AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Champions Trophy 2025: సెమీఫైనల్స్‌కు ముందు ఆసీస్‌కు భారీ ఎదురు దెబ్బ! గాయంతో స్టార్ ప్లేయర్ ఔట్!

ప్రతిష్ఠాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారతదేశం, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు కీలకమైన సెమీ ఫైనల్ రౌండ్ కు చేరుకున్నాయి. అయితే, ఈ మ్యాచ్ ల కు ముందే ఆస్ట్రేలియా జట్టుకు బిగ్ షాక్ తగిలింది. గాయంతో స్టార్ ప్లేయర్ నాకౌట్ మ్యాచ్ కు దూరమయ్యాడు.

Champions Trophy 2025: సెమీఫైనల్స్‌కు ముందు ఆసీస్‌కు భారీ ఎదురు దెబ్బ! గాయంతో స్టార్ ప్లేయర్ ఔట్!
Australia Team
Basha Shek
|

Updated on: Mar 02, 2025 | 6:31 AM

Share

ఐసీసీ టోర్నీల్లో ఆసీస్ విజయ పరంపర కొనసాగుతోంది. తాజాగా ప్రతిష్ఠాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా సెమీఫైనల్లోకి ప్రవేశించింది. మొదటి మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై సంచలన విజయం తో టోర్నీలో ఆసీస్ కు శుభారంభం లభించింది. అయితే ఆ తర్వాత దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్‌లతో జరగాల్సిన మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు అయ్యాయి. దీంతో మొత్తం 4 పాయింట్లతో గ్రూపులో రెండో స్థానంలో నిలిచి సెమీస్ కు అర్హత సాధించింది ఆసీస్. అయితే కీలకమైన సెమీ-ఫైనల్ మ్యాచ్‌కు ముందే ఆస్ట్రేలియాకు టెన్షన్ పెరిగింది. ఎందుకంటే ఆ జట్టు స్టార్ బ్యాటర్ మాథ్యూ షార్ట్ గాయపడ్డాడు. లాహోర్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు మాథ్యూ షార్ట్ గాయపడినట్లు సమాచారం. అందువల్ల, అతను సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో ఆడతాడో లేదో అనే సందేహం ఉంది. ఈ కీలకమైన మ్యాచ్‌కు షార్ట్ అందుబాటులో లేకుంటే ఆస్ట్రేలియాకు అది పెద్ద దెబ్బ అవుతుంది.

గాయం కారణంగా పాట్ కమిన్స్, మిచెల్ మార్ష్, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్, మార్కస్ స్టోయినిస్ ఇప్పటికే జట్టుకు దూరమయ్యారు. ఇప్పుడు మాథ్యూ షార్ట్ సెమీ-ఫైనల్స్‌కు అందుబాటులో ఉండడం లేదు. దీంతో అతని స్థానంలో జేక్ ప్రెస్సర్ మెక్‌గుర్క్‌ను రంగంలోకి దించడం తప్ప వేరే మార్గం లేదు.

ఇవి కూడా చదవండి

ఆస్ట్రేలియా జట్టు:

స్టీవ్ స్మిత్ (కెప్టెన్), జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మార్నస్ లాబుస్చాగ్నే, గ్లెన్ మాక్స్‌వెల్, తన్వీర్ సంఘ్, ఆడమ్ జంపా, షాన్ అబాట్, అలెక్స్ కారీ, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ షార్ట్ (గాయపడ్డాడు).

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..