Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cricket in Olympics: ఒలింపిక్స్‌ 2028లో క్రికెట్ ఎంట్రీ.. ముంబైలో తేల్చనున్న ఐఓసీ..

Cricket in Olympics: లాస్ ఏంజిల్స్‌లో జరగనున్న సమ్మర్ ఒలింపిక్స్‌ 2028లో క్రికెట్ ఆటను చేర్చనున్నారా? అయితే, అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.

Cricket in Olympics: ఒలింపిక్స్‌ 2028లో క్రికెట్ ఎంట్రీ.. ముంబైలో తేల్చనున్న ఐఓసీ..
Cricket
Follow us
Venkata Chari

|

Updated on: Jun 10, 2023 | 6:28 PM

Cricket in Olympics: లాస్ ఏంజిల్స్‌లో జరగనున్న సమ్మర్ ఒలింపిక్స్‌ 2028లో క్రికెట్ ఆటను చేర్చనున్నారా? అయితే, అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అక్టోబరు 15 నుంచి 17 వరకు ముంబైలో జరగనున్న అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) 141వ సెషన్‌లో పూర్తి సమాధానం రానుంది. ఈ సమావేశం ప్రారంభ వేడుక అక్టోబర్ 14న Jio వరల్డ్ సెంటర్ (JWC)లో జరగనుంది.

IOC అధికారిక వెబ్‌సైట్‌లోని ప్రకటన ప్రకారం.. ఈ సెషన్‌కు ముందు, IOC ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశం అక్టోబర్ 12 నుంచి 14 వరకు జరగనుంది. IOC సమావేశానికి సంబంధించి టైమ్స్ ఇండియా ప్రకటనలో, 2028 వేసవి ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చనున్నట్లు తెలుస్తోంది. ముంబై సెషన్‌లో గ్రాండ్‌గా ప్రకటించనున్నారని అంటున్నారు. ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారంట. అయితే అధికారికంగా ఈ సెషన్‌లో ప్రకటించనున్నారు.

6-జట్ల ఈవెంట్‌కు ప్రతిపాదనలు..

ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చడంపై ఎన్నో ఏళ్లుగా చర్చలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో 6 జట్లతో కూడిన ఈవెంట్‌ను ICC ప్రతిపాదించిందంట. ఇందులో మహిళల, పురుషుల జట్లు ఉంటాయి. T20 ఫార్మాట్‌లో ఈ ఈవెంట్ నిర్వహించేందుకు ప్రతిపాదనలున్నాయి. ఈ మ్యాచ్‌లు పూర్తి కావడానికి దాదాపు 3 గంటల సమయం పడుతుంది.

ఇవి కూడా చదవండి

కాగా, 1900 ప్యారిస్ గేమ్స్‌లో క్రికెట్‌ను చేర్చారు. ఆ తర్వాత తొలగించారు. 128 ఏళ్లు గడిచినా ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను మరలా చేర్చలేదు. క్రికెట్‌కు పెరుగుతోన్న ఆదరణ దృష్ట్యా, IOC కీలక నిర్ణయం తీసుకోవాలని సర్వత్రా వినిపిస్తోంది. క్రికెట్ కూడా కలుపుకుంటే మీడియా హక్కుల ద్వారా వచ్చే ఆదాయం కూడా మూడింతలు పెరగనుందని చెబుతున్నారు. క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో చేర్చాలన్న ఐసీసీ చర్యకు బీసీసీఐతోపాటు పలు దేశాల మద్దతు లభిస్తోంది. అయితే, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కార్యదర్శి జే షా ICC ఒలింపిక్ వర్కింగ్ గ్రూప్‌లో సభ్యుడిగా ఉన్న సంగతి తెలిసిందే.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..