IPL 2025: ఆగు హార్దిక్ బ్రో నీ బ్యాట్ లో స్ప్రింగులు ఉన్నాయేమో చూద్దాం? IPL లో రేర్ మూమెంట్!
ఢిల్లీ వేదికగా జరిగిన ముంబై vs ఢిల్లీ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా బ్యాట్ తనిఖీ సంఘటన హైలైట్‌గా నిలిచింది. అంపైర్ క్రిస్ గఫానీ ప్రత్యేక బ్యాట్ గేజ్‌తో హార్దిక్ బ్యాట్‌ను కొలవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. హార్దిక్ తక్కువ స్కోరు చేసినా, ముంబై జట్టు భారీ లక్ష్యంతో విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ ద్వారా అభిమానులకు వినోదంతో పాటు క్రికెట్ నియమాలపై ఆసక్తికర సమాచారం కూడా లభించింది.

ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన IPL 2025 మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బ్యాట్ తనిఖీ చేయబడిన సంఘటన అభిమానులలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. డిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఈ 29వ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగగా, ముంబై జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 205 పరుగులు చేసింది. కానీ, ఆ మ్యాచ్‌లో మైదానంలో జరిగిన ఒక విపరీత సంఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్‌కి మైదానంలోకి వచ్చాడు. ఆ సమయంలో ఆన్-ఫీల్డ్ అంపైర్ క్రిస్ గఫానీ అతన్ని ఆపి, అతని బ్యాట్‌ను ప్రత్యేకమైన “బ్యాట్ గేజ్” ద్వారా కొలిచారు. ఇది అభిమానులను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకంటే ఆట మధ్యలో అంపైర్లు ఇలా బ్యాట్‌ను తనిఖీ చేయడం చాలా అరుదైన విషయమే.
ఇది చట్టవిరుద్ధం కానే కాదు కానీ IPL నియమావళి ప్రకారం, బ్యాట్‌కి నిర్దిష్ట పరిమాణ పరిమితులు ఉన్నాయి. బ్యాట్ వెడల్పు గరిష్టంగా 4.25 అంగుళాలు, లోతు 2.64 అంగుళాలు, అంచు మందం 1.56 అంగుళాలను మించరాదు. ఈ పరిమాణాలకు అనుగుణంగా ఉందా లేదా అన్నదానిని నిర్ధారించేందుకే అంపైర్ గేజ్‌ను ఉపయోగిస్తారు. ఈ మ్యాచ్‌లో జరిగిన తనిఖీ అదే రోజు మూడోసారి జరగడం విశేషం. ఇదివరకే RR vs RCB మ్యాచ్‌లో షిమ్రాన్ హెట్మెయర్, ఫిల్ సాల్ట్ తమ బ్యాట్‌లను తనిఖీ చేయించుకున్నారు.
హార్దిక్ పాండ్యా బ్యాట్ ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినా, అతను ఆటలో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. కేవలం 2 పరుగులకే అవుట్ అయ్యాడు. అయినప్పటికీ, అతని నాయకత్వంలోని ముంబై జట్టు 205 పరుగుల భారీ లక్ష్యాన్ని ముందు నిలిపి, ఢిల్లీ క్యాపిటల్స్‌ను 193 పరుగులకే పరిమితం చేసి విజయం సాధించింది. కరుణ్ నాయర్ ఢిల్లీ తరఫున అద్భుతంగా 89 పరుగులు చేసినా, డెత్ ఓవర్లలో తడబడడంతో ఢిల్లీ ఓటమిని ఎదుర్కొంది.
ఈ విజయంతో ముంబై ఇండియన్స్ 6 మ్యాచ్‌లలో రెండో విజయాన్ని నమోదు చేసుకొని పాయింట్ల పట్టికలో 7వ స్థానానికి ఎగబాకింది. మరోవైపు, ఈ పరాజయం వరకూ అజేయంగా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ 5 మ్యాచ్‌లలో 4 విజయాలతో రెండవ స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్ మైదానంలో హార్దిక్ బ్యాట్ తనిఖీ చేయడం, అతని చిన్న ఇన్నింగ్స్, కానీ జట్టు విజయంతో ముగియడమన్నీ కలిపి అభిమానులకు మర్చిపోలేని అనుభూతిని ఇచ్చాయి.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..