IND vs NZ: రిషబ్ పంత్ స్థానంలో ధృవ్ జురెల్ బ్యాటింగ్.. ఆ ఐసీసీ రూల్ ఏం చెబుతోందంటే?

IND vs NZ: బెంగళూరు టెస్ట్ మ్యాచ్‌లో రిషబ్ పంత్ గాయపడిన సంగతి తెలిసిందే. అతని స్థానంలో వికెట్ కీపర్‌గా బరిలోకి దిగిన ధృవ్ జురెల్.. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తాడా లేదా అనేది విషయంపై ఐసీసీ రూల్స్ తెరపైకి వచ్చాయి. ప్రస్తుతం పంత్ గాయం నుంచి కోలుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఒకవేళ గాయం తీవ్రమైతే, మైదానంలోకి రావడం కష్టమేనని తెలుస్తోంది.

IND vs NZ: రిషబ్ పంత్ స్థానంలో ధృవ్ జురెల్ బ్యాటింగ్.. ఆ ఐసీసీ రూల్ ఏం చెబుతోందంటే?
Pant Jurel Ind Vs Nz 1st Te
Follow us

|

Updated on: Oct 18, 2024 | 11:53 AM

IND vs NZ, Rishabh Pant: బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరగనున్న తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా డబుల్ కష్టాల్లో కూరుకపోయింది. తొలుత టీమిండియా రెండో రోజు 46 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత, రిషబ్ పంత్ మోకాలి గాయంతో మైదానాన్ని వీడాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో రెండో ఇన్నింగ్స్‌ సమయంలో రిషబ్ పంత్ బ్యాటింగ్ చేయడం కీలకం. కానీ, మూడో రోజు మైదానంలోకి రావడంతో టీమిండియాకు టెన్షన్ పెరిగింది. ధృవ్ జురెల్ అతని స్థానంలో వికెట్ కీపింగ్ చేస్తున్నాడు. పంత్ ప్లేస్‌లో వచ్చిన జురెల్.. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తాడా? లేదా అనే విషయంపై ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

పంత్ స్థానంలో ధృవ్ జురెల్ బ్యాటింగ్ చేయగలడా?

2018 సంవత్సరంలో, టెస్ట్ క్రికెట్ నియమాలలో కీలక మార్పు చేశారు. దీని కారణంగా, టెస్టు మ్యాచ్‌లో వికెట్ కీపర్ గాయపడితే.. అతని గాయాన్ని పరిగణనలోకి తీసుకుని, అంపైర్ సబ్‌స్టిట్యూట్ ఆటగాడిని మైదానంలోకి రావడానికి అనుమతిస్తాడు. ఈ నిబంధన కారణంగా పంత్ స్థానంలో ధృవ్ జురెల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. కానీ, ప్రత్యామ్నాయ ఆటగాడు కెప్టెన్, బౌలర్ పాత్రను పోషించలేడు. అతను వికెట్ కీపర్‌గా మాత్రమే కనిపించాల్సి ఉంటుంది. దీని కారణంగా, భారత రెండో ఇన్నింగ్స్ వరకు పంత్ ఫిట్‌గా లేకుంటే, అతని స్థానంలో ధృవ్ జురెల్ బ్యాటింగ్ చేయలేడని తెలుస్తోంది.

రిషబ్ పంత్ గాయం కారణంగా టెన్షన్..

రిషబ్ పంత్ గురించి మాట్లాడితే, న్యూజిలాండ్ జట్టు బ్యాటింగ్ సమయంలో ఇన్నింగ్స్ 37వ ఓవర్‌లో రవీంద్ర జడేజా వేసిన బంతి నేరుగా పంత్ మోకాలికి తాకింది. ఆ తర్వాత పంత్ కాస్త అసౌకర్యంగా కనిపించడంతో మైదానం నుంచి బయటకు వెళ్లిపోయాడు. అప్పటి నుంచి మూడో రోజు కూడా ధృవ్ జురెల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. పంత్ అదే మోకాలికి ఆపరేషన్ జరిగిన సంగతి తెలిసిందే. 2022 చివరిలో జరిగిన కారు ప్రమాదం తర్వాత అతను శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఈ సర్జరీ కారణంగా, పంత్ ఒక సంవత్సరం తర్వాత ప్రొఫెషనల్ క్రికెట్‌కు తిరిగి వచ్చాడు. అయితే ఇప్పుడు అతని గాయం కారణంగా టీమిండియా టెన్షన్ పెరిగింది. ఎందుకంటే న్యూజిలాండ్‌తో మూడు టెస్టు మ్యాచ్‌ల తర్వాత, ఐదు టెస్టుల సిరీస్ కోసం భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాల్సి ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..