Border Gavaskar Trophy: మెల్‌బోర్న్‌లో 96 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టే అవకాశం.. ఇది గెలిస్తే కథ వేరే ఉంటది!
భారత్ మరియు ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ అత్యంత ఉత్కంఠభరిత దశకు చేరుకుంది. 1928 నాటి 332 పరుగుల ఛేజింగ్ రికార్డును ఆస్ట్రేలియా ఇప్పటికే అధిగమించింది. భారత బ్యాటర్లు పిచ్ పరిస్థితులకు అనుగుణంగా చరిత్ర సృష్టించవచ్చు. మ్యాచ్ డ్రా అయినా గొప్ప విజయంగా భావించబడుతుందనేది స్పష్టం.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్-ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో అత్యంత ఉత్కంఠభరిత దశకు చేరుకుంది. ఇప్పటి వరకు అత్యంత సుదీర్ఘ రికార్డుగా నిలిచిన 1928 నాటి అత్యధిక రన్ ఛేజింగ్ 332 పరుగులను దాటి ఆస్ట్రేలియా ఇప్పటికే 333 పరుగులు ఆధిక్యం సాధించి, ఆటను తమ చేతుల్లో ఉంచుకుంది. ఇంకా ఒక వికెట్ మిగిలి ఉండటం, పరుగుల తేడాను మరింత పెంచే అవకాశాన్ని కలిగిస్తోంది.
నాథన్ లియాన్, స్కాట్ బోలాండ్ చివరి భాగస్వామ్యంతో 55 పరుగుల రికార్డ్ భాగస్వామ్యాన్ని నమోదు చేయడం, 110 బంతుల ఎదుర్కొనడం భారత బౌలర్లను తీవ్ర ఒత్తిడికి గురి చేసింది. బుమ్రా, సిరాజ్, జడేజా, ఆకాష్ దీప్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ లాంటి విభిన్న బౌలింగ్ ఆప్షన్లు ఉన్నప్పటికీ, వారు ఈ జంటను అవుట్ చేయడంలో విఫలమయ్యారు.
మెల్‌బోర్న్ పిచ్ పూర్తి ఫాస్ట్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండడంతో, చివరి రోజు భారత బ్యాటర్లకు భారీ పరీక్ష ఎదురవుతోంది. పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, స్కాట్ బోలాండ్, నాథన్ లియాన్ వంటి ఆస్ట్రేలియా బౌలర్లు భారత బ్యాటింగ్ లైనప్‌ను గడగడలాడించవచ్చు.
96 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాలంటే భారత బ్యాటర్లు అద్భుతమైన ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. మ్యాచ్ డ్రా అయినా సరే ఇది గర్వించదగిన ఘనతగా భావించబడుతుంది. కానీ గెలిస్తే, అది క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయ ఘట్టంగా నిలవడం ఖాయం. కాగా ఐదవ రోజు మూడో సెసన్ ఆట కొనసాగుతోంది. భారత్ 6 వికెట్లు కోల్పోయింది. జైస్వాల్ ఒంటరి పోరాటం చేస్తున్నాడు. టీమిండియా గెలవాలంటే 25 ఓవర్లలో 205 పరుగులు చేయాల్సి ఉంది.