Champions Trophy 2025, PAK vs BAN: రావల్పిండి మైదానంలో జరగాల్సిన పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు చేశారు. దీని కారణంగా బంగ్లాదేశ్ జట్టు ఇప్పుడు ఎటువంటి విజయం లేకుండా స్వదేశానికి తిరిగి వెళ్ళవలసి ఉంటుంది. అదే సమయంలో, పాకిస్తాన్ జట్టు కూడా గెలవకుండానే స్వదేశంలో జరుగుతోన్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నుంచి తప్పుకుంది. అయితే, ఈ మ్యాచ్ రద్దు కావడంతో ఇరుజట్లు తమ ఖాతాలు తెరిచాయి. ఈ టోర్నమెంట్‌లో ఈ రెండు జట్ల పాయింట్ల ఖాతా తెరిచాయి. కానీ ఇది ప్రస్తుత పాకిస్తాన్ జట్టుకు చాలా నిరాశపరిచే టోర్నమెంట్. ఆతిథ్య జట్టుగా పాక్ జట్టు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది.
పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలే..
రావల్పిండి మైదానంలో ఇప్పటివరకు రెండవ మ్యాచ్ రద్దయింది. అంతకుముందు, రావల్పిండిలో జరగాల్సిన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మ్యాచ్ రద్దు చేశారు. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఇప్పటికే నిష్క్రమించిన పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు తమ మొదటి విజయాన్ని నమోదు చేయాలని కోరుకున్నాయి. కానీ, వర్షం ఇరుజట్ల పోరాటాన్ని చెడగొట్టింది. ఈ మ్యాచ్ రద్దు కావడంతో, పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య చెరో పాయింట్ పంచుకున్నాయి. ఇప్పుడు టోర్నమెంట్‌లో రెండు జట్ల ప్రయాణం గెలవకుండానే ముగిసింది.
పాకిస్తాన్ ఎప్పుడు రంగంలోకి దిగుతుంది?
పాకిస్తాన్ జట్టు గురించి చెప్పాలంటే, న్యూజిలాండ్ జట్టు మొదటి మ్యాచ్‌లో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. ఆ తర్వాత పాక్ జట్టు రెండవ మ్యాచ్‌లో భారత జట్టు చేతిలో ఓడిపోయింది. మరోవైపు, భారత్ చేతిలో ఓడిపోయిన తర్వాత, బంగ్లాదేశ్ న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన వెంటనే, ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ-ఫైనల్స్ నుంచి నిష్క్రమించగా, పాకిస్తాన్ జట్టు కూడా దానితో పాటు నిష్క్రమించింది. ఇప్పుడు పాకిస్తాన్ జట్టు మార్చి నెలలో జరగనున్న న్యూజిలాండ్ పర్యటనలో పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్ ఆడనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..