AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: మనల్ని ఎవడ్రా ఆపేది.. వింత సైగలతో రెచ్చగొట్టిన బంగ్లా బ్యాటర్.. కోహ్లీ, సిరాజ్‌ల పవర్‌ఫుల్ పేబ్యాక్.. చూస్తే సెగలే!

Mohammed Siraj vs Litton Das: భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్‌లో, భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్, బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ లిట్టన్ దాస్ మధ్య హీట్ బాగా పెరిగింది.

Video: మనల్ని ఎవడ్రా ఆపేది.. వింత సైగలతో రెచ్చగొట్టిన బంగ్లా బ్యాటర్.. కోహ్లీ, సిరాజ్‌ల పవర్‌ఫుల్ పేబ్యాక్.. చూస్తే సెగలే!
Mohammed Siraj Vs Litton Das Viral Video
Venkata Chari
|

Updated on: Dec 16, 2022 | 7:39 AM

Share

India Vs Bangladesh: భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ ఇప్పటివరకు చాలా ఉత్కంఠగా సాగింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ పాత రూపం కనిపించిన సంఘటన కూడా కనిపించింది. బ్యాటింగ్ సమయంలో, బంగ్లాదేశ్ ఆటగాడు లిట్టన్ దాస్ మహ్మద్ సిరాజ్‌తో కొంత టాంపరింగ్ చేశాడు. సిరాజ్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. తర్వాతి బంతికే లిటన్ దాస్‌ను బౌల్డ్ చేశాడు. బోల్డ్ అయిన తర్వాత, విరాట్ కోహ్లీ కూడా లిట్టన్ దాస్‌పై పాత పద్ధతిలో స్పందించడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

లిట్టన్ దాస్ గర్వంతో ఎగిసిపడ్డాడు..

ఇన్నింగ్స్ 14వ ఓవర్ తొలి బంతికే మహ్మద్ సిరాజ్, లిట్టన్ దాస్ మధ్య పరిస్థితి బాగా హీటెక్కింది. తొలి బంతి విసిరిన సిరాజ్.. లిట్టన్ దాస్ బాగానే ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత లిట్టన్ దాస్, సిరాజ్‌‌తో ఏదో చెప్పాడు. దీనిపై లిట్టన్ దాస్ స్పందిస్తూ.. సిరాజ్ మాటలు వినపడనట్లుగా చెవిపై చేయి పెట్టుకుని ఓ రియాక్షన్ ఇస్తూ.. ఈ బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ సిరాజ్ వైపు కదిలాడు. ఆ తర్వాత బంతికే లిట్టన్‌ దాస్‌ను సిరాజ్ బోల్తా కొట్టించి, పెవిలియన్ చేర్చాడు.

ఇవి కూడా చదవండి

లిట్టన్ దాస్‌కు భారీషాక్..

లిట్టన్ దాస్ వికెట్ పడగొట్టిన సిరాజ్‌.. తనదైన శైలిలో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. నోటిపై చేయి పెట్టి సంబరాలు చేసుకున్నాడు. ఆ తర్వాత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ లిట్టన్ దాస్ స్టైల్‌లో చెవిపై చేయి పెట్టుకుని ఏం వినపడలేదంటూ రియాక్షన్ ఇచ్చాడు. కింగ్ కోహ్లి ఈ స్పందన అందరి హృదయాలను గెలుచుకుంది. కోహ్లీ పాత ఫామ్ ఈ స్టైల్‌లో కనిపించింది. మైదానంలో విరాట్ చాలా దూకుడుగా కనిపిస్తున్నాడు.

బౌలింగ్‌లో అదరగొట్టిన సిరాజ్..

మ్యాచ్ రెండో రోజు భారత బౌలర్లు తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నారు. ఇందులో మహ్మద్ సిరాజ్ మూడు వికెట్లు తీశాడు. 9 ఓవర్లలో 14 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. దీంతో పాటు కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు, ఉమేష్ యాదవ్ ఒక వికెట్ తీశారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..