AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WPL 2026 Auction : ముగిసిన మహిళల ప్రీమియర్ లీగ్ మెగా ఆక్షన్..రూ.40.8 కోట్లు ఖర్చు..ఏ జట్టులో ఎవరున్నారంటే?

మహిళల క్రికెట్ అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూసిన విమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 మెగా ఆక్షన్ దిగ్విజయంగా పూర్తయింది. ఈ వేలంలో ఆటగాళ్లను దక్కించుకోవడానికి ఫ్రాంచైజీలు కోట్ల రూపాయలను కుమ్మరించాయి. మొత్తం 276 మంది ఆటగాళ్లు వేలంలో పాల్గొనగా, కేవలం 67 మంది క్రీడాకారుల అదృష్టం మాత్రమే తలుపు తట్టింది.

WPL 2026 Auction  : ముగిసిన మహిళల ప్రీమియర్ లీగ్ మెగా ఆక్షన్..రూ.40.8 కోట్లు ఖర్చు..ఏ జట్టులో ఎవరున్నారంటే?
Ipl 2026
Rakesh
|

Updated on: Nov 28, 2025 | 10:28 AM

Share

WPL 2026 Auction : మహిళల క్రికెట్ అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూసిన విమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 మెగా ఆక్షన్ దిగ్విజయంగా పూర్తయింది. ఈ వేలంలో ఆటగాళ్లను దక్కించుకోవడానికి ఫ్రాంచైజీలు కోట్ల రూపాయలను కుమ్మరించాయి. మొత్తం 276 మంది ఆటగాళ్లు వేలంలో పాల్గొనగా, కేవలం 67 మంది క్రీడాకారుల అదృష్టం మాత్రమే తలుపు తట్టింది. ఐదు జట్లు కలిసి ఏకంగా రూ.40.8 కోట్లు ఖర్చు చేశాయి. ఇందులో భారతీయ క్రికెటర్లపై రూ.21.65 కోట్లు వెచ్చించారు. ఈ వేలంలో అత్యంత ఖరీదైన క్రీడాకారిణిగా నిలిచిన దీప్తి శర్మను యూపీ వారియర్స్ ఏకంగా రూ.3.2 కోట్లకు కొనుగోలు చేసింది. వేలం తర్వాత ఐదు జట్ల తుది స్క్వాడ్‌లు ఎలా ఉన్నాయో చూద్దాం.

వేలంలో ఖర్చు, అత్యధికంగా కొన్న టీమ్స్

విమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 మెగా ఆక్షన్ క్రికెట్ ప్రపంచంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఈ వేలంలో 276 మంది ఆటగాళ్లు నమోదు చేసుకోగా, ఫ్రాంచైజీలు కేవలం 67 మందిని మాత్రమే కొనుగోలు చేశాయి. ఇందులో 23 మంది విదేశీ క్రీడాకారులు కూడా ఉన్నారు. ఐదు ఫ్రాంచైజీలు కలిసి మొత్తం రూ.40.8 కోట్ల భారీ మొత్తాన్ని ఖర్చు చేశాయి. ఇందులో మెజారిటీ వాటా రూ.21.65 కోట్లు భారతీయ క్రికెటర్లకే దక్కింది.

ఈ ఆక్షన్‌లో దీప్తి శర్మ అత్యధిక ధర పలికిన క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. ఆమెను యూపీ వారియర్స్ జట్టు రూ. 3.2 కోట్లకు కొనుగోలు చేసింది. యూపీ వారియర్స్ అత్యధికంగా 17 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసి, ఈ వేలంలో అత్యంత బిజీ టీమ్‌గా నిలిచింది. గుజరాత్ జెయింట్స్ 16 మంది ఆటగాళ్లను తమ జట్టులో చేర్చుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) 12 మందిని కొనుగోలు చేసింది. ముంబై ఇండియన్స్ (MI), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) చెరో 11 మంది ఆటగాళ్లను తీసుకున్నాయి.

ఆక్షన్ తర్వాత అన్ని జట్ల తుది స్క్వాడ్‌లు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB): స్మృతి మంధాన, రిచా ఘోష్, ఎలిస్ పెర్రీ, లారెన్ బెల్, పూజా వస్త్రకార్, అరుంధతి రెడ్డి, రాధా యాదవ్, నాదిన్ డి క్లర్క్, శ్రేయాంక పాటిల్, జార్జియా వోల్, లిన్సే స్మిత్, ప్రేమ రావత్, గౌతమి నాయక్, ప్రత్యాషా కుమార్, దయాలన్ హేమలత.

ముంబై ఇండియన్స్ (MI): నాట్ స్కివర్-బ్రంట్, అమేలియా కెర్, హర్మన్‌ప్రీత్ కౌర్, హేలీ మాథ్యూస్, అమన్‌జోత్ కౌర్, సజీవన్ సజ్న, షబ్నిమ్ ఇస్మాయిల్, గుణాలన్ కులకర్ణి, నికోలా కారీ, సంస్కృతి గుప్తా, రాహిల్ ఫిర్దౌస్, పూనమ్ ఖేమ్నార్, త్రివేణి వశిష్ఠ, నల్లా రెడ్డి, సైకా ఇషాక్, మిల్లీ ఇల్లింగ్‌వర్త్.

ఢిల్లీ క్యాపిటల్స్ (DC): షెఫాలీ వర్మ, అన్నబెల్ సదర్లాండ్, జెమిమా రోడ్రిగ్స్, మారిజానే కాప్, శ్రీ చరణి, షినెల్ హెన్రీ, లారా వూల్వార్ట్, నిక్కీ ప్రసాద్, స్నేహ్ రాణా, తానియా భాటియా, లిజెల్ లీ, దియా యాదవ్, మమత మదివాల, నందిని శర్మ, లూసీ హామిల్టన్, మిన్ను మణి.

గుజరాత్ జెయింట్స్ (GG): ఆష్లే గార్డ్‌నర్, బెత్ మూనీ, సోఫీ డివైన్, జార్జియా వేర్‌హామ్, భారతి ఫుల్మాలి, కాశ్వి గౌతమ్, రేణుకా సింగ్, యస్తికా భాటియా, అనుష్క శర్మ, తనుజా కన్వర్, కనికా అహుజా, టిటాస్ సాధు, హ్యాపీ కుమారి, కిమ్ గార్త్, శివాని సింగ్, డేనియల్ వ్యాట్-హాడ్జ్, రాజేశ్వరి గైక్వాడ్, ఆయుషి సోని.

యూపీ వారియర్స్ (UPW): దీప్తి శర్మ, శిఖా పాండే, మెగ్ లానింగ్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, ఆశా శోభన, సోఫీ ఎక్లెస్టన్, డీండ్రా డాటిన్, కిరణ్ నవగిరే, క్రాంతి గౌడ్, శ్వేత సెహ్రావత్, హర్లీన్ డియోల్, క్లో ట్రయోన్, సుమన్ మీనా, సిమ్రన్ షేక్, జి త్రిష, ప్రతీక్ రావల్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పుట్టింది పడుకోడానికి కాదు బే.. అంటూ ప్రభాస్ ఇన్ స్టా రీల్
పుట్టింది పడుకోడానికి కాదు బే.. అంటూ ప్రభాస్ ఇన్ స్టా రీల్
మీకు ఆధార్‌ కార్డు ఉందా..?ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.50 వేల రుణం
మీకు ఆధార్‌ కార్డు ఉందా..?ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.50 వేల రుణం
నిమ్మకాయ తొక్కను పారేస్తున్నారా...? ఇది తెలిస్తే అస్సలు అలా చేయరు
నిమ్మకాయ తొక్కను పారేస్తున్నారా...? ఇది తెలిస్తే అస్సలు అలా చేయరు
రోడ్డు ప్రమాదంలో యువ బైక్ రేసర్ దుర్మరణం..!
రోడ్డు ప్రమాదంలో యువ బైక్ రేసర్ దుర్మరణం..!
పిచ్చి మొక్క అనుకుంటే పొరపాటే.. 350కి కిడ్నీల సమస్యలకు సంజీవని..!
పిచ్చి మొక్క అనుకుంటే పొరపాటే.. 350కి కిడ్నీల సమస్యలకు సంజీవని..!
చాణక్య నీతి: ఇలాంటి వ్యక్తులతో జాగ్రత్త.. వాళ్ళు మీకు వెన్నుపోటు
చాణక్య నీతి: ఇలాంటి వ్యక్తులతో జాగ్రత్త.. వాళ్ళు మీకు వెన్నుపోటు
పల్సర్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. మే నాటికి 8 సరికొత్త బైక్‌లు!
పల్సర్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. మే నాటికి 8 సరికొత్త బైక్‌లు!
IND vs PAK Live Score: భారత్, పాక్ హై వోల్టేజ్ పోరుకు రంగం సిద్ధం
IND vs PAK Live Score: భారత్, పాక్ హై వోల్టేజ్ పోరుకు రంగం సిద్ధం
మిమ్మల్ని కోటీశ్వరులను చేసే 115 ఏళ్ల నాటి రహస్యం.. డబ్బు మీ వెంట
మిమ్మల్ని కోటీశ్వరులను చేసే 115 ఏళ్ల నాటి రహస్యం.. డబ్బు మీ వెంట
ధురంధర్‏లో విలన్ ఛాన్స్ పై నాగార్జున కామెంట్స్..
ధురంధర్‏లో విలన్ ఛాన్స్ పై నాగార్జున కామెంట్స్..