Team India: ‘ఎక్కడి నుంచి వచ్చారయ్యా.. టీమిండియా కొంప ముంచేందుకు.. ఇప్పటికే 3 ట్రోఫీలు ముంచేశారుగా’

BCCI Selectors: వెస్టిండీస్ పర్యటనకు భారత టెస్టు జట్టును ప్రకటించినప్పటి నుంచి సెలక్టర్లు నిరంతరం విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC Final 2023) ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు 209 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.

Team India: ‘ఎక్కడి నుంచి వచ్చారయ్యా.. టీమిండియా కొంప ముంచేందుకు.. ఇప్పటికే 3 ట్రోఫీలు ముంచేశారుగా’
India Vs West Indies
Follow us
Venkata Chari

|

Updated on: Jun 25, 2023 | 4:52 PM

BCCI Selectors: వెస్టిండీస్ పర్యటనకు భారత టెస్టు జట్టును ప్రకటించినప్పటి నుంచి సెలక్టర్లు నిరంతరం విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC Final 2023) ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు 209 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత, భారత ఆటగాళ్లు దాదాపు ఒక నెల విశ్రాంతి తీసుకున్నారు. వెస్టిండీస్‌తో 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా జులై 12 నుంచి టీమిండియా తొలి మ్యాచ్ ఆడాల్సి ఉంది. విండీస్ టూర్‌కు ఎంపిక చేసిన జట్టు విషయంలో భారత మాజీ ఆటగాళ్లు సెలక్టర్లను టార్గెట్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.

ఈ పర్యటన కోసం టెస్టు జట్టులో ఛెతేశ్వర్‌ పుజారా, ఉమేష్‌ యాదవ్‌లకు ఇంటి దారి చూపించారు. అయితే, మహ్మద్ షమీకి విశ్రాంతి ఇచ్చారు. టెస్టు జట్టులో కొత్త ఆటగాడిగా ముఖేష్ కుమార్ చోటు దక్కించుకున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో సహా చాలా మంది సీనియర్ ఆటగాళ్లు జట్టులో తమ స్థానాన్ని కాపాడుకోగలిగారు.

వెస్టిండీస్ టూర్‌లో యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించేందుకు సెలక్టర్లకు మంచి అవకాశం వచ్చింది. అయితే, అద్భుత అవకాశాన్ని సెలక్టర్లు మిస్ చేసుకున్నారంటూ దిగ్గజ బ్యాట్స్‌మెన్ సునీల్ గవాస్కర్ స్పోర్ట్స్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ప్రకటనలో విమర్శలు గుప్పించారు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ను కోల్పోయాం. తదుపరి అతిపెద్ద ఈవెంట్ ODI ప్రపంచ కప్. అందుకే టీమిండియా సీనియర్ ఆటగాళ్లకు కొంతకాలం పాటు టెస్టు క్రికెట్ నుంచి పూర్తి విశ్రాంతి ఇవ్వాలని, వీరిని వన్డే ప్రపంచకప్‌లో ఆడించాలి. నిరంతరం ఆడుతున్నారు. కాబట్టి, టెస్టుల నుంచి తప్పించి, వన్డే ప్రపంచ కప్ బరిలో మరింత రాటుదేల్చాలా చేస్తే బాగుండేందంటూ కామెంట్స్ చేశారు. అలాగే, యువ ఆటగాళ్లకు ఛాన్స్ ఇస్తే ఎంతో నేర్చుకునేవారని అన్నారు.

ఇవి కూడా చదవండి

ఈ లిస్టులో గవాస్కర్‌, జాఫర్‌తోపాటు మరెందరో మాజీలు కూడా టీమిండియా టెస్ట్ సెలక్షన్‌పై ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ క్రమంలో నెటిజన్లు కూడా తమదైన శైలిలో విమర్శలు సంధిస్తు్న్నారు. సెలక్షన్ బోర్డులోని పెద్దలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారంటూ, ఇప్పటికే మూడు ట్రోఫీల్లో మంచి జట్టును ఎంపిక చేయకగపోగా.. మూడు ట్రోఫీల్లోనూ టీమిండియాను నిండా ముంచేశారంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్