేట్
అభిషేక్, వైభవ్ కాదు.. అంతకుమించిన విధ్వంసం ఈ యంగ్ గన్..!
అభిషేక్, వైభవ్ కాదు.. అంతకుమించిన విధ్వంసం ఈ యంగ్ గన్..!
పాత బంగారం ఇచ్చి కొత్తవి కొనుగోలు చేస్తున్నారా..? ఈ జాగ్రత్తలు..
పాత బంగారం ఇచ్చి కొత్తవి కొనుగోలు చేస్తున్నారా..? ఈ జాగ్రత్తలు..
రామ్ చరణ్- సుకుమార్ సినిమాలో 3వేల కోట్ల సినిమా హీరోయిన్
రామ్ చరణ్- సుకుమార్ సినిమాలో 3వేల కోట్ల సినిమా హీరోయిన్
దక్షిణ భారతదేశంలో తప్పక దర్శించాల్సిన 8 ప్రసిద్ధ దేవాలయాలు..
దక్షిణ భారతదేశంలో తప్పక దర్శించాల్సిన 8 ప్రసిద్ధ దేవాలయాలు..
డిసెంజర్ 4న రింకూ సింగ్, ప్రియా సరోజ్ పెళ్లి.. అతిథుల జాబితా ఇదే?
డిసెంజర్ 4న రింకూ సింగ్, ప్రియా సరోజ్ పెళ్లి.. అతిథుల జాబితా ఇదే?
గుడి ప్రసాదం రుచిని తలపించే దద్దోజనం.. ఇలా చేస్తే రోజంతా తాజాగా
గుడి ప్రసాదం రుచిని తలపించే దద్దోజనం.. ఇలా చేస్తే రోజంతా తాజాగా
వాట్సప్‌లో "నో" అనే మెస్సేజ్ వస్తే అలర్ట్.. క్లిక్ చేస్తే అంతే..
వాట్సప్‌లో
దుర్గా నిమజ్జనం రాత్రిపూట ఎందుకు చేయకూడదు? సరైన సమయం, నియమాలు ఇవే
దుర్గా నిమజ్జనం రాత్రిపూట ఎందుకు చేయకూడదు? సరైన సమయం, నియమాలు ఇవే