CSK vs RCB: డేంజరస్ ప్లేయర్‌ను బరిలోకి దింపుతున్న ఆర్సీబీ! ఇక చెన్నైకు కష్టమే..?
ఐపీఎల్ 2025లో భాగంగా ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనున్న కీలకమైన మ్యాచ్ గురించి ఈ వ్యాసం వివరిస్తుంది. రెండు జట్ల ప్లేయింగ్ ఎలెవెన్స్, ముఖ్యంగా భువనేశ్వర్ కుమార్ రీఎంట్రీ, మ్యాచ్ ఫలితం ఆసక్తికర విషయాల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

ఐపీఎల్ 2025లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో ఈ రోజు(శుక్రవారం) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కి అటు సీఎస్‌కే, ఇటు ఆర్సీబీ ఎలాంటి ప్లేయింగ్ ఎలెవన్‌తో బరిలోకి దిగుతారనే ఆసక్తి అందరిలో ఉంది. ఇప్పటికే సీఎస్‌కే తమ హోం గ్రౌండ్‌లో ఒక మ్యాచ్‌లో గెలిచింది. పటిష్టమైన ముంబై ఇండియన్స్‌ను మట్టికరిపించి.. సీజన్‌ను విజయంతో మొదలుపెట్టింది. ఇక ఆర్సీబీ సైతం విక్టరీతోనే ఈ సిరీస్‌ను స్టార్ట్ చేసింది.
తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను వాళ్ల సొంత గ్రౌండ్‌లో ఓడించి.. సూపర్ స్టార్ట్ అందుకుంది. ఇలా రెండు టీమ్స్ కూడా విజయంతోనే ఈ సీజన్‌ను మొదలుపెట్టాయి. ఇప్పుడు రెండో మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారనేది అందరిలో ఉత్కంఠను పెంచుతోంది. అయితే.. సీఎస్‌కే ఈ మ్యాచ్ కూడా తమ హోం గ్రౌండ్‌లో ఆడటం, బలమైన స్పిన్ ఎటాక్ వాళ్లకు ఉండటంతో సీఎస్‌కేనే హాట్ ఫేవరేట్‌గా ఉంది. మరోవైపు ఆర్సీబీ కూడా కృనాల్ పాండ్యా, సుయాష్ శర్మతో పట్టిష్టంగానే కనిపిస్తున్నా.. సీఎస్‌కేతో మ్యాచ్ కోసం మరో స్టార్ ప్లేయర్‌ను ఆర్సీబీ బరిలోకి దింపే సూచనలు కనిపిస్తున్నాయి.
ఆ ప్లేయర్ మరెవరో కాదు.. స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్. కేకేఆర్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భువీ ఆడని విషయం తెలిసిందే. చిన్న గాయం కారణంగా.. తొలి మ్యాచ్‌కు భువీ దూరమయ్యాడు. కానీ, రెండో మ్యాచ్‌కు పూర్తిగా అందుబాటులో ఉంటున్నట్లు సమాచారం. మ్యాచ్ కంటే ముందు ప్రాక్టీస్ సెషన్‌లో కూడా భువీ పూర్తి స్థాయిలో బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. సో.. సీఎస్‌కేతో మ్యాచ్‌లో బరిలోకి దిగి అవకాశం ఉంది. మరి ఎవరి స్థానంలో భువీ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వస్తాడనేది ఆసక్తికరంగా మారింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.