AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 : శ్రేయస్ అయ్యర్ క్యాచ్‌లు మిస్.. మేనేజ్మెంట్‌దే తప్పా?.. అశ్విన్ సెన్సేషనల్ కామెంట్స్

IPL 2026 : పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ 152 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు. ఢిల్లీ ఎండల్లో 20 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయడంతో అతను తీవ్రమైన డీహైడ్రేషన్, అలసటకు గురయ్యాడు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో కీపింగ్ చేయలేక బయట కూర్చున్నాడు.

IPL 2026 : శ్రేయస్ అయ్యర్ క్యాచ్‌లు మిస్.. మేనేజ్మెంట్‌దే తప్పా?.. అశ్విన్ సెన్సేషనల్ కామెంట్స్
Delhi Capitals
Rakesh
|

Updated on: Apr 26, 2026 | 12:13 PM

Share

IPL 2026 : ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఒక హై వోల్టేజ్ డ్రామాను తలపించింది. 264 పరుగుల భారీ స్కోరు చేసినా ఢిల్లీ ఓడిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఈ ఓటమికి ఫీల్డింగ్ తప్పిదాలే కారణమని విమర్శలు వస్తున్నాయి. టీమిండియా వెటరన్ స్పిన్నర్ ఆర్. అశ్విన్ మాత్రం దీనికి జట్టు మేనేజ్మెంట్‌నే బాధ్యులని కన్ఫాం చేశాడు. కరుణ్ నాయర్ క్యాచ్‌లు వదిలేయడానికి కేఎల్ రాహుల్ తీసుకున్న ఒక నిర్ణయం, మేనేజ్మెంట్ చేసిన ఒక చిన్న పొరపాటే కారణమని అశ్విన్ విశ్లేషించాడు.

ఏం జరిగిందంటే?

పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ 152 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు. ఢిల్లీ ఎండల్లో 20 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయడంతో అతను తీవ్రమైన డీహైడ్రేషన్, అలసటకు గురయ్యాడు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో కీపింగ్ చేయలేక బయట కూర్చున్నాడు. అతని స్థానంలో ఢిల్లీ జట్టులోని బెస్ట్ ఫీల్డర్ అయిన ట్రిస్టన్ స్టబ్స్‌కు కీపింగ్ బాధ్యతలు అప్పగించారు. ఇక్కడే ఢిల్లీ అసలైన పప్పులో కాలేసింది.

ఈ వ్యవహారంపై స్పందించిన అశ్విన్.. ఢిల్లీ మేనేజ్మెంట్ వ్యూహం సరిగ్గా లేదని అన్నాడు. “స్టబ్స్ ఢిల్లీ జట్టులో అత్యుత్తమ ఫీల్డర్. అతను సాధారణంగా లాంగ్ ఆన్, లాంగ్ ఆఫ్ పొజిషన్లలో ఉండి కష్టమైన క్యాచ్‌లను కూడా పట్టేస్తాడు. కానీ రాహుల్ లేకపోవడంతో అతన్ని కీపింగ్ పంపారు. అతని ప్లేస్‌లో సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా వచ్చిన కరుణ్ నాయర్ కీలక సమయంలో శ్రేయస్ అయ్యర్ ఇచ్చిన రెండు క్యాచ్‌లను వదిలేశాడు. అదే స్టబ్స్ ఫీల్డింగ్‌లో ఉంటే ఆ క్యాచ్‌లు మిస్ అయ్యేవి కావు” అని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.

సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ కష్టాలు

ఒక ఆటగాడు తాను తుది జట్టులో లేనని తెలిస్తే.. నెట్స్ లో లేదా జిమ్ లో గడుపుతాడని, కరుణ్ నాయర్ కూడా అలాగే చేసి ఉంటాడని అశ్విన్ అన్నాడు. అప్పటికప్పుడు మైదానంలోకి వచ్చి క్యాచ్‌లు పట్టడం అంత సులభం కాదని నాయర్‌కు మద్దతుగా నిలిచాడు. ఒక క్యాచ్ మిస్ అవ్వగానే నాయర్ కాన్ఫిడెన్స్ తగ్గిందని, నిజానికి నాయర్ మంచి ఫీల్డర్ అని అశ్విన్ గుర్తు చేశాడు. రాహుల్ స్థానంలో అభిషేక్ పోరెల్ వంటి వారిని సబ్‌స్టిట్యూట్‌గా ఎంచుకుని ఉంటే, స్టబ్స్ ఫీల్డింగ్‌లోనే ఉండేవాడని, అప్పుడు ఫలితం మరోలా ఉండేదని ఢిల్లీ మేనేజ్మెంట్‌కు చురకలు అంటించాడు.

శ్రేయస్ అయ్యర్ విధ్వంసం

కరుణ్ నాయర్ వదిలేసిన ఆ రెండు క్యాచ్‌లు ఢిల్లీకి శాపంగా మారాయి. తనకు లభించిన రెండు లైఫ్ లైన్లను శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా వాడుకున్నాడు. కేవలం 36 బంతుల్లోనే 71 పరుగులతో అజేయంగా నిలిచి, ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగుల ఛేజింగ్‌ను (265 లక్ష్యం) విజయవంతంగా పూర్తి చేశాడు. పంజాబ్ కింగ్స్ మరో 7 బంతులు మిగిలి ఉండగానే ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించి రికార్డు క్రియేట్ చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ చేసిన చిన్న పొరపాటు వారిని ఓటమి పాలు చేసింది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us