IND vs SA 1st ODI: తొలి వన్డే నుంచి పంత్ ఔట్.. తెలుగబ్బాయ్‌కి లక్కీ ఛాన్స్.. ఎవరంటే?
India's Predicted XI For 1st ODI: నవంబర్ 30 ఆదివారం రాంచీలో దక్షిణాఫ్రికాతో జరగనున్న తొలి వన్డేలో టీమిండియా ప్లేయింగ్ 11లో ఎవరు ఉంటారోననే ఆసక్తి పెరిగింది. కెప్టెన్ శుభ్‌మాన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ గాయాలతో భారత టాప్ ఫోర్‌లో రెండు కీలక ఖాళీలు ఏర్పడ్డాయి. దీనివల్ల మరో ఇద్దరు ఆటగాళ్లకు చోటు దక్కింది.

IND vs SA 1st ODI: రాంచీ వేదికగా ఆదివారం జరగనున్న తొలి వన్డేకు టీమిండియా తుది జట్టుపై మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ ఆసక్తికర అంచనాలు వేశారు. ముఖ్యంగా సీనియర్ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను పక్కనపెట్టి, యువ ఆటగాడు తిలక్ వర్మకు అవకాశం కల్పించాలంటూ సూచించాడు.
రిషబ్ పంత్ అవుట్.. తిలక్ వర్మ ఇన్..
గాయాల కారణంగా కెప్టెన్ శుభ్‌మన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఈ సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. దీంతో జట్టులోకి రిషబ్ పంత్, రుతురాజ్ గైక్వాడ్‌లను తిరిగి తీసుకున్నారు. అయితే పార్థివ్ పటేల్ మాత్రం తన అంచనా జట్టులో వీరిద్దరికీ చోటు కల్పించలేదు.
గిల్ స్థానంలో ఓపెనర్‌గా యశస్వి జైస్వాల్..
నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్ లోటును భర్తీ చేయడానికి తిలక్ వర్మను తీసుకున్నారు. తిలక్ వర్మ చివరగా 2023 డిసెంబర్‌లో వన్డే ఆడిన సంగతి తెలిసిందే.
గంభీర్ ఫిలాసఫీకి భిన్నంగా..
హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సాధారణంగా ఎక్కువ మంది ఆల్ రౌండర్లతో జట్టును కూర్పు చేయడానికి ఇష్టపడతారు. కానీ పార్థివ్ పటేల్ మాత్రం గంభీర్ వ్యూహానికి భిన్నంగా జట్టును ఎంపిక చేశారు. కేవలం ఇద్దరు ఆల్ రౌండర్లనే (జడేజా, సుందర్/నితీష్ రెడ్డి) తీసుకుని, బౌలింగ్‌కు ప్రాధాన్యమిస్తూ ముగ్గురు స్పెషలిస్ట్ పేసర్లు, ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్‌ను ఎంపిక చేశారు.
పార్థివ్ పటేల్ అంచనా వేసిన తుది జట్టు (Team India Predicted Playing XI):
రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్ (కెప్టెన్/వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ లేదా నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
