విరాట్ – రోహిత్ భవిష్యత్తుపై బీసీసీఐ కీలక నిర్ణయం.. 2027 ప్రపంచ కప్ నుంచి తప్పించేందుకు స్కెచ్?
Rohit Sharma and Virat Kohli: రోహిత్, విరాట్ వన్డే ప్రపంచ కప్‌లో ఆడవచ్చని బౌలింగ్ కోచ్ మోర్కెల్ అన్నారు. మాజీ కెప్టెన్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 2027 వన్డే ప్రపంచ కప్‌లో ఆడవచ్చని టీం ఇండియా బౌలింగ్ కోచ్ మోర్నె మోర్కెల్ అభిప్రాయపడ్డారు. వారు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండి, వారి శరీరాలు దీన్ని చేయగలవని భావిస్తే, అది కష్టం కాదంటూ తెలిపాడు.

Rohit Sharma and Virat Kohli: డిసెంబర్ 6 తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ భవిష్యత్తుపై చర్చించడానికి బీసీసీఐ సమావేశం ఏర్పాటు చేసింది. కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నట్లు తెలుస్తోంది. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, 2027 వన్డే ప్రపంచ కప్‌లో రోహిత్-విరాట్ పాత్ర, జట్టు వ్యూహాన్ని స్పష్టం చేయడానికి ఈ సమావేశం జరుగుతుందని బోర్డు అధికారి ఒకరు తెలిపారు.
భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో చివరి మ్యాచ్ డిసెంబర్ 6న విశాఖపట్నంలో జరుగుతుంది. తదుపరి సమావేశం విశాఖపట్నం లేదా అహ్మదాబాద్‌లో జరుగుతుంది. సీనియర్ బ్యాట్స్‌మెన్స్ ఇద్దరూ ఫిట్‌నెస్, ఫామ్ మెయింటెనెన్స్ ప్లాన్ అందించాలని కోరవచ్చు. బోర్డు వారిని మరింత దేశీయ క్రికెట్ ఆడమని కూడా సలహా ఇవ్వవచ్చు అని తెలుస్తోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్, టీ20 అంతర్జాతీయాల నుంచి రిటైర్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వన్డే క్రికెట్ మాత్రమే ఆడుతున్నారు.
” రోహిత్, విరాట్ లాంటి నైపుణ్యం కలిగిన ఆటగాళ్లు భవిష్యత్తులో వారి నుంచి భారత జట్టు ఏం ఆశిస్తుందో, ప్రస్తుత జట్టు నిర్వహణ వారి నుంచి ఏమి కోరుకుంటుందో స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి, ఎందుకంటే వారు అనిశ్చితితో టీమిండియా తరపున క్రికెట్ ఆడలేరు” అని బోర్డు వర్గాలు తెలిపాయి. రోహిత్ తన ఫిట్‌నెస్, ప్రదర్శనపై దృష్టి పెట్టాలని బోర్డు కోరింది. అంతేకాకుండా, అతని భవిష్యత్తు గురించి ఎటువంటి ప్రకటనలు చేయకుండా నిషేధించింది.
రోహిత్ తన దూకుడు క్రికెట్‌ను కొనసాగించాల్సిందే..
“ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో చేసినట్లుగా రోహిత్ తన దూకుడు బ్యాటింగ్ శైలిని కొనసాగించాలని జట్టు కోరుకుంటోంది. అతను అగ్రస్థానంలో నిర్భయమైన బ్యాట్స్‌మన్‌గా ఆడతాడని భావిస్తున్నారు. ఆస్ట్రేలియాలో పరిస్థితులు కష్టంగా ఉన్నాయి. కానీ అతను రిస్క్‌లు తీసుకోవడానికి దూరంగా ఉన్నట్లు అనిపించింది. యువ బ్యాట్స్‌మెన్‌కు విషయాలు సులభతరం చేయడానికి ఇద్దరూ బ్యాటింగ్ ఆర్డర్‌ను నడిపించాలని భావిస్తున్నారు” అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
కోహ్లీ, రోహిత్ కలిసి 84 వన్డే సెంచరీలు..
రోహిత్, విరాట్ వన్డే ప్రపంచ కప్‌లో ఆడవచ్చని బౌలింగ్ కోచ్ మోర్కెల్ అన్నారు. మాజీ కెప్టెన్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 2027 వన్డే ప్రపంచ కప్‌లో ఆడవచ్చని టీం ఇండియా బౌలింగ్ కోచ్ మోర్నె మోర్కెల్ అభిప్రాయపడ్డారు. వారు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండి, వారి శరీరాలు దీన్ని చేయగలవని భావిస్తే, అది కష్టం కాదంటూ తెలిపాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








