AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CSK vs GT IPL 2026 : పాయింట్ల పట్టికలో ఒకరు 5, ఇంకొకరు 7.. ఈ రోజు చెన్నై పంజా విసురుతుందా? గుజరాత్ షాక్ ఇస్తుందా?

CSK vs GT IPL 2026 : ఐపీఎల్ 2026లో నేడు చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య ఉత్కంఠ పోరు జరగనుంది. ఇరు జట్ల హెడ్-టు-హెడ్ రికార్డులు, ప్లేయింగ్ ఎలెవన్, విజయావకాశాల పూర్తి వివరాలు చూద్దాం. రెండు జట్లు కూడా ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో తలో మూడు విజయాలతో సరిసమానంగా ఉన్నాయి.

CSK vs GT IPL 2026 : పాయింట్ల పట్టికలో ఒకరు 5, ఇంకొకరు 7.. ఈ రోజు చెన్నై పంజా విసురుతుందా? గుజరాత్ షాక్ ఇస్తుందా?
Csk Vs Gt Ipl 2026
Rakesh
|

Updated on: Apr 26, 2026 | 12:43 PM

Share

CSK vs GT IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఈ ఆదివారం (ఏప్రిల్ 26) డబుల్ హెడర్ ధమాకాలో భాగంగా మొదటి పోరులో చెన్నై సూపర్ కింగ్స్ (CSK), గుజరాత్ టైటాన్స్ (GT) తలపడనున్నాయి. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం (చెపాక్) వేదికగా మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మెరుగుపరుచుకోవాలని ఇరు జట్లు కసితో ఉన్నాయి. రెండు జట్లు కూడా ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో తలో మూడు విజయాలతో సరిసమానంగా ఉన్నాయి.

హెడ్-టు-హెడ్ రికార్డులు

చెన్నై, గుజరాత్ జట్ల మధ్య రికార్డులను పరిశీలిస్తే పోరు చాలా రసవత్తరంగా ఉంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు ఐపీఎల్ చరిత్రలో 8 సార్లు ముఖాముఖి తలపడగా, ఇరు జట్లు తలో 4 విజయాలతో సమంగా ఉన్నాయి. అంటే ఏ జట్టు కూడా తక్కువ కాదు. అయితే, గత సీజన్ (2025)లో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఏకంగా 83 పరుగుల తేడాతో గుజరాత్‌ను మట్టికరిపించింది. ఆ ఆత్మవిశ్వాసంతోనే సీఎస్కే బరిలోకి దిగుతుండగా.. ప్రతీకారం తీర్చుకోవాలని గుజరాత్ భావిస్తోంది.

పాయింట్ల పట్టికలో పరిస్థితి

ప్రస్తుతం ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ 5వ స్థానంలో ఉంది. నెట్ రన్‌రేట్ మెరుగ్గా ఉండటం వల్ల చెన్నై పైన ఉండగా, గుజరాత్ టైటాన్స్ 7వ స్థానంలో నిలిచింది. ఇద్దరికీ 6 పాయింట్లే ఉన్నాయి. ఈరోజు గెలిచిన జట్టు నేరుగా టాప్-4 రేసులోకి వెళ్లే అవకాశం ఉంది. ఓడిపోయిన జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారే ప్రమాదం ఉంది.

ఎవరు గెలిచే అవకాశం ఉంది?

ఈ మ్యాచ్‌లో విజేతను ఊహించడం కష్టమే అయినా, కొందరు విశ్లేషకులు గుజరాత్ టైటాన్స్‌కు స్వల్పంగా విజయావకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. శుభ్‌మన్ గిల్ ఫామ్, జోస్ బట్లర్ రాకతో గుజరాత్ బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. అయితే, చెపాక్ స్టేడియం చెన్నైకి హోమ్ గ్రౌండ్ కావడం వారికి పెద్ద అడ్వాంటేజ్. స్పిన్నర్లకు అనుకూలించే ఈ పిచ్‌పై రషీద్ ఖాన్ (GT), జడేజా (CSK) మధ్య పోరు ఆసక్తికరంగా ఉండబోతోంది.

ఇరు జట్ల బలాబలాలు

చెన్నై జట్టులో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్, శివమ్ దూబే బ్యాటింగ్‌లో కీలకం కానున్నారు. ధోనీ ఫిట్‌నెస్‌పై సస్పెన్స్ ఉన్నప్పటికీ, అతను ఉంటే జట్టుకు కొండంత అండ. మరోవైపు గుజరాత్ జట్టులో సాయి సుదర్శన్, బట్లర్, రాహుల్ తేవాటియా ఫినిషర్లుగా సత్తా చాటగలరు. బౌలింగ్‌లో మహమ్మద్ సిరాజ్, రబాడా గుజరాత్‌కు ప్రధాన అస్త్రాలు.

ప్లేయింగ్ ఎలెవన్ (అంచనా)

చెన్నై సూపర్ కింగ్స్ (CSK):

రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సంజూ శాంసన్ (కీపర్), సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, డెవాల్డ్ బ్రెవిస్, జేమీ ఓవర్టన్, రవీంద్ర జడేజా, అకిల్ హొస్సేన్, నూర్ అహ్మద్, ముఖేష్ చౌదరి, అన్షుల్ కాంబోజ్.

గుజరాత్ టైటాన్స్ (GT):

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్ (కీపర్), సాయి సుదర్శన్, షారుఖ్ ఖాన్, రాహుల్ తేవాటియా, రషీద్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, కాగిసో రబాడా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, సాయి కిషోర్.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us