Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: ఐపీఎల్ ఆడకపోతే.. భారత జట్టులోకి ఎంట్రీ లేదా.. బీసీసీఐని ఏకిపారేసిన మాజీ క్రికెటర్..

IND vs WI: జులై 12 నుంచి టెస్టు సిరీస్‌తో ప్రారంభం కానున్న వెస్టిండీస్ పర్యటనకు భారత్ వన్డే, టెస్టు జట్టును ప్రకటించింది. అయితే చాలా మంది భారత మాజీ క్రికెటర్లు 2 టెస్టు మ్యాచ్‌లకు భారత జట్టు ఎంపికపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

Team India: ఐపీఎల్ ఆడకపోతే.. భారత జట్టులోకి ఎంట్రీ లేదా.. బీసీసీఐని ఏకిపారేసిన మాజీ క్రికెటర్..
Bcci Selectors
Follow us
Venkata Chari

|

Updated on: Jun 25, 2023 | 2:20 PM

జులై 12 నుంచి టెస్టు సిరీస్‌తో ప్రారంభం కానున్న వెస్టిండీస్ పర్యటనకు భారత్ వన్డే, టెస్టు జట్టును ప్రకటించింది. అయితే చాలా మంది భారత మాజీ క్రికెటర్లు 2 టెస్టు మ్యాచ్‌లకు భారత జట్టు ఎంపికపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేసిన చాలా మంది ఆటగాళ్లను ఎంపిక చేయలేదన్నది వారి వాదన. ఇప్పుడు ఆయన వరుసలో భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ కూడా చేరారు. జట్టు ఎంపికలో ఐపీఎల్ ప్రదర్శనను మాత్రమే పరిగణిస్తారా ఏంటని, సెలక్షన్ బోర్డుకు 3 కీలక ప్రశ్నలను సంధించాడు.

మొదటి ప్రశ్న: ప్రకటించిన భారత టెస్టు జట్టులో నలుగురు ఓపెనర్లు ఉన్నారు. అసలు 4గురు ఓపెనర్ల అవసరం ఏంటి? ఈ 4 ఆప్షన్లకు బదులు దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన సర్ఫరాజ్ ఖాన్‌ను మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా ఎంపిక చేసుకోవచ్చని జాఫర్ సూచించాడు.

రెండవ ప్రశ్న: సర్ఫరాజ్ లాగా, అభిమన్యు ఈశ్వరన్, ప్రియాంక్ పంచల్ ఇద్దరూ రంజీ, ఇండియా A ల్లో మంచి ప్రదర్శన ఇచ్చారు. ఈ ప్రదర్శనతో వీరిద్దరూ చాలా కాలంగా భారత టెస్టు జట్టు తలుపు తడుతున్నారు. అయితే వీరిద్దరూ ఐపీఎల్‌లో ఆడనందున ఈ ఇద్దరిని ఎంపిక చేయలేదా? అయితే వీరిద్దరి కంటే ముందు రుతురాజ్ గైక్వాడ్ హఠాత్తుగా ఈ క్యూలో ఎలా ముందుకు వచ్చాడు? అంటూ ప్రశ్నలు కురిపించాడు.

ఇవి కూడా చదవండి

3వ ప్రశ్న: మహమ్మద్ షమీని జట్టు నుంచి తప్పించడంపై జాఫర్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. డబ్ల్యూటీసీ ఫైనల్స్ ముగిసిన తర్వాత భారత్‌కు ఒక నెల విశ్రాంతి లభించింది. అయితే ఇంత జరిగినా షమీకి విశ్రాంతినివ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. షమీ లాంటి బౌలర్, ఎక్కువ బౌలింగ్ చేస్తే ఫిట్‌గా మారి ఫామ్‌లోకి వస్తాడు. అయితే సెలక్షన్ బోర్డు షమీకి విశ్రాంతి ఇవ్వడంపై జాఫర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

భారత టెస్టు జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యస్సవి జైస్వాల్, అజింక్యా రహానే (వైస్ కెప్టెన్), కెఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), ఆర్. అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, నవదీప్ సైనీ.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..