AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asian Games 2023: కోహ్లీ, రోహిత్‌లకు చెక్.. ఫ్యూచర్ స్టార్లతో ఆసియా గేమ్స్‌ బరిలోకి.. లిస్టులో ఎవరున్నారంటే?

Indian Cricket Team: విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి సీనియర్ ఆటగాళ్లు లేకుండా ఆసియా గేమ్స్‌ 2023లో టీమిండియా బరిలోకి దిగనుంది. కాంటినెంటల్ గేమ్ కోసం బీసీసీఐ ఫ్యూచర్ ప్లాన్‌తో ముందుకు సాగనుందంట.

Asian Games 2023: కోహ్లీ, రోహిత్‌లకు చెక్.. ఫ్యూచర్ స్టార్లతో ఆసియా గేమ్స్‌ బరిలోకి.. లిస్టులో ఎవరున్నారంటే?
rohit kohli
Follow us
Venkata Chari

|

Updated on: Jun 25, 2023 | 4:19 PM

Indian Cricket Team For Asian Games 2023: విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి సీనియర్ ఆటగాళ్లు లేకుండా ఆసియా గేమ్స్‌ 2023లో టీమిండియా బరిలోకి దిగనుంది. కాంటినెంటల్ గేమ్ కోసం బీసీసీఐ ఫ్యూచర్ ప్లాన్‌తో ముందుకు సాగనుందంట. కాంటినెంటల్ గేమ్ కోసం బీసీసీఐ ఫ్యూచర్ ప్లాన్‌తో ముందుకు సాగనుందంట. టీమిండియా బీ జట్టును బరిలోకి దింపేందుకు సిద్ధమైందట. ఎందుకంటే ఏ టీం ఈ సంవత్సరం ఆసియాకప్, వన్డే వరల్డ్ కప్‌లో ఫుల్ బిజీగా ఉంటుంది. ఈసారి ఆసియా క్రీడలు 2023 చైనాలోని హాంగ్‌జౌలో జరగనున్నాయి.

2018లో జకార్తాలో జరిగిన ఆసియా క్రీడల తర్వాత భారత జట్టు తొలిసారి కాంటినెంటల్ గేమ్స్‌లో పాల్గొననుంది. ఈ ఈవెంట్‌ను 2022లో నిర్వహించాల్సి ఉంది. అయితే కోవిడ్ కారణంగా అది ముందుకు సాగింది. జూన్ 30లోపు భారత క్రీడాకారుల జాబితాను భారత ఒలింపిక్ సంఘానికి పంపేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి సిద్ధంగా ఉంది.

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా వంటి సీనియర్ ఆటగాళ్లను జాబితాలో చేర్చడంలేదంట. ఎందుకంటే ఈ ఆటగాళ్లు అక్టోబర్-నవంబర్ మధ్య జరిగే వన్డే ప్రపంచ కప్‌లో పాల్గొంటారు. వారి స్థానంలో సంజూ శాంసన్, ఉమ్రాన్ మాలిక్, రుతురాజ్ గైక్వాడ్ వంటి ఆటగాళ్లతో ఆసియా క్రీడలకు భారత జట్టు తరపున వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

అంతకుముందు, 2010, 2014లో జరిగిన ఆసియా క్రీడలలో క్రికెట్ ఈవెంట్‌ నిర్వహించారు. అయితే పురుషులు, మహిళల జట్లను భారత బోర్డు పంపలేదు. ఈసారి మహిళా టాప్ ప్లేయర్ల జట్టు వెళ్లాలని భావిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..