- Telugu News Photo Gallery Cricket photos Wtc Final 2023 aus vs ind Team India all rounder Ravindra Jadeja created history most wickets in test cricket as left arm spinner and breaks bishn singh bedis record
WTC 2023 Final: లెజెండరీ రికార్డ్‌ను బ్రేక్ చేసిన జడ్డూ.. డబ్ల్యూటీసీ ఫైనల్లో సరికొత్త చరిత్ర సృష్టించిన నం1 ఆల్ రౌండర్..
Ravindra Jadeja: ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్లో ఆస్ట్రేలియాపై భారత నంబర్ వన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించాడు. తొలి ఇన్నింగ్స్‌లో జడేజా 2 వికెట్లు పడగొట్టాడు.
Updated on: Jun 10, 2023 | 5:28 PM

Ravindra Jadeja: ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్లో ఆస్ట్రేలియాపై భారత నంబర్ వన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించాడు. తొలి ఇన్నింగ్స్‌లో జడేజా 2 వికెట్లు పడగొట్టాడు. దీంతో భారత దిగ్గజ ఆటగాడు బిషన్ సింగ్ బేడీ రికార్డును బద్దలు కొట్టాడు.

బౌలింగ్‌లోనే కాదు బ్యాటింగ్‌లోనూ జడేజా ఆకట్టుకున్నాడు. 51 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్ తో 48 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు.అంతకుముందు బౌలింగ్ లోనూ కీలక వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. మూడో రోజు స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్ లాంటి ప్రమాదకరమైన బ్యాటర్లను పెవిలియన్ బాట పట్టించాడు.

ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో జడేజా రెండు వికెట్లు తీసి సరికొత్త రికార్డు సృష్టించాడు. టీమిండియా తరపున అత్యధిక వికెట్లు తీసిన ఏకైక ఎడమచేతి వాటం స్పిన్నర్‌గా జడేజా నిలిచాడు. ఇంతకు ముందు ఈ రికార్డ్ బిషన్ సింగ్ బేడీ పేరు మీద ఉంది. ప్రస్తుతం జడేజా 65 టెస్టుల్లో 267 వికెట్లు తీసి ఈ రికార్డును బ్రేక్ చేశాడు.

జడేజా ఓవరాల్‌గా 4వ స్థానంలో నిలిచాడు. రంగనా హెరాత్ (433 వికెట్లు) అగ్రస్థానంలో ఉండగా, న్యూజిలాండ్‌కు చెందిన డేనియల్ వెటోరి (362) రెండు, ఇంగ్లండ్‌కు చెందిన డెరెక్ అండర్‌వుడ్ (297) మూడో స్థానంలో ఉన్నారు.

అంతేకాకుండా ఆస్ట్రేలియా డేంజరస్ ప్లేయర్ స్టీవ్ స్మిత్‌ను జడ్డూ 8 సార్లు అవుట్ చేసి రవిచంద్రన్ అశ్విన్ రికార్డును సమం చేశాడు.





























