Video: సాధారణ ప్రయాణికుడిలా ధోని.. ఫ్యామిలీతో కలిసి ఫ్లైట్ ఎక్కుతూ ఏం చేశాడంటే.. వైరల్ వీడియో

CSK Player MS Dhoni: ఎంఎస్ ధోని ప్రస్తుతం వార్తల్లో నిలిచాడు. ఓవైపు ఐపీఎల్ ఆడడంపై.. మరోవైపు వైరల్ వీడియోలతో నిరంతరం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాడు. తాజాగా మరో వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోలో ధోని తన స్టైల్‌తోనే కాదు.. ఫ్యాన్స్‌తో ప్రవర్తించిన తీరు కూడా నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

Video: సాధారణ ప్రయాణికుడిలా ధోని.. ఫ్యామిలీతో కలిసి ఫ్లైట్ ఎక్కుతూ ఏం చేశాడంటే.. వైరల్ వీడియో
Ms Dhoni Video
Follow us
Venkata Chari

|

Updated on: Oct 18, 2024 | 10:56 AM

CSK Player MS Dhoni: భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఇటీవల భార్య సాక్షి, కూతురు జీవాతో కలిసి ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణం చేసిన వీడియో ఒకటి వైరలవుతోంది. ఈ ముగ్గురూ విమానం ఎక్కుతున్న వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. అయితే, ఈ వైరల్ వీడియోలో ధోని తన లుక్‌తోనే కాదు.. ఫ్యాన్స్‌తో ప్రవర్తించిన తీరు కూడా ఆకట్టుకుంటోంది.

ధోనీ ప్రయాణ వివరాలపై పూర్తి సమాచారం తెలియలేదు. 43 ఏళ్ల టీమిండియా మాజీ కెప్టెన్ మధ్యలో ఉండగా.. ఆయన కూతురు జీవా ముందు నడుస్తుంది. ధోని భార్య సాక్షి వెనకాల నడుస్తున్నట్లు వీడియో చూడొచ్చు. ఫ్లైట్ ఎక్కేందుకు మెట్ల మీద నడుస్తూ కనిపించారు. ధోని తన పొడవాటి జుట్టుతో కనిపించాడు. బ్రౌన్ టీ-షర్ట్, బ్లాక్ ప్యాంట్ ధరించాడు.

ధోనీ విమానంలోకి ప్రవేశించగానే అతనిని చూసి సిబ్బంది, తోటి ప్రయాణికులు సంతోషించారు. ముందు సీటులో ఉన్న ప్రయాణికులతో ధోని కరచాలనం చేస్తూ ముందుకు సాగాడు. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మాజీ కెప్టెన్ అందరిని పలకరిస్తూ, వారికి కరచాలనం చేస్తూ నవ్వుతూ ముందుకుసాగాడు.

సచిన్ పాండ్యా అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ధోని ఫ్లైట్ ఎక్కుతున్న వీడియోను పంచుకున్నాడు. ఈ కథనాన్ని ప్రచురించే సమయానికి వీడియో 3 లక్షలకు పైగా వ్యూస్‌ను పొందింది.

వీడియో ఇక్కడ చూడొచ్చు..

View this post on Instagram

A post shared by Sachin Pandya (@sac_pandya)

తోటి ప్రయాణీకులను ఎంతో ఆప్యాయంగా పలకరించిన ధోనిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈమేరకు ఓ యూజర్ ‘విమానంలో ప్రయాణికులు ఎంతో అదృష్టవంతులు’ అంటూ కామెంట్ చేశాడు. అలాగే, మరో యూజర్ ‘ తలాను చూడగానే ప్రయాణికులకు గూస్‌బంప్‌లు వచ్చి ఉంటాయి’ అంటూ మరొక వినియోగదారు అన్నాడు. అలాగే, మరో యూజర్ కామెంట్ చేస్తూ.. ధోని ఎంతో సాధారణ మనిషి. భద్రత ఏమాత్రం అవసరం లేదు’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఎంఎస్ ధోని ఐపీఎల్ 2025 ఆడేనా?

ఐపీఎల్ గత నాలుగు సీజన్లుగా ధోని భవిష్యత్తుపై చర్చలు నడుస్తూనే ఉన్నాయి. సీజన్ ముగిసే సమయానికి వచ్చే ఏడాది ధోని చివరి సీజన్‌ అంటూ ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఇలానే జరుగుతోంది. ఇప్పుడు కూడా ఇదే నడుస్తోంది.

IPL 2025 వేలం మెగా వేలానికి రంగం సిద్ధం కావడంతో.. ఐదుసార్లు IPL ఛాంపియన్‌ ధోనిని చెన్నై రిటైన్ చేస్తుందని తెలుస్తోంది. ఎందుకంటే ధోని కోసమే బీసీసీఐ కొన్ని రూల్స్‌ని మార్చింది. అయితే, అన్‌క్యాప్డ్ ప్లేయర్ రూల్‌లో ధోనిని కొనసాగించేందుకు చెన్నై టీం సిద్ధమైంది. అంటే, గత ఐదేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్ ఆడని లేదా BCCI సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో భాగం కాని ఆటగాడు అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా పరిగణిస్తుంటారు.

ధోని 2019 ప్రపంచ కప్ సందర్భంగా జులై 2019లో భారత జెర్సీలో చివరిసారిగా కనిపించాడు. ధోని అన్ని అంతర్జాతీయ క్రికెట్ ఫార్మాట్‌ల నుంచి ఆగస్టు 2020లో రిటైర్ అయ్యాడు. గత నాలుగేళ్లలో ఐపీఎల్‌కే పరిమితమయ్యాడు.

అన్ని ఫ్రాంచైజీలు తమ రిటైన్ జాబితాను సమర్పించడానికి చివరి తేదీ అక్టోబర్ 31గా బీసీసీఐ నిర్ణయించింది. దీంతో CSK మేనేజ్‌మెంట్ ఆటగాళ్లను నిలుపుకోవడంపై ఫోకస్ పెంచారు. ఎవరిని రిటైన్ చేస్తారో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..