ఎవరు మమ్మీ వీళ్లు.. ఒక్క ఫోర్, సిక్స్ లేకుండా భారీ ఇన్నింగ్స్.. క్రికెట్ హిస్టరీలో 5సార్లు ఇలా..
ODI Records: నేటి ఆధునిక క్రికెట్‌లో వీరికి దగ్గరగా రావడం కూడా సులభం కాదు. వన్డే ఇంటర్నేషనల్‌లో బౌండరీలు, సిక్సర్లు కొట్టకుండా సెంచరీలు సాధించిన ఆటగాళ్ల గురించి తెలిస్తే కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ చారిత్రక రికార్డులు ఎవరి పేరుతో ఉన్నాయో ఓసారి చూద్దాం..

ODI Records: వన్డే క్రికెట్‌లో బ్యాటర్స్ వేగంగా పరుగులు సాధించాలని కోరుకుంటుంటారు. ఈ క్రమంలో అనేక చారిత్రక రికార్డులు కూడా వారి పేరుతో నమోదవుతుంటాయి. అయితే, ఎన్నో ప్రత్యేకమైన రికార్డులు సృష్టించిన క్రికెటర్లు చాలా మంది ఉన్నారు. వీటిని బద్దలు కొట్టడం ఇప్పటికీ కష్టమే. నేటి ఆధునిక క్రికెట్‌లో వీరికి దగ్గరగా రావడం కూడా సులభం కాదు. వన్డే ఇంటర్నేషనల్‌లో బౌండరీలు, సిక్సర్లు కొట్టకుండా సెంచరీలు సాధించిన ఆటగాళ్ల గురించి తెలిస్తే కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ చారిత్రక రికార్డులు ఎవరి పేరుతో ఉన్నాయో ఓసారి చూద్దాం..
1. ఆడమ్ పరోర్: కివీస్ ఆటగాడు ఆడమ్ పరోర్ పేరు జాబితాలో నంబర్ 1 స్థానంలో ఉంది. అతను 1994 సంవత్సరంలో ఒక్క ఫోర్ లేదా సిక్స్ కూడా కొట్టకుండా ఈ చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడాడు. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను ఈ చారిత్రాత్మక ఫీట్ చేశాడు. పరోర్ 138 బంతుల్లో 96 పరుగులు చేశాడు.
2. జహీర్ అబ్బాస్: ఈ జాబితాలో పాకిస్తాన్ ఆటగాడు జహీర్ అబ్బాస్ పేరు రెండవ స్థానంలో ఉంది. అబ్బాస్ వన్డే ఇంటర్నేషనల్‌లో బౌండరీ కొట్టకుండా రెండవ అతిపెద్ద ఇన్నింగ్స్ ఆడాడు. అతను 1982 సంవత్సరంలో కంగారూ జట్టుపై ఈ ఘనత సాధించాడు.
3. కిమ్ బార్నెట్: ఇంగ్లాండ్‌కు చెందిన కిమ్ బార్నెట్ వన్డే క్రికెట్‌లో అతిపెద్ద ఇన్నింగ్స్ ఆడాడు. ఇందులో ఒక్క ఫోర్ లేదా సిక్స్ లేదు. దీంతో ఈ లిస్ట్‌లో అతను మూడవ స్థానంలో ఉన్నాడు. 1998లో శ్రీలంకపై 146 బంతుల్లో 84 పరుగులు చేశాడు.
4. డెస్మండ్ హేన్స్: నాల్గవ నంబర్‌లో వెస్టిండీస్ ఆటగాడు డెస్మండ్ హేన్స్ ఉన్నాడు. 1985లో, అతను ఆస్ట్రేలియాపై 133 బంతుల్లో 76 పరుగులు చేశాడు. ఇది ఫోర్లు లేదా సిక్సర్లు కొట్టకుండా నాల్గవ అత్యధిక ఇన్నింగ్స్‌గా నిలిచింది.
5. జేపీ డుమినీ: ఈ జాబితాలో ఐదవ, చివరి స్థానంలో దక్షిణాఫ్రికా విధ్వంసక బ్యాట్స్‌మన్ జేపీ డుమిని ఉన్నాడు. అతను 93 బంతుల్లో 71 పరుగులతో నిలిచాడు. 2009లో ఆస్ట్రేలియాపై ఒక్క ఫోర్ లేదా సిక్సర్ కూడా కొట్టకుండానే అతను ఈ ఘనతను సాధించాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








