షకిబుల్ తీరును తప్పుపట్టిన క్రికెట్ ప్రపంచం.. అతడు చేసిన నేరం ఏంటో తెలిస్తే…
shakib al hasan: జెంటిల్‌మన్ ఆటగా పిలుచుకునే క్రికెట్లో తప్పిదాలు జరుగుతూనే ఉంటాయి. కానీ, ఉద్దేశపూర్వకంగా మైదానంలో నియంత్రణ కోల్పోయి ప్రవర్తించడం చాలా అరుదు.
జెంటిల్‌మన్ ఆటగా పిలుచుకునే క్రికెట్లో తప్పిదాలు జరుగుతూనే ఉంటాయి. కానీ, ఉద్దేశపూర్వకంగా మైదానంలో నియంత్రణ కోల్పోయి ప్రవర్తించడం చాలా అరుదు. శుక్రవారం ఢాకా టీ20 లీగ్‌లో బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకిబుల్ హసన్ ఇలాగే వ్యవహరించాడు. ఒకసారి కాదు రెండుసార్లు కాస్త అతి చేశాడు. ఈ దృశ్యాలు చూసిన వారంతా ఇదేంటి అని ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. జెంటిల్‌మన్ గేమ్‌కు ఇలాంటివారు అవసరమా అంటూ ప్రశ్నిస్తున్నారు.
అసలేం జరిగింది?
లీగ్‌లో భాగంగా మహమ్మదీయన్ స్పోర్టింగ్ క్లబ్(MSC), అబహానీ లిమిటెడ్(AL) మధ్య మ్యాచ్ జరిగింది. ఎంఎస్సీకి ప్రాతినిధ్యం వహిస్తున్న షకిబుల్.. ఏఎల్ బ్యాట్స్‌మన్ ముష్ఫికర్ రహీమ్‌కు బౌలింగ్ చేశాడు. ఎల్బీ కోసం అంపైర్‌కు అప్పీల్ చేయగా.. అది నాటౌట్‌గా ప్రకటించాడు. అంతే ఆగ్రహానికి లోనైన హసన్.. వికెట్లను కాళ్లతో తన్నాడు.
Who’s this? Is it Shakib al Hasan? pic.twitter.com/kk69rdyyod
— Iceland Cricket (@icelandcricket) June 11, 2021
మరికొద్దిసేపటికి పవర్‌ప్లే ఓవర్ల సందర్భంగా మరోసారి అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు షకిబుల్. అంపైర్‌పై విరుచుకుపడ్డాడు. అక్కడితో ఆగకుండా నాన్ స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న మూడు వికెట్లను చేతులతో తీసి గ్రౌండ్‌పై విసిరి కొట్టాడు.
5.5 overs bowled Dls method would have come to play after 6 overs! That’s why Shakib was frustrated to bowl another ball. And also umpire gave not out to a plumb LBW! Maybe Shakib sensed something fishy! Because fixing is nothing new in DPL#DPLT20 #DPL #ShakibAlHasan #Abahani pic.twitter.com/viCzCUTKHl
— Tamim Iqbal FC (@Tamim28fc) June 11, 2021
ఈ ఘటనపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలని ప్రపంచ దేశాల క్రికెట్ సంఘాలు, క్రీకెట్ అభిమానులు ఎదిరిచూస్తున్నాయి. ఐపీఎల్ సందర్భంగా షకిబుల్‌పై ఐసీసీ విధించిన నిషేధం ఇటీవలే ముగిసింది.
అయితే ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారడంతో షకిబుల్ దిగివచ్చాడు..” నన్ను క్షమించండి..ఈ ఘటనపై ట్విట్టర్ వేదికగా క్షమాపణలు కోరాడు షకిబుల్. “ఓ సీనియర్ ఆటగాడిగా నేనిలా చేయాల్సింది కాదు. కానీ, కొన్ని సార్లు దురదృష్టవశాత్తూ ఇలా జరుగుతుంటాయి. ఈ విషయంపై ప్రతి ఒక్కరికీ క్షమాపణలు కోరుతున్నా. భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతం కావని మీకు మాట ఇస్తున్నా. అందరికీ ధన్యవాదాలు” అని షకిబ్ పేర్కొన్నాడు.