34 బంతుల్లో మెరుపు సెంచరీ..! ఒకే ఓవర్‌లో 6 సిక్స్‌లు..? అసాధ్యుడు ఈ ఆస్ట్రేలియా క్రికెటర్..!
David Hooks Birthday : 21 సంవత్సరాల వయసులో ఆస్ట్రేలియా క్రికెట్‌లో అడుగుపెట్టిన డేవిడ్ హుక్స్ తన క్రికెట్ చరిత్రలో ఎన్నో
David Hooks Birthday : 21 సంవత్సరాల వయసులో ఆస్ట్రేలియా క్రికెట్‌లో అడుగుపెట్టిన డేవిడ్ హుక్స్ తన క్రికెట్ చరిత్రలో ఎన్నో రికార్డులను నెలకొల్పాడు. ప్రపంచ మేటి బ్యాట్స్‌మెన్‌లకు సాధ్యం కానీ ఫీట్స్ సాధించి కనుమరుగయ్యాడు. మే 3, 1955 న జన్మించిన డేవిడ్ హుక్స్ బర్త్‌డే సందర్భంగా స్పెషల్ స్టోరీ.. ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడే ముందు క్లబ్ మ్యాచ్‌లో డాల్విచ్ తరఫున డేవిడ్ హుక్స్ ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టాడు. 21 ఏళ్ల హుక్ దక్షిణ ఆస్ట్రేలియా తరఫున ఆడుతున్నప్పుడు ఆరు ఇన్నింగ్స్‌లలో ఐదు సెంచరీలు చేశాడు. ఇంతలో అడిలైడ్‌లో ఆడిన మ్యాచ్‌లో విక్టోరియాపై కేవలం 34 బంతుల్లో సెంచరీ కొట్టాడు.
ఈ మెరుపు సెంచరీలో 18 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. అతను మార్చి 12,1977 న తన టెస్ట్ అరంగేట్రం చేశాడు. టోనీ గ్రిగ్ ఓవర్లో వరుసగా ఐదు ఫోర్లు కొట్టాడు. డేవిడ్ తన కెరీర్‌లో 178 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. 43.99 సగటుతో 12,671 పరుగులు చేశాడు. మొదటి విభాగంలో 32 సెంచరీలు, 65 అర్ధ సెంచరీలు చేశాడు. అతని అత్యధిక స్కోరు 306 నాటౌట్. లిస్ట్ ఏ మ్యాచ్‌లలో 27.58 సగటుతో 2041 పరుగులు చేశాడు. లిస్ట్ ఎ క్రికెట్‌లో డేవిడ్ 1 సెంచరీ, 11 అర్ధ సెంచరీలు చేశాడు.
డేవిడ్ హుక్స్ ఆస్ట్రేలియా తరఫున 23 టెస్టులు ఆడాడు. 41 ఇన్నింగ్స్‌లలో 3 సార్లు అజేయంగా నిలిచి 1306 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను ఒక సెంచరీ, 8 అర్ధ సెంచరీలు సాధించాడు. 39 వన్డేలు కూడా ఆడాడు. ఇందులో 826 పరుగులు చేశాడు. అతని ఉత్తమ స్కోరు 76. డేవిడ్ హుక్స్ జీవితంలో విషాదకర ముగింపు పలికాడు. 2004, జనవరిలో మెల్‌బోర్న్‌లోని ఒక హోటల్ వెలుపల జరిగిన ఘర్షణలో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో 49 ఏళ్ల హుక్ తుది శ్వాస విడిచాడు.